Telugu Unicode News feed from Cinejosh.com http://www.cinejosh.com Telugu Unicode News feed from Cinejosh.com http://www.cinejosh.com Wed 19th Jan 2022 05:29 AM Telugu Unicode News feed from Cinejosh.com http://www.cinejosh.com/images/logo.jpg http://www.cinejosh.com 150 87 Copyright 2022 cinejosh.com. All rights reserved. 67659 వాళ్ళ హీరోలే మన విలన్లు - PR పంచ్ Bollywood stars showing must interest on south movies

]]>
ఒకప్పుడు బాలీవుడ్ సినీజనాలు తామేదో కారణజన్ముల్లా ఫీల్ అయిపోతూ ప్రాంతీయ భాషా చిత్రాలని కానీ నటీనటుల్ని కానీ పట్టించుకునేవారు కాదు. అందులోనూ మన సౌత్ సినిమానైతే మరింత చులకనగా చూసేవారు. ఆ దశలో మనవాళ్ళు కూడా నార్త్ లో అవకాశాల పట్ల తహతహలాడేవాళ్లు.. తాపత్రయపడేవాళ్లు. కానీ కాలం మారింది. నేడు దక్షిణాది సినిమా దమ్ము చూపించి రొమ్ము విరుచుకుని నిలబడింది. 

బాహుబలి భారీ ప్రభంజనంతో ఉలిక్కిపడ్డ బాలీవుడ్ ని ఆ వెంటనే వచ్చిన KGF మరింత ఉడికించింది. దాంతో వాళ్ళ కళ్ళు ఇటు వైపు తిరిగాయి.. అడుగులు మనవైపు పడ్డాయి. ఆపై బాహబలి 2 సృష్టించిన సునామీ దెబ్బకైతే మబ్బులు విడిపోయాయి. మన సినిమాల్లో అవకాశం అంటే హిందీ స్టార్స్ ఇంకేం ఆలోచించకుండా ఠపీమని తలూపే రోజులు వచ్చేసాయి. KGF 2 కోసం సంజయ్ దత్, రవీనా టాండన్ రంగంలోకి దిగితే RRR అవకాశాన్ని ఆలియాభట్, అజయ్ దేవగణ్ అందిపుచ్చుకున్నారు. మళ్ళీ ఆ రెండు సినిమాలూ కూడా అనూహ్యమైన రీతిలో, అంచనాలకు అందని స్థాయిలో అఖండ విజయాలు నమోదు చేయడంతో ఇక బాలీవుడ్ నటీనటులు మన సౌత్ సినిమా ఛాన్స్ అంటే చెంగు చెంగున అంగలేసుకుని, అందిన వెహికల్ పట్టుకుని వచ్చి వాలిపోతూ ఉండడం విశేషం. 

ఇపుడు నిర్మాణంలో ఉన్న ప్రతి భారీ తెలుగు చిత్రంలోనూ ప్రతినాయకులు హిందీ హీరోలే కావడం ఎంతైనా గమనార్హం. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరిలో అర్జున్ రామ్ పాల్ నటిస్తుంటే, దేవర ఎన్ఠీఆర్ ను ఢీ కొట్టేందుకు సైఫ్ ఆలీఖాన్ దిగారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లులో బాబీ డియోల్, OG లో ఇమ్రాన్ హష్మీ అడుగిడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ సలార్ షూట్ ఫినిష్ చేసిన సంజయ్ దత్ ప్రస్తుతం పూరి - రామ్ ల డబుల్ ఇస్మార్ట్ షూట్ లో పాల్గొంటున్నారు. అలాగే ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిలిం ప్రాజెక్ట్ K లో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర చేస్తున్నారు. వెంకటేష్ సైన్ధవ్ తో నవాజుద్దీన్ సిద్ధికి కూడా తన టాలెంట్ చూపించనున్నాడు. 

అలాగే బాలీవుడ్ బ్యూటీస్ కూడా అందిన అవకాశం వదలట్లేదండోయ్. దీపికా పడుకునే, దిశా పటాని ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ K కోసం కదిలితే, జాన్వీ కపూర్ ఎన్ఠీఆర్ దేవరలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పవన్ వీరమల్లులో నోరా ఫతేహి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కైరా అద్వానీ కనువిందు చేయనున్నారు. ఊర్వశి రథౌల ఐటమ్ పాటలతో ఊపుతోంది. వరుణ్ తేజ్ సినిమాతో నోరా ఫతేహి ఎంట్రీ ఇస్తోంది. 

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/their-heroes-are-our-villains_b_1508230324.jpg Wed 16th Aug 2023 06:41 PM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/67659/cinejosh-special.html cinejosh special 2023-08-15 15:24:42 వాళ్ళ హీరోలే మన విలన్లు - PR పంచ్ వాళ్ళ హీరోలే మన విలన్లు - PR పంచ్ CineJosh.com
65304 బలగంపై బలహీన ఆరోపణ - PR పంచ్ There are no strong allegations against Balagam film

]]>
కమెడియన్ వేణు దర్శకుడంటే ఏదో కామెడీ సినిమా చేస్తాడులే అనుకున్న వాళ్ళందరూ అవాక్కయ్యేలా సగటు జనుల భావోద్వేగాలే తన బలగం అని వెండితెర సాక్షిగా చాటి చెప్పాడు వేణు.

అగ్ర నిర్మాత దిల్ రాజు స్వయంగా కదిలొచ్చి అండగా నిలిచేంతటి అద్భుత కథనం రాసుకుని, రాసింది రాసినట్టు తీసుకుని నేడు ప్రేక్షకుల చేత శెభాష్ అని చెప్పించుకుంటున్నాడు వేణు.

అలాగని వేణు తీసిన బలగం గొప్ప ఇతిహాసం కాదు.. అందులో ఎటువంటి అట్టహాసం లేదు.!

మన ప్రాంతపు మట్టి వాసన ఉంది. మన మనసు లోతుల్లోని గట్టి గాఢత  ఉంది.

భుజాలు తడుముకునే అవకాశవాదం ఉంది. నీడలా వెంటాడే అపరాధభావం ఉంది.

కళ్లప్పగించి చూసేలా కథలో ముడిసరుకు ఉంది. కన్నీటి పొరను రప్పించే ముగింపు ఉంది.

అందుకే బలగం చిత్రానికి కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.. కలెక్షన్లు పెరుగుతున్నాయి.

అయితే ఇటువంటి సమయంలో కొందరి కన్ను కుట్టడం సహజం.

అటువంటివాళ్ల వెన్ను తట్టడం మరికొందరి కుంచిత స్వభావం.!

ఇంతకీ విషయం ఏమిటంటే.. బలగం కథ తనదేనంటూ ఓ స్వబుద్ధుడు ఆరోపణలు ఆరంభించాడు. కొంతమంది అందుకు వత్తాసు పలికి వార్తలు వండి వార్చే పనిలో పడ్డాడు.

ఆ ఘటికులకు ఘాటుగా సమాధానం చెప్పేందుకు, ఆ తరహా వార్తలకు వాతలు పెట్టేందుకే ఈ వివరణ.

అసలు సదరు సాధకుల సమస్య ఏమంటే.... మరణానంతరం  మన పెద్దలకు పిండ ప్రధానం చేసినప్పటికీ ఒకవేళ ఆ పెద్దల కోరికలు కనుక తీరకపోయుంటే కాకులు దానిని ముట్టవు అనే కథను ఆయన స్వయంగా రాసేసుకున్నారట. అదే కథతో ఇప్పుడు బలగం సినిమా తీసేసుకున్నారట.!

ఇప్పుడు దీన్ని మనం అమాయకత్వం అనుకుందామా, అవగాహనారాహిత్యం అనుకుందామా, అక్కసు వెళ్లగక్కడం అందామా..?? ఎప్పుడో శతాబ్దాల కాలం నుంచీ ఉన్న ఆచారాన్నీ, దశాబ్దాల కాలం నుంచీ ఎన్నెన్నో సినిమాల్లో చూస్తూ వస్తోన్న వ్యవహారాన్ని పట్టుకుని అది లిఖించింది నేనే.. సృష్టించింది నేనే అంటుంటే అతడెంతటి ఘనుడో అర్ధం చేసుకుని నవ్వుకోవచ్చు. బహుశా అతగాడు తెలంగాణ యాసలో రాసాను కనుక తనదే వాడేసుకున్నారనే భ్రమలో ఉంటే ముందుగా సదరు రచయిత ఒక పాఠకుడిగా మారి రామాయణ, మహాభారతాలకే ఎందరు ఎన్నెన్ని సంస్కరణలు చేసారో, రాసారో తెలుసుకోవాలి.

ముక్తాయింపు : తొమ్మిది దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ తరహా సన్నివేశం కొన్ని వందల సినిమాల్లో వచ్చింది. వాటిలో చాలావరకు ప్రస్తుతించే పరిజ్ఞానం మాకుంది కానీ అంతటి అవసరం లేకుండా అదంతా ఔపోసన పట్టే శ్రమ మీకూ రాకుండా ఇటీవలే ఓ భారీ చిత్రం వచ్చింది. సరిగ్గా సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రంలోనూ పిండ ప్రధాన సన్నివేశం ఉంటుంది. అక్కడ కూడా కాకి వచ్చి వాలడం అన్నదే ముఖ్యాంశం. గమనించి ఉంటే ఆ సన్నివేశం కూడా మీదేనని ఘర్జించి ఉండేవారేమో.. ఆ పనిలో ఉండండి మరి..!

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/weak-allegations-against-balagam-film_b_0403231209.jpg Mon 13th Mar 2023 08:38 PM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/65304/cinejosh-pr-punch.html cinejosh pr punch 2023-03-04 00:09:34 బలగంపై బలహీన ఆరోపణ - PR పంచ్ బలగంపై బలహీన ఆరోపణ - PR పంచ్ CineJosh.com
62324 మన నక్షత్రాల నత్త నడక - PR పంచ్ Cinejosh Special Article PR Punch

]]>
టాలీవుడ్ లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రతిపాదన మేరకు తెలుగు చిత్రాల షూటింగుల నిలిపివేత కొనసాగుతోంది. మరి ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు ఈ బందు ఎంతవరకూ మందేస్తుందో తెలియదు కానీ దొరుకుతోన్న తీరికతో హీరోలు సేద తీరుతున్నారు.. పెరుగుతోన్న వడ్డీలు తలుచుకుంటూ నిర్మాతలు వణుకుతున్నారు. సరే ఆ సంగతలా వుంచితే.. నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో అందరి పారితోషికాలపై కోత విధించాల్సిందే అంటోన్న గిల్డ్ బృందం ఆరుగురు అగ్ర హీరోలకు మాత్రం మినహాయింపు ఇస్తామంటోందట. ఆ ఆరుగురూ నేటి క్రేజీ హీరోలైన పవన్, మహేష్, ప్రభాస్, తారక్, చరణ్, బన్నీలని అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళకి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, రికార్డులతో సత్తా చాటుకోగల స్టార్ ఇమేజ్ పొందినప్పటికీ వాళ్ళ వల్ల నిర్మాతలకి దక్కుతోన్న ఫలితం ఎంత.? పరిశ్రమకి కలుగుతోన్న ప్రయోజనం ఎంత..?

దంచుతున్నారు... పెంచుతున్నారు..!!

ఈ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ దద్దరిల్లుతాయి. హిట్టు పడిందంటే రికార్డులు బద్దలవుతాయి.  

శాటిలైట్ రైట్స్ హై లెవెల్ లో వుంటాయి. డిజిటల్ రైట్స్ స్కై లెవెల్ లో వస్తాయి.

అదంతా మనమూ ఒప్పుకుంటాం, ఘనంగా  చెప్పుకుంటాం కానీ రెవెన్యూ ఏ రేంజ్ లో దంచుతున్నారో.. అందుకు తగ్గట్టే రెమ్యూనరేషన్లు కూడా పెంచుకుంటూ పోతున్నారనేది వాస్తవం. నిన్న మొన్నటివరకూ ఈ హీరోల సినిమాకు ఎంత బడ్జెట్ అయ్యేదో.. ప్రస్తుతం వాళ్ళ పారితోషికమే అంతకు చేరిందనేది సుస్పష్టం. దాంతో అగ్ర నిర్మాతలకైనా, అనుభవమున్న నిర్మాతలకైనా హిట్టు సినిమాకి లాభాలు లక్షల్లోనూ.. ఫ్లాపు సినిమాకి నష్టాలు కోట్లలోనూ కనిపిస్తున్నాయి. అయితేనేం.. డిమాండ్ ఉన్నవాళ్ళదే కమాండ్ అన్న సిద్ధాంతాన్ని పాటించక తప్పట్లేదు - సదరు స్టార్ హీరోలకు చేసే చెల్లింపులు తగ్గట్లేదు.

సాగదీస్తున్నారు... సరిపెడుతున్నారు..!!

సీన్స్ తియ్యాలంటే భారీ సెట్లు వెయ్యాల్సిందే. ఫైట్ చెయ్యాలంటే  బడా సెటప్పులు కావాల్సిందే.

ఇక పాటలకైతే విమానం ఎక్కెయ్యాల్సిందే.. విదేశాలకు చెక్కేయ్యాల్సిందే.!

ఇదీ మన స్టార్ హీరోల సినిమాల తంతు. అంతేకాదు.. కాంబినేషన్ల కోసమని, క్వాలిటీ కోసమని, రిహార్శల్స్ అనీ, రీ షూట్స్ అనీ సినిమా మేకింగ్ టైమ్ ని సాగదీసుకుంటూ పోతున్నారు. చివరికి అతి కష్టంమీద ఏడాదికో సినిమాతో సరిపెడుతున్నారు. ఆ ఒక్కటీ ఆడితే ఆనందమే. లేకుంటే నెక్స్ట్ సినిమా కోసం నెక్స్ట్ ఇయర్ వరకూ ఆగాల్సిందే. ఎన్ఠీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు అగ్ర తారలు చకచకా సినిమాలు చేయడం వల్ల  పరిశ్రమ కళ కళలాడుతూ ఉండేది - కార్మికుల కడుపు నిండేది. డిస్ట్రిబ్యూటర్లలో ఉత్సాహం నింపేది - థియేటర్లకు ఫీడింగ్ అందేది. కానీ నేటి క్రేజీ స్టార్స్ సంవత్సరానికో సినిమా మాత్రమే సూత్రాన్ని పాటించడం పరిశ్రమలో నిరుత్సాహాన్ని, పంపిణీ రంగంలో నీరసాన్ని మిగుల్చుతోందని అంటున్నారు సీనియర్ నిర్మాతలు.

వరుసగా వచ్చేశారు... మధ్యలోనే వదిలేశారు..!!

కోవిడ్ ఎఫెక్ట్ నుంచి రిలీఫ్ కోసం వెయిట్ చేసారు. టికెట్ రేట్ల కోసం ప్రభుత్వాల్ని రిక్వెస్ట్ చేసారు.

ఆరు నెలల గ్యాప్ లోనే ఆరుగురూ వచ్చేశారు. క్యాలెండర్ లోని మరో ఆరు నెలల్ని అలా వదిలేశారు.

ఇదీ మన ఆరుగురు అగ్ర తారల తీరు. 2021 డిసెంబర్ 17న అల్లు అర్జున్ పుష్ప విడుదలవగా 2022 ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వచ్చింది. మార్చ్ 11న ప్రభాస్ రాధే శ్యామ్ తో దిగితే అదే నెల 25న తారక్ - చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ రిలీజయింది. ఆపై మే 12న సర్కారు వారి పాటని ఇచ్చారు మహేష్. అంతే.! దాంతో ఐదో నెలలోనే ఈ ఏడాది ఈ హీరోల సినిమాలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక ముక్తసరిగా సాగనున్న ఈ ఇయర్ కి మంచి ముగింపుని ఇచ్చే బాధ్యతతో  సీనియర్ హీరోలైన చిరంజీవి గాడ్ ఫాదర్, బాలకృష్ణ NBK 107, నాగార్జున ఘోస్ట్ సినిమాలు రానున్నప్పటికీ.. ప్రస్తుతం ప్రకాశిస్తోన్న తారలు మాత్రం తదుపరి చిత్రంతో తెరపై కనిపించేది 2023 లోనే కావడం గమనార్హం.

స్టార్స్ నాన్చుతున్నారు... ఫ్యాన్స్ నలుగుతున్నారు..!!

ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని పరిశ్రమంతా గగ్గోలు పెడుతుంటే..

రప్పించగల హీరోల సినిమాలు నత్త నడకన సాగడం దారుణమని అంటున్నారు అనుభవజ్ఞులు.

నిజమే కదా. సినిమాలైతే ప్రకటించేస్తున్నారు కానీ పనులు మాత్రం జరగట్లేదు పవన్ కళ్యాణ్  ప్రాజెక్టులకి. సగంలో ఆగిన హరి హర వీరమల్లు పూర్తయ్యేదెపుడో.. మిగిలిన సినిమాలు పట్టాలెక్కేదెపుడో.!  

త్రివిక్రమ్ - రాజమౌళి వంటి అగ్ర దర్శకులతో  తన తదుపరి రెండు చిత్రాలూ చేయనున్న మహేష్ అసలు మాటల మాంత్రికుడితో  మొదలు పెట్టేదెపుడో.. దర్శక ధీరుడు జక్కన్న చేతికి చిక్కేదెపుడో.!

భారీ క్రేజీ ప్రాజెక్టులని ఏక కాలంలో చేస్తున్నప్పటికీ 2023 జనవరి 12 న రానున్న ప్రభాస్ ఆదిపురుష్ నుంచి కనీసం ఫస్ట్ లుక్ అయినా వచ్చేదెపుడో.. సెన్సేషనల్ సలార్ టీజర్ ని వదిలేదెపుడో.!

కొరటాల శివ, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్, వెట్రిమారన్ వంటి వెర్సటైల్ డైరెక్టర్స్ ని అయితే తారక్ లైనప్ లో పెట్టారు కానీ కొరటాలతో చెయ్యాల్సిన NTR 30 ఆరంభమెపుడో.. ఆ తదుపరి చిత్రాలు కదిలేదెపుడో.!

జీనియస్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా ఫిలింగా RC 15 చేస్తోన్న రామ్ చరణ్ ఇంకా చాలా బ్యాలన్స్ వున్న వర్కుని కంప్లీట్ చేసేదెపుడో.. గౌతమ్ తిన్ననూరి సినిమాకి క్లాప్ కొట్టేదెపుడో.!

పుష్ప రైజింగ్ చూపించి పూర్తిగా దేశాన్నే మెస్మరైజ్ చేసేసిన అల్లు అర్జున్ మరి పుష్ప రూలింగ్ షూటింగ్ స్టార్ట్ చేసేదెపుడో.. ఆ నెక్స్ట్ సినిమాల న్యూస్ చెప్పెదెపుడో.!

తాము అమితంగా అభిమానించే హీరో సినిమా అప్ డేట్స్ తెలియక ఫ్యాన్స్ గోల చేస్తున్నా, సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నా ఈ కథానాయకులు పట్టించుకోవట్లేదనే కంప్లైంట్ ఈమధ్య బాగా వినిపిస్తోంది. సదరు చిత్రాల దర్శక, నిర్మాతలు కూడా సరిగా స్పందించకపోవడం పట్ల నలిగిపోతున్న అభిమానుల నుంచి  ట్రోలింగ్ నడుస్తోంది. ఇప్పుడా ప్రేక్షకాభిమానులు, సినీ కార్మికులు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలు ఈ హీరోలని కోరుకుంటోంది టాలీవుడ్ కోలుకునేలా చెయ్యమని.. వేడుకుంటోంది వేగం పెంచమని.! 

కాస్త వినండి సార్లూ.. కదలండి స్టార్లూ.!!

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/special-article-on-tollywood-stars_b_0708221204.jpg Thu 11th Aug 2022 12:58 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/62324/cinejosh-special-article-pr-punch.html cinejosh special article pr punch,pr punch articles fro cinejosh web site,tollywood heroes,star heroes from tollywood 2022-08-07 01:05:44 మన నక్షత్రాల నత్త నడక - PR పంచ్ మన నక్షత్రాల నత్త నడక - PR పంచ్ CineJosh.com
62152 BP వద్దు.. AP కావాలి - PR పంచ్ Cinejosh PR Punch Special Article

]]>
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక.. సరైన కలెక్షన్లు తెప్పించలేక తెలుగు సినిమా కుంటుబడుతూ నిర్మాతలు కుదేలవుతోన్న ప్రస్తుత పరిస్థితిపై హుటాహుటీన చర్చలు మొదలయ్యాయి. టికెట్ రేట్ల దగ్గర్నుంచి రెమ్యునరేషన్ల వరకూ పలు అంశాలపై దృష్టి సారించిన నిర్మాతలు మున్ముందుగా తీసుకున్న నిర్ణయం మాత్రం ఓటీటీకి సంబంధించింది కావడం విశేషం. 6 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో నిర్మితమైన వాటిని చిన్న చిత్రాలుగా పరిగణిస్తూ వాటిని విడుదల తేదీ నుంచి నాలుగు వారాల గడువు తరువాత, అలాగే 6 కోట్ల వ్యయం దాటినవి పెద్ద సినిమాలు కనుక వాటిని 10 వారాల తరువాత ఓటీటీకి ఇవ్వాలంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది.

భేష్.. శెభాష్.!

నిబంధన సబబుగానే వుంది కానీ - సవ్యంగా అమలవుతుందా.?

నిర్ణయం సముచితమే కానీ - దీంతోనే అంతా మారిపోతుందా.?

అసలు చెయ్యాల్సినదేంటి... చేస్తున్నదేంటి.. ఓసారి పరిశీలిద్దాం.

అది 1992

అప్పటివరకు దూరదర్శన్ లో వార్తలు, చిత్రలహరి పాటలు మాత్రమే చూస్తూ వస్తోన్న తెలుగువారి ఇళ్లల్లోకి కేబుల్ టీవీ ప్రవేశించింది. జనాన్ని ఆకర్షించడం కోసం కేబుల్ టీవీ ఆపరేటర్లే క్యాసెట్స్ తీసుకొచ్చి సినిమాలు వేసేసేవాళ్ళు. దాంతో సినిమా నిర్మాతలు కంగారుపడిపోయారు. అసలు సినిమాల వీడియో రైట్స్ అమ్మాలా వద్దా అనే డైలమాలోకి వెళ్లిపోయారు. అయితే అదే 1992 లో అగ్ర హీరోల చిత్రాలైన ఘరానామొగుడు, రౌడీ ఇనస్పెక్టర్, చంటి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాంతో పాటు అల్లరి మొగుడు, ఆ ఒక్కటీ అడక్కు, చిత్రం భళారే విచిత్రం, సీతారత్నం గారి అబ్బాయి వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించడం గమనార్హం.

అది 1995

శాటిలైట్ చానెల్స్ ఈ టీవీ, జెమిని టీవీ మొదలయ్యాయి. మళ్ళీ నిర్మాతల్లో గుబులు రేగింది. ఇళ్లల్లోనే ఎంటర్ టైన్ అవుతోన్న సగటు జనాలు థియేటర్లకు రావడం తగ్గించేస్తారేమో అనే అలజడి కనపడింది. కానీ సినిమాని విపరీతంగా ఆరాధించే మన తెలుగు ప్రేక్షకులు అప్పుడు కూడా అండగానే నిలబడ్డారు. అదే 1995 లో పెదరాయుడు, పెళ్లి సందడి వంటి గోల్డెన్ జూబిలీ హిట్సే కాకుండా అమ్మోరు, అమ్మదొంగా, ఆయనకిద్దరు, ఒరేయ్ రిక్షా వంటి పలు చిత్రాలను సూపర్ హిట్స్ గా నిలబెట్టారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే... ఏ శాటిలైట్ ఛానెల్స్ ని చూసి బెంబేలెత్తారో వాటికే తమ సినిమాలను అమ్మి సొమ్ము చేసుకోవడానికి పోటీ పడ్డారు ప్రొడ్యూసర్లు. అఫ్ కోర్స్... అప్పట్నుంచీ ఇప్పటివరకు కూడా శాటిలైట్ రైట్స్ అనేవి నిర్మాతలకు అదనపు ఆసరాగా వుంటూ వస్తున్నాయనేది వాస్తవం.

ఆపై సీరియల్స్ పై సీరియస్..!

ఈ దఫా టీవీ సీరియల్స్ పట్ల సీరియస్ నెస్ క్రియేట్ అయింది. ఆడవాళ్ళంతా టీవీల్లో వస్తోన్న ధారావాహికలకు అతుక్కుపోతుంటే సినిమాలేమైపోతాయ్ అంటూ తలలు పట్టుకున్నారు. లేడీస్ రాకపోతే, ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే థియేటర్లు ఏమైపోవాలి అంటూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. కానీ ఆ భయం మాయం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. బొమ్మరిల్లు నుంచీ బాహుబలి వరకు, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచీ శతమానంభవతి, మహానటి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా తమకు నచ్చే సినిమా ఏదైనా, ఎప్పుడొచ్చినా థియేటర్లకు రావడానికి సిద్ధమేనంటూ మహిళా ప్రేక్షకులు నిలువెత్తు విజయాల సాక్షిగా నిరూపిస్తూ వస్తున్నారు.

సమాధానమే లేని సమస్య.. పైరసీ.!

గత దశాబ్ద కాలంగా గగ్గోలు పెట్టడమే తప్ప పగ్గాలు వెయ్యలేకపోయిన ప్రధాన అంశం.. పైరసీ భూతం. యాంటీ పైరసీ సెల్ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా.. చట్టాలు, శిక్షలంటూ ఎంత హడావిడి చేసినా ఫలితం శూన్యం. పైరసీదారులు నేటికీ మొదటి రోజునే ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్ పెట్టేస్తుంటే దానికి కళ్లెం వెయ్యలేక కళ్లప్పగించి చూడాల్సినంతటి దైన్యం. ఇక్కడ కూడా కంటి తుడుపు ఏమిటంటే.. ఇప్పటికీ సరైన సినిమా వచ్చినపుడు పైరసీని పక్కనెట్టి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు ప్రేక్షకులు.

పరిశీలించుకోవాల్సిన స్థితి.. ప్రస్తుత పరిస్థితి.!

ఓటీటీ వలనే సమస్య వస్తోందా లేక సమస్యకు ఓటీటీ సాకుగా మారిందా అనే అంశాన్ని విశ్లేషించుకోవాల్సిన తరుణమిది. విడుదలైన స్వల్ప వ్యవధిలోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తూ ఉండడం వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదంటున్నారు. అసలీ ఓటీటీ అనేదే లేనపుడు, కరోనా అనేదే రానపుడు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయిన నెలలోపే టీవీల్లో టెలికాస్ట్ అయ్యేవి కదా. వీలైనంత త్వరగా ప్రసారం చేసుకునే డిమాండ్ తో మా టీవీ, జీ తెలుగు చానల్స్ పోటీ పడి మరీ రైట్స్ కొనేవి కదా.

అది మర్చిపోయారా..?

పోనీ పాండమిక్ టైమ్ లో జనం ఓటీటీకి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారు అనుకుందామా అంటే.. కరోనా ఫస్ట్ వేవ్ పూర్తవగానే క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, వకీల్ సాబ్ సినిమాలకి భారీ వసూళ్లే ఇచ్చారు. ఇక సెకండ్ వేవ్ నుంచి రిలీఫ్ రాగానే మళ్ళీ అఖండ, పుష్ప, బంగార్రాజు, డి.జె.టిల్లు, భీమ్లానాయక్, ఆర్ ఆర్ ఆర్, సర్కారువారి పాట, మేజర్, విక్రమ్ సినిమాలు జనం నుంచి బాగానే లాగాయి కదా.

అది వదిలేశారా..?

పైన గతాన్ని నెమరువేసుకుంది ఎందుకూ అంటే... కాలానుగుణంగా చాలా వస్తూ ఉంటాయి. కానీ అవేవీ థియేటర్ లో పొందే అనుభూతికి సాటి రావు. ఆటంకాలుగా అనిపిస్తాయి. బట్ అవేవీ సినిమాకి పోటీ కావు. ఆడియో రైట్స్ అయినా, వీడియో రైట్స్ అయినా, డబ్బింగ్ రైట్స్ అయినా, రీమేక్ రైట్స్ అయినా, శాటిలైట్ రైట్స్ అయినా, ఓటీటీ రైట్స్ అయినా అన్నీ నిర్మాతకి అదనపు ఆదాయ మార్గాలే. అసలు ఆదాయం సిసలైన సినిమా చూపించి ప్రేక్షకుడిని సంతృప్తి పరచడంలోనే ఉంటుంది. అదే జరిగితే విజయాలు అలవోకగా వస్తాయి అనడానికి గతమే నిదర్శనం. అదే భవిష్యత్ నిర్దేశనం.! 

పాటించాల్సిన పద్ధతి.. పంథా మార్చుకోవడమే.!

నిజానికి ఇది ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి కాదు. రప్పించలేని దుస్థితి. ఓటీటీ పుణ్యమా అంటూ వివిధ భాషల విభిన్న చిత్రాలను వీక్షిస్తోన్న ప్రేక్షకులకు సగటు సాధారణ సినిమాల్లోని డొల్లతనం వెల్లడైపోయింది. అందుకే దర్శక ఖిలాడీల గారడీ సాగట్లేదు. పక్కా కమర్షియల్ సినిమాలు ఆడట్లేదు. విషయం లేని పాఠాలకు గుణపాఠాలు ఎదురవుతున్నాయి. వాటం చాలని వార్ లు థాంక్యూ చెప్పించుకుని తప్పుకుంటున్నాయి. ఇపుడు నిజంగా, నిశితంగా చేయాల్సిన పని ఆత్మ విమర్శ చేసుకోవడం.! పాటించాల్సిన పద్ధతి..  పంథా మార్చుకోవడం.! 

బీసీ (బిఫోర్ క్రైస్ట్) కథలనూ, బీపీ (బిఫోర్ పాండమిక్) కథలనూ కంచికి వదిలేసి మంచి కాన్సెప్ట్ లతో మనోళ్లు ముందడుగు వేస్తే.. ప్రేక్షకుల అడుగులు కూడా పరుగులుగా మారి మరీ థియేటర్ల వైపుకు దూసుకు వస్తాయి. ఎందుకంటే దమ్మున్న సినెమానెపుడూ దుమ్ము రేపే హడావిడితో థియేటర్లలో చూడడానికే ఇష్టపడతారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినిమాని అమితంగా ప్రేమించే మన తెలుగు ప్రేక్షకులు.!

సో.. వీలైనంత త్వరగా మన ఫిలిం మేకర్స్ బీపీ (బిఫోర్ పాండమిక్) థింకింగ్ వదిలేసి ఏపీ (ఆఫ్టర్ పాండమిక్) మోడ్ నీ, మూడ్ నీ అర్ధం చేసుకుంటే అన్ని సమస్యలూ సాల్వ్ అయిపోతాయి. మన దగ్గర కూడా సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) వంటి జాతీయ ఉత్తమ చిత్రాలు వస్తాయి.!

అన్నట్టు మనం ఇపుడు ఏ ఓటీటీ వల్ల నష్టం అనుకుంటున్నామో అదే ఓటీటీలో ప్రదర్శితమై జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచి, సూర్యని జాతీయ ఉత్తమ నటుడిగా నిలిపింది సూరారై పొట్రు. సర్లెండి.. సత్తా ఉన్న సినిమాకి సరిహద్దులు ఉండవు. సమర్థులు, సాధకులు సాకులు వెతకరు..!!  

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/no-need-bp-we-need-ap-pr-punch_b_2507221131.jpg Tue 26th Jul 2022 10:01 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/62152/cinejosh-pr-punch.html cinejosh pr punch,pr punch article in cinejosh web site 2022-07-25 23:31:47 BP వద్దు.. AP కావాలి - PR పంచ్ BP వద్దు.. AP కావాలి - PR పంచ్ CineJosh.com
61212 ఈ లెక్కల్లో ఎన్ని చిక్కులో.! - PR పంచ్ Telugu Industry movie collection gimmicks

]]>
బాలీవుడ్ సినిమాల్లో ఎంత భారీ బడ్జెట్ సినిమాలైనా, ఎంత బడా స్టార్స్ నటించినా ఒక్కసారి సినిమా థియేటర్స్ లోకి వచ్చింది అంటే.. దాని తాలూకు అంకెలన్నీ తేటతెల్లమైపోతాయి. అక్కడ కొంతమంది పాపులర్ ఫిలిం క్రిటిక్స్, కొంతమంది సీనియర్ ట్రేడ్ ఎనలిస్ట్స్, అండ్ మరికొన్ని మీడియా సంస్థలు ఆ సినిమా తాలూకు బిజినెస్, ఆ సినిమా తాలూకు కలెక్షన్స్ ని వెల్లడిస్తూ ఉంటాయి. అక్కడి ప్రేక్షకులు, పత్రికలూ దానినే ప్రామాణికంగా తీసుకుంటాయి. అదే ఫైనల్. అదేంటో అక్కడ ఫాన్స్ కూడా మనలాగా యుద్దాలు చేసుకోరు, వర్గ యుద్దాలు చెయ్యరు. అది అంతవరకు బాలీవుడ్ మీడియా, బాలీవుడ్ కల్చర్ అంతే. 

ఇక మన దక్షిణాది పరిశ్రమకి వస్తే అందుకు పూర్తిగా విరుద్ధం. కన్నడ, మలయాళ పరిశ్రమలు కాస్త బెటర్ అని చెప్పుకోవాలి ఆ విషయంలో.. ఎంతోకొంత ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు. అక్కడ కూడా ఔత్సాహికులు ఉంటారు.. కాబట్టి కాస్త కాస్త కలిపే ప్రయత్నం చేస్తారు. కానీ తెలుగు, తమిళ పరిశ్రమలకు విషయానికి వస్తే మాత్రం అబ్బో మన లెక్కే వేరు. మన లెక్కలే వేరు. తమిళ వాళ్ళు సేమ్ ఇలాగే ఇంతుంటే అంతని చెప్పుకోవడాలు, తక్కువొచ్చినా ఎక్కువ వచ్చింది అని చూపించుకోవడాలూ, ఎక్కువ హైప్ చేసుకోవడాలూ ఈ కల్చర్ అంతా అక్కడుంది. తుస్ మన్న సినిమాకి కూడా కస్సు బుస్ అనడం వాళ్ళకి అలవాటు. బట్ ఫైనల్ గా రిజల్ట్ ఈజ్ రిజల్ట్. 

ఇక తెలుగు విషయానికి వస్తే ఆహా మనవాళ్ళ కథే వేరు. అది ముఖ్యంగా ఈమధ్యకాలంలో కలెక్షన్స్ కల్చర్ అనేది పూర్తిగా కరెప్ట్ అయ్యిపోయింది అని చెప్పాలి. వై బికాజ్ కొందరు హీరోలు తమ సినిమాల కలెక్షన్స్  వెల్లడించకూడదు. కలెక్షన్స్ టాపిక్ తీసుకురాకూడదు అనేది ముందుగానే నిర్మాతలకు ఆంక్షలు పెడుతున్నారు. దాని వలన నిర్మాణ సంస్థలు ఏమి చెయ్యలేకపోతున్నాయి. ఇంకొన్ని సినిమాలకి కొందరు హీరోలైతే ఎంతొచ్చింది అనేది కాకుండా తమకి ఎంత కావాలి, ఎంత కలపాలి అనేది ముందే చెప్పేసి ఉంచుతున్నారు. నిర్మాతలు అటు అలాంటి హీరోలని వదులుకోలేరు, ఇటు ఇలాంటి హీరోలని వదలలేరు. తప్పని పరిస్థితి. పోనీ ఇదైనా సవ్యంగా సక్రమంగా జరుగుతుందా అంటే.. ఇవ్వని వాడు ఎలాగూ ఎవ్వడు. ఇచ్చేవాడు పూర్తిగా ఇవ్వడు. ఫస్ట్ వీక్ ఇంత అని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. అది అధికారిక ప్రకటన అనుకుంటాము. సెకండ్ వీక్ అప్పటికేమైనా సినిమా స్టడీగా ఉంటే.. ఇంకో పోస్టర్ వస్తుంది ఇంత అని. సరే అనుకుంటాం అఫీషియల్ అనౌన్సమెంట్ కాబట్టి. థర్డ్ వీక్ అప్పటికి గనక సినిమా థియేటర్స్ లో ఉంటే ఇంకో పోస్టర్ ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు. 25 డేస్ పోస్టర్ లాగా. అంతే ఇప్పుడు అంతకుమించి సినిమాలు ఆడే పరిస్థితి లేదు. అలా ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు. కానీ అది కూడా జరగడం లేదు. అలాంటి స్పందనేం రావడం లేదు. అక్కడితో ఆగిపోతుంది అంతే. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ గా సైలెంట్ అయ్యిపోతాడు ప్రొడ్యూసర్. 

ఆ సినిమా తాలూకు బిజినెస్ ఏమిటి? షేర్ ఏమిటి? గ్రాస్ ఏమిటి? క్లోసింగ్ ఏమిటి? అనేది ఎటువంటి అధికారిక ప్రకటన ఉండదు. అది ఎవరికి వాళ్ళు వేసేసుకోవాల్సిందే. ఏ బ్యానర్ నుండి అటువంటిది రావడం లేదు. ఒకప్పుడు పాత సినిమాలకి ఉండేదట. ఈ బడ్జెట్ లో సినిమా తీస్తే, ఫైనల్ గా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత మిగిలింది అనేవి ఆ లెక్కలేవో ఉండేవట. ఇప్పుడు అలాంటి వాటికి నోచుకోవడం లేదు. సరే ఓకె. అది పక్కనబెట్టేస్తే అధికారిక ప్రకటన వదిలెయ్యండి. అనధికారిక లెక్కల విషయానికి వస్తే రోజు రోజుకి శృతి మించిపోతుంది మన తెలుగు సినిమా అంకెల గారడీ. ఒక్కొక్క హీరో ఫాన్స్, ఒక్కొక్క హీరో పిఆర్ టీం గ్రూప్ ని ఫామ్ చేసుకోవడం వలనో, వాళ్ళు వేసే లెక్కలు వేరేలా ఉంటున్నాయి. అలాగే వెబ్ సైట్స్ ఎవరికి వాళ్ళు మేము ట్రాకర్స్ అని చెప్పుకుంటూ కలెక్షన్స్ వేసెయ్యడం. సపోజ్ ఒక వెబ్ సైట్, ఫస్ట్ డే కలెక్షన్ ఇది, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇది పోస్ట్ వెయ్యగానే.. మిగతా వాళ్ళు దానిని చూడడం, ఇప్పుడు ఆ సినిమా మీద పాజిటివ్ స్టాండ్ తీసుకున్నవాడు ఎంతో కొంత పెంచి వేసి చేతి వాటం చూపిస్తాడు. ఆ సినిమా అంటే పడని వాడు, నెగెటివ్ స్టాండ్ తీసుకున్నవాడు.. కలెక్షన్స్ మీద కొంచెం తగ్గించి వేసి వాడి బులపాటం వాడు తీర్చేసుకుంటాడు. ఇంతేతప్ప జన్యూన్ ట్రాకర్ ఎవరు అనేది ఎవరికి తెలియడం లేదు. దీనికంటూ ప్రామాణికాలు కానీ, ఒక బ్రాండ్ కానీ ఏమి లేదు. 

ఇక పిఆర్ టీమ్స్ సెలెక్ట్ చేసే హ్యాండిల్స్ నుండి అయితే ఏ ఏరియాల నుండి ఎంత కలెక్షన్స్ పడుతుందో.. వాళ్ళకి షేర్ ఏమిటో, గ్రాస్ అంటే ఏమిటో, ఫిక్సడ్ హైయ్యర్స్ అంటే ఏమిటో, నెట్ అంటే ఏమిటో.. GST ఎంత కట్ అవుతుందో.. అనేది ఎటువంటి ఐడియా లేకుండానే ఎవడికి తోచిన లెక్కలు వాళ్ళు వేసి పారేస్తున్నారు. సరే ఇదంతా ఎవరి ఇష్టం వారిది అనుకోవచ్చు. కానీ ఈ కాకి లెక్కలు చిక్కులు తీసుకువస్తుంది మళ్ళీ సినిమా ఇండస్ట్రీకే. ఇలాంటి తొక్కలో లెక్కలు చూసే ప్రభుత్వాలు పంతానికి పోతున్నాయి. ఇలాంటి పనికిమాలిన లెక్కలు చూసే ఇన్కమ్ టాక్స్ డిపార్మెంట్ రైడ్స్ కి దిగుతున్నాయి. వేసుకుంటున్నాం కదా అని వేసుకుంటూ వేసుకుంటూ పొతే రేపు మళ్ళీ ఇండస్ట్రీనే చిక్కుల్లో పడుతుంది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఏదైనా చర్యలు చేపడితే బాగుంటుంది. సినిమా టికెట్స్ కి విషయంలో ట్రాన్ఫరెన్సి కావాలని ఎలా కోరుకుంటున్నారో.. కలెక్షన్స్ విషయంలో కూడా ట్రాన్ఫరెన్సి చూపించాలిగా..

..పర్వతనేని రాంబాబు.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/how-many-entanglements-in-these-calculations_b_1905221057.jpg Fri 20th May 2022 09:27 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/61212/telugu-industry.html telugu industry,tollywood,kollywood,bollywood,movie collections 2022-05-19 22:57:33 ఈ లెక్కల్లో ఎన్ని చిక్కులో.! - PR పంచ్ ఈ లెక్కల్లో ఎన్ని చిక్కులో.! - PR పంచ్ CineJosh.com
61130 జగన్నాటక సూత్రధారి - PR పంచ్ AP CM Jagan ghost haunting Tollywood?

]]>
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారంటే.. మహేష్ బాబు సర్కారు వారి పాట కి వచ్చిన టాక్ చూసిన వారంతా అబ్బో ఏపీ వెళ్లారు సీఎం జగన్ ని కలిశారు.. టికెట్ రేట్స్ పెంచమని వేడుకున్నారు, అలా దండాలు పెట్టొచ్చిన వాళ్ళకి ఆడియన్స్ చుక్కలు చూపిస్తున్నారట. జగన్ ని కలిసిన ప్రభాస్ కి రాధే శ్యామ్ డిజాస్టర్  అయ్యింది. అలాగే జగన్ ని కలిసిన మెగాస్టార్  సినిమా ఆచార్య ప్లాప్ అయ్యింది. జగన్ ని కలిసిన మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట దొబ్బింది అంటూ రాధే శ్యామ్ సముద్ర మట్టం, ఆచార్య పాదఘట్టం, సర్కారు వారి పాట నేల మట్టం అంటూ మీమ్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ ని విమర్శించిన వారు, జగన్ మీటింగ్ కి దూరంగా ఉన్నవారు, టికెట్ రేట్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీసు ఫైట్ కి దిగిన వారు బ్లాక్ బస్టర్స్ కొట్టారు.

