Advertisement

‘కవచం’కు ముందు 50 కథలు విన్నాడంట!

Tue 13th Nov 2018 05:04 PM
bellamkonda sai srinivas,kavacham,teaser,launch,highlights  ‘కవచం’కు ముందు 50 కథలు విన్నాడంట!
Kavacham Teaser Launched ‘కవచం’కు ముందు 50 కథలు విన్నాడంట!
Advertisement

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళని దర్శకుడిగా పరిచయం చేస్తూ యువ నిర్మాత నవీన్ శొంఠినేని(నాని) నిర్మిస్తోన్న రొమాంటిక్  థ్రిల్లర్ చిత్రం ‘కవచం’. చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ, థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్స్ కాజల్, మెహ్రీన్ సంయుక్తంగా ‘కవచం’ టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ చోటా కె. నాయుడు, సంగీత దర్శకుడు తమన్, చిత్ర దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ, కళా దర్శకుడు చిన్న, ఎడిటర్ చోట కె. ప్రసాద్, రచయిత కేశవ్ పప్పుల, చీఫ్ కో- డైరెక్టర్ పుల్లారావు కొప్పినీడి, సహ నిర్మాత చాగంటి శాంతయ్య పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘మంచి కంటెంట్ బేస్డ్ మూవీ చేయాలని సుమారు 50 కథలు విన్నాను. అందులో శ్రీనివాస్ చెప్పిన ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కథ కథనం చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ మూవీ నచ్చుతుంది. ఇలాంటి ఒక మంచి మూవీని నాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్‌కి నా థ్యాంక్స్. కొత్త డైరెక్టర్‌లా కాకుండా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌లా తీశారు. సినిమా చూశాక నేనే సర్‌ప్రైజ్ అయ్యాను. థమన్ మంచి సాంగ్స్ ఇచ్చారు. చోట గారు నా ఫస్ట్ మూవీ‌కి వర్క్ చేసారు. మళ్ళీ ఈ సినిమా చేయడం వెరీ హ్యాపీ. ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. నాతో సినిమా తీయాలని నిర్మాత నాని ఎప్పటి నుంచో వేచి చేస్తున్నాడు. అతను ఇంత మంచి సినిమా చేయటం చాలా హ్యాపీగా ఉంది. కాజల్ నా ఫేవరెట్ హీరోయిన్. ఆమెతో ఇంకా రెండు మూవీస్ చేస్తున్నాను. మెహ్రీన్ ఒక కీ రోల్‌లో నటించింది. ఛాలెంజింగ్‌గా తీసుకుని ఆ పాత్ర చేసింది. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ నా థ్యాంక్స్..’’ అన్నారు. 

డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ మాట్లాడుతూ.. ‘‘నన్ను నమ్మి నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సురేష్‌గారికి, మా హీరో సాయి‌కి నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా నిర్మాత నాని, శాంతయ్యగారికి నా థ్యాంక్స్. చోటా కె. నాయుడు గారితో ఈ సినిమాకి వర్క్ చేయడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. రెగ్యులర్ ఫిలింలా కాకుండా కొత్త జోనర్లో చాలా కొత్తగా ఈ చిత్రం ఉంటుంది. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి నా థ్యాంక్స్. మా హీరో, నిర్మాత, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను’’ అన్నారు. 

నిర్మాత నవీన్ శొంఠినేని (నాని) మాట్లాడుతూ.. ‘‘సింగిల్ సిట్టింగ్‌లో కథ ఓకే చేసి మాకు సినిమా చేసిన హీరో సాయికి నా థ్యాంక్స్. కాజల్, మెహ్రీన్ ఇద్దరూ కథ విని బాగా ఎక్సైటయ్యి ఈ సినిమా చేశారు. యూనిట్ అంతా కష్టపడి ఒక మంచి సినిమా చేశారు. ముఖ్యంగా మా శాంతయ్య గారు ఈ ప్రొడక్షన్ అంతా దగ్గరుండి చూసుకొని షూటింగ్ జరపించారు. థమన్ ది బెస్ట్ సాంగ్స్, ఆర్‌ఆర్ ఇచ్చారు. మా డైరెక్టర్‌తో ఎన్ని సినిమాలైనా చేయడానికి నేను రెడీ. సినిమా రిలీజ్ తర్వాత మా సినిమానే మాట్లాడుతుంది...’’ అన్నారు. 

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ ఫిలిం. స్టోరీ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. నిజంగా వెరీ ఇంటిలిజెంట్ మూవీ ఇది. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. సాయి అమేజింగ్ టాలెంట్ ఉన్న హీరో. లవ్లీ వర్కింగ్ విత్ డైరెక్టర్ శ్రీనివాస్. చాలా అందంగా ఈ చిత్రాన్ని తీశారు...’’ అన్నారు. 

మెహ్రీన్ మాట్లాడుటూ.. ‘‘టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా  హ్యాపీగా వుంది. ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది..’’ అన్నారు. 

Kavacham Teaser Launched:

Kavacham Movie Teaser Launch Highlights

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement