Advertisement

పూర్వజన్మల కథే 'నాగభరణం'!

Sat 04th Jun 2016 07:30 PM
nagabharanam teaser launch,kodiramakrishna,shajid quereshi  పూర్వజన్మల కథే 'నాగభరణం'!
పూర్వజన్మల కథే 'నాగభరణం'!
Advertisement

దిగంత్, రమ్య ప్రధాన పాత్రల్లో పెన్ మూవీస్, ఇన్ బాక్స్ పిక్చర్స్, బ్లాక్ బాస్టర్ స్టూడియో పతాకాలపై కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'నాగభరణం'. ఈ సినిమా టీజర్ ను శ్యాం ప్రసాద్ రెడ్డి శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ''కోడిరామకృష్ణ గారు 1989లో తొమ్మిది చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేశారు. సంవత్సరంలో 365 రోజులు ఆయన సినిమాలు థియేటర్స్ లో ఆడేలా చూసుకునేవారు. ఆయనతో నా పరిచయం 30 ఏళ్ళు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. నేను కేవలం కోడిరామకృష్ణ గారితో తప్ప మరే దర్శకుడితో సినిమాలు చేయను. నా తదుపరి చిత్రం కూడా చేయాలనుకుంటే ఆయనతోనే చేస్తాను. మకుట విజువల్ ఎఫెక్ట్స్ లాంటి పెద్ద కంపనీ ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం పని చేస్తోంది. నాకు విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలంటే చాలా ఇష్టం. కామన్ మ్యాన్ చాలా తొందరగా ఇలాంటి సినిమాలు కనెక్ట్ అవుతారు. సినిమా టీజర్ చూస్తుంటే.. ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలుస్తుంది'' అని చెప్పారు.

కోడిరామకృష్ణ మాట్లాడుతూ.. ''శ్యాం ప్రసాద్ రెడ్డి తో నాకు మంచి అనుబంధం ఉంది. మేము కలిసి గొప్ప సినిమాలు చేశాం. కాని ఏనాడు ఆయన చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా విషయానికొస్తే ఇదొక పూర్వజన్మకు సంబంధించిన కథ. పూర్వజన్మలో కోల్పోయిన తన ఎమోషన్ ను ఒక అమ్మాయి ఈ జన్మలో పాము రూపంలో ఎలా సాధించుకుందనేదే.. కథ. ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలుగా కష్టపడ్డాం. సాజిద్ ఓ గొప్ప సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తను ఖచ్చితంగా పెద్ద నిర్మాత అవుతాడు'' అని చెప్పారు. 

సాజిద్ ఖురేషి మాట్లాడుతూ.. ''కోడిరామకృష్ణ గారు లేకపోతే ఈ సినిమా లేదు. మూడేళ్ళుగా ఆయన ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు'' అని చెప్పారు.

బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''కోడిరామకృష్ణ నిర్మాతల దర్శకుడు. ఆయన రూపొందిస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు.

మకుట సంస్థ ప్రతినిధి దొరబాబు మాట్లాడుతూ.. ''మేము మకుట సంస్థ ప్రారంభించి 5 సంవత్సరాలయ్యింది. ఈ అయిదేళ్ళలో నేను ఇంత కాంప్లికేటేడ్ సబ్జెక్ట్ డీల్ చేయలేదు. సినిమా క్లైమాక్స్ లో విష్ణు వర్ధన్ గారిని గ్రాఫిక్స్ లో చూపించడం చాలా కష్టంగా అనిపించింది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: గురుకిరణ్, ఫోటోగ్రఫీ: వేణు, ఎడిటర్: జానీ హర్ష, డైలాగ్స్: ఎం.ఎస్.రమేష్, లిరిక్స్: కవిరాజ్, విఎఫ్ఎక్స్: మకుట విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాత: సాజిద్ ఖురేషి, దర్శకుడు: కోడిరామకృష్ణ.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement