Advertisement

విజయవాడ రాజకీయం వేడెక్కుతుంది..!

Tue 18th Oct 2016 03:41 PM
vijayawada,devineni nehru,vallabhaneni vamsi,tdp,chandrababu  విజయవాడ రాజకీయం వేడెక్కుతుంది..!
విజయవాడ రాజకీయం వేడెక్కుతుంది..!
Advertisement

కృష్ణాజిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగా సాగుతుంటాయి. ఇప్పుడు ఆ ప్రాంతం కేంద్రంగా ఏపీ రాజధాని కూడా కావడంతో ఆ వేడి ముదిరి పాకాన పడుతుంది. కృష్ణా జిల్లా మొత్తంపై గ‌న్న‌వ‌రం రాజకీయం చాలా ప్ర‌త్యేక‌మైంది. అక్క‌డ ఎప్పుడూ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్కడి తేదేపాలో  గ్రూప్ రాజ‌కీయాలు రచ్చరేపుతుంటాయి. ఆ ప్రాంతం నాయకులైన బాల‌వ‌ర్ధ‌న్‌రావుకు, వంశీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంత రాజకీయ వేడి ఉంటుంది. ఇక్కడి వేడి ఎంతకూ తగ్గకపోవడానికి కారణం గ్రూపు రాజకీయాలే. కానీ ఈ మధ్య వంశీకి కొత్త పోరు ఎదురైంది. ఇదీ కూడా ఆధిపత్య పోరులో భాగంగానే వచ్చిపడింది. దేవినేని నెహ్రూ తేదేపాలో చేరిన‌ప్ప‌టి నుండి వంశీకి, దేవినేనికి మ‌ధ్య వార్ మొద‌లైనట్టేనని చెప్పాలి. కాగా దేవినేని  త‌న‌కి తెలియ‌కుండా కంకిపాడుకు సంబంధించిన  విషయాల్లో వేలు పెట్ట‌డాన్ని వంశీ భరించలేకపోతున్నాడు.

వంశీ సామ్రజ్యంగా చెప్పుకునే కంకిపాడులో దేవినేని ఆధిపత్యం కొనసాగిస్తుండటాన్ని చూసి వంశీ అస్సలు సహించలేకున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పటికే దేవినేనికి పలు మార్లు పరోక్షంగా వంశీ వార్నింగ్ కూడా ఇచ్చాడని టాక్. వంశీ ఈ విషయంలో నిరంతరం చాలా మెలకువతో ఉన్నట్లుగా తెలుస్తుంది. దేవినేని  నెహ్రూ పేరు చెప్పుకొని ఆ ప్రాంతంలో రాజకీయాలను నడపాలనుకుంటున్న వారి అనుచరగణం వేలును క‌ట్ చేస్తానంటూ వంశీ ప్రకటించేశాడు కూడాను.  ఇదే అంశంపై కొనసాగుతున్న పోరు విషయం పార్టీ అధినేత చంద్ర‌బాబు దృష్టికి  కూడా వెళ్లింది. కానీ కంకిపాడుపై వంశీ అడ్డుపడుతుండటంతో దేవినేని కుమారుడు అవినాష్ కు ఏదో ఒక చోట ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి కాబట్టి చంద్రబాబుకి ఇక్కడి పరిస్థితి ప్రాణసంకటంగానే తయారైంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement