Advertisement

‘ఉత్తమవిలన్‌’కు ఎదురైన కష్టాలు ఏమిటి?

Mon 04th May 2015 07:03 AM
kamal haasan,uttama villain movie,lingu swami,uttama villain release problems  ‘ఉత్తమవిలన్‌’కు ఎదురైన కష్టాలు ఏమిటి?
‘ఉత్తమవిలన్‌’కు ఎదురైన కష్టాలు ఏమిటి?
Advertisement

కొన్ని సినిమాలు నిర్మాణంలో ఎంత సంచలనం సృష్టిస్తాయో... రిలీజ్‌ సమయంలోనూ రకరకాల కారణాలతో ఆగిపోయి మరింత సంచలనం క్రియేట్‌ చేస్తాయి. కమల్‌హాసన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఉత్తమవిలన్‌’ కు ఇదే పరిస్థితి ఎదురయింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ చిత్రం శనివారం సాయంత్రం విడుదలైంది. దీనికి అనేక ఆర్ధిక కారణాలు ఉన్నాయి.ఈ సమస్య తమిళ, తెలుగు రెండు వెర్షన్స్‌ రెండింటికి ఎదురైంది. ఈ విషయమై తెలుగువెర్షన్‌ రిలీజ్‌ చేసిన నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ... తమిళ డబ్బింగ్‌ చిత్రాలు తీసుకునే వారికి ఇది ఓ గుణపాఠం అన్నాడు.

అలాగే అందుతున్న సమాచారం ప్రకారం... ఈ చిత్రం రిలీజ్‌ రోజు నాటికి 40కోట్లు అప్పులో ఉంది. దాంతో ఫైనాన్షియర్స్‌ రిలీజ్‌ చేయడానికి అంగీకరించలేదు. చివరి నిమిషాల్లో నిర్మాత లింగుస్వామి అప్పు గురించి బయటపెట్టాడు. దాంతో వెంటనే తమిళ నిర్మాతల మండలి, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, శరత్‌కుమార్‌ (సౌత్‌ ఇండియా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) కలిసి పని చేసి ఈ సమస్యను పరిష్కరించారు.చివరకు కమల్‌ హాసన్‌ మరో సినిమాను లింగుస్వామికి చేసేలా అగ్రిమెంట్‌ కుదుర్చి, సినిమాను బయటకు తీసుకొచ్చారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement