నాగచైతన్య కు కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేదు. తన రేంజ్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. `తండేల్` తో 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. అవకాశాల పరంగా ఎలాంటి ఢోకా లేదు. నాగచైతన్యకున్న ఇమేజ్ కు దర్శకులెంతో మంది పోటీ పడుతున్నారు. అలాగే అఖిల్ కూడా కెరీర్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. సినిమాలు చేస్తున్నా? సరైన ఫలితాలు రావడం లేదు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` తర్వాత మరో సక్సెస్ పడలేదు. ప్రస్తుతం `లెనిన్` చేస్తున్నాడు.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే అంచనాలున్నాయి. అయితే అన్నదమ్ములిద్దరు ఎక్కువగా కొత్త దర్శకులతోనే పని చేస్తున్నారు. పెద్ద విజయాలు అందించిన దర్శకులతో పనిచేయలేదు. వాళ్లతో ఎప్పుడు పని చేస్తారు? అంటే? టైమ్ వచ్చినప్పుడనే చెప్పాలి. ఈ విషయంలో నాగచైతన్య స్టార్ డైరెక్టర్లను ఎంత మాత్రం ఇబ్బంది పెట్టే ఆలోచనలో లేడు. ఎందుకంటే వాళ్లతో చైతన్య పనిచేయడం అన్నది చిటికేసినంత పని.
ఈ విషయంలో బిడ్డలిద్దరికీ భరోసా కల్పించింది డాడ్ నాగార్జున. నాగ్ ఎన్నోసార్లు అడిగారుట. ఏ డైరెక్టర్ తో పనిచేయాలని ఉందో? చెప్పండని చాలాసార్లు అడిగారుట. ఫోన్ చేసి మాట్లాడుతానని..స్టూడియో నుంచి అడ్వాన్స్ పంపి స్తానని..తాను మాట్లాడితే ఎవరూ నో చెప్పరని..ప్రాజెక్ట్ సెట్ చేస్తానని ఎన్నోసార్లు నాగ్ అడిగారుట. కానీ నాగ్ అలా చేయ డం నాగ చైతన్యకు నచ్చకే ఆ ఛాన్స్ తీసుకోలేదన్నాడు. తనలో ఎక్కడో స్వతంత్రంగా ఎదగాలి అన్న భావన తప్ప మరో ఆలోచన లేదన్నాడు.
దీంతో నాగ చైతన్య అక్కినేని బ్రాండ్ అనేది కేవలం ఎంట్రీ వరకే పరిమితం చేసాడని తెలుస్తోంది. చైతన్య చెప్పిం ది నిజమే? ఏ రంగంలోనైనా స్వత్రంగా ఎదిగితేనే గుర్తింపు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా? ఆ స్టార్ తో నేను పని చేయాలని వాళ్లకు వాళ్లగా ముందుకు రావాలి. ఆ నటుడిని ఎంతో ఫ్యాషన్ తో డైరెక్టర్ చేయాలి. ఆ స్థాయికి నటుడు చేరుకున్నప్పుడే కెరీర్ కి అసలైన సక్సెస్ పడినట్లు. అఖిల్ లో కూడా ఈ రియలైజేషన్ ఈ మధ్య కనిపిస్తోంది.




ఫస్ట్ యానివర్సరీ - స్పెషల్ వీడియోతో శోభిత 
Loading..