మలయాళ చిత్రం `తుడరుమ్` ఇటీవలే విడుదలై మాతృకలో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొహన్ లాల్, శోభన, ప్రకాష్ వర్మ , థామస్ మాథ్యు, బిను పప్పు ప్రధాన పాత్రల్లో తరుణ్ మూర్తి తెరకెక్కించిన క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ఇది. కొంత కాలంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ల హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అదే వేవ్ లో `తుడరుమ్` కూడా మంచి లాభాలు తెచ్చి పెట్టింది.
ఇప్పుడీ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. హీరో ఎవరు? అన్నది ఫైనల్ కాలేదు కానీ అక్కడ కూడా తరుణ్ మూర్తి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోగా అజయ్ దేవగణ్ నటించే అవకాశం ఉంది. మరి తెలుగులో రీమేక్ అవ్వదా? అంటే రైట్స్ కోసం ఇక్కడ నుంచి చాలా మంది నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ ఇంకా ఎవరికీ రైట్స్ ఇవ్వలేదు. దీంతో ఇక్కడా మాతృక దర్శకుడే రంగంలోకి దిగడానికి అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.
అలాగే ఇందులో కింగ్ నాగార్జున అయితే బాగుంటుందని తరుణ్ మూర్తి భావిస్తున్నాడుట. సీనియర్ హీరోల్లో సెటిల్డ్ పెర్పార్మెన్స్ ఇచ్చే నటులైతే బాగుంటుందని..దాంతో పాటు కష్టపడే తత్వం గల నటుడైతే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య లాంటి స్టార్లు అందుబాటులో ఉన్నా? వారికన్నా ఈ కథ నాగార్జున ఇమేజ్ కు పర్పెక్ట్ గా సూటువుతుందని అనుకుంటున్నారుట. దర్శకుడి సన్నిహిత వర్గాల నుంచి నాగార్జున చెవిన కూడా విషయం వేసినట్లు తెలిసింది.
మరి నాగ్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? అన్నది చూడాలి. ప్రస్తుతం నాగార్జున 100వ సినిమా రా. కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కింగ్ నటించిన రెండు సినిమాలు `కూలీ`, `కుబేర` లో కీలక పాత్రలకే పరిమితమయ్యారు. దీంతో నాగ్ 100వ సినిమాతో భారీ హిట్ పై కన్నేసారు. ఈ చిత్రాన్ని కూడా అన్నపూర్ణ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.




7.8లక్షల కోట్ల డీల్‌తో వార్నర్ బ్రదర్స్ ఖతం
Loading..