డిసెంబర్ 3న ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు నడుస్తున్న టైం లో అఖండ సినిమాతో నందమూరి నటసింహం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు, 50 రోజులు థియేటర్స్ లో ఆడించి రికార్డ్ సృష్టించారు. ఇక అదే నెల 17న అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ చేసారు. ఆ సినిమా అప్పుడు కూడా ఏపీలో టికెట్ ధరల ఇష్యు తెగలేదు. అయినా పుష్ప బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం జగన్ ని కలిసి సమస్యని పరిష్కరించామని చెప్పినా, పవన్ కళ్యాణ్ మీద కక్ష కట్టి టికెట్ ధరలు పెంపు జీవో ఇవ్వకుండా తాత్సారం చేసినా.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో అద్భుతమైన హిట్ కొట్టారు. మరి టికెట్ రేట్ల తో సంబంధం లేకుండా బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ ముగ్గురు ముందు.. టికెట్ ధరలు పెంచుకోవడానికి జగన్ కి వంగి వంగి దండాలు పెట్టిన ఈ ముగ్గురుకి భారీ షాక్ తగిలింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్యన, ఆడియన్స్ మధ్యన జరుగుతున్న చర్చ. ఇక నిన్నగాక మొన్న రిలీజ్ అయిన సర్కారు వారి పాట ని సోషల్ మీడియాలో ఓ వర్గం ఫాన్స్ చీల్చి చెండాడుతున్నారు. ఇదంతా జగన్ మాయే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

✍️-పర్వతనేని రాంబాబు.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/curse-of-cm-jagan-crushing-tollywood_b_1405220612.jpg Sat 14th May 2022 04:42 PM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/61130/cm-jagan.html cm jagan,rajamouli,koratala shiva,mahesh babu,chiranjeevi,prabhas,radhe shyam,acharya,sarkaru vaari paata,akhanda,pushpa,allu arjun,bheemla nayak 2022-05-14 06:12:12 జగన్నాటక సూత్రధారి - PR పంచ్ జగన్నాటక సూత్రధారి - PR పంచ్ CineJosh.com
60326 ఎన్నికలలో.. ఎన్ని కళలో - PR పంచ్ PR Punch On Press Club Election Controversy

]]>
బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు జగమెరిగిన జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సాక్షిగా పరువుకు నిప్పెట్టారు. 

పనికిమాలిన పంతాలకు పోయి ఐదు దశాబ్దాల ఘనమైన చరిత్రని గంగపాలు చేసేసేలా ఉన్నారు.  

అలాగని వాళ్ళందరూ ఏమైనా సామాన్యులా...

నైతికత వివరించే విజ్ఞులు - నిబద్దత బోధించే నిపుణులు.

ప్రపంచంలోని ప్రతి అంశాన్నీ చక్కగా విశ్లేషించే ప్రావీణ్యులు.

సమాజం ఎలా ఉండాలో చిక్కని సూక్తులు చెప్పే శాస్త్రజ్ఞులు.

మరి అటువంటి పాత్రికేయులు.. అంతటి ఉద్దండులు 

కలాన్ని పక్కనపెట్టి కయ్యాలకి దిగడం ఏంటి.?

అక్షరాలని వదిలేసి కక్షలకు పోవడం ఏంటి.??

బహుశా ఎలక్షన్ల ప్రభావం ఏ లక్షణాన్నైనా ఏమార్చేస్తుందేమో.!

ఎన్నికలనగానే వివరం విడిచి - విజ్ఞత మరిచి విచక్షణ కోల్పోతారేమో.!

నిత్యం ఎన్నో సిద్ధాంతాలు వల్లించే విలేఖరులు 

నిజానికి చెప్పే సుద్దులకీ - పాటించే పద్ధతులకీ 

పొంతనే ఉండదని నిరూపించిన ఆ రాద్ధాంతం ఏమిటంటే....

ఇటీవలే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ జరిగాయి.

నిజానికి ఇందులో విశేషమేమీ లేదు. ప్రతి రెండేళ్ళకీ ఓసారి జరిగే తంతే ఇది.

అయితే ఈసారి మాత్రం రాజకీయ ఎన్నికలను తలపించే స్థాయిలో

ఆమధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను మరిపించే రీతిలో

వివాదాలు చెలరేగుతున్నాయి - విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కౌంటింగ్ పారదర్శకంగా లేదని కొందరు - రిగ్గింగ్ చేసారని మరికొందరు

ఓటింగే పధ్ధతిగా జరగలేదని ఇంకొందరు ఎవరి వాదనలతో వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవరకు వెళ్లారు.

అసలు బాధ్యతలకే తప్ప ఎటువంటి అక్రమ ఆదాయానికీ తావు లేని ప్రెస్ క్లబ్ పదవుల కోసం

ఇంతటి ఆరాటం ఏమిటో - అంతటి పోరాటం ఎందుకో వారికే తెలియాలి.

కానీ ఓటింగ్ విషయంలో అవకతవకలు జరగడం - బ్యాలెట్ బాక్సుల్లోకి  నీళ్లు చేరడం వంటివి మాత్రం

అనుభవజ్ఞులైన పాత్రికేయులు అవలంభించే చర్యలు కావని స్పష్టంగా చెప్పొచ్చు. 

కేవలం 1300 ఓట్లు కలిగిన ఈ  ప్రెస్ క్లబ్ ఎన్నికల కోసమే కుల, మత, ప్రాంత ప్రస్తావనలు తేవడం..

డబ్బు పంపిణీ కూడా జరిగిందనే ఆరోపణలు రావడం విడ్డూరం. 

అన్నట్టు జర్నలిస్టుల సంఘాలు పలు ఉన్నప్పటికీ..

కొన్నిటికి ఎన్నికలే ఉండవు. ఇంకొన్నిటికి ఎన్నికల్లో నిలిచే అభ్యర్థులే ఉండరు.

అక్కడేమో కార్యవర్గం - కార్యాచరణ అంతా తూ తూ మంత్రంగా సాగుతుంటే..

ఇక్కడ మాత్రం ఢీ అంటే ఢీ అన్నట్టు ఉండడం విశేషం. 

అంతేలెండి.. ఎవరు ఎందుకు ఏ కారణంతో ఏం కోరుకుంటారో కానీ 

కొన్నిచోట్ల పట్టించుకోరు. కొన్నిచోట్ల పట్టు వదులుకోరు. 

కొందరు ప్రత్యక్షంగా పోరాడుతూ ఉంటారు. కొందరు వెనకుండి పావులు కదుపుతుంటారు. 

నమ్మిన వ్యక్తులే నారదులవుతారు. స్నేహితులే శకుని పాత్ర పోషిస్తారు. 

ఆ మహత్యం ఎన్నికలది. ఆ ప్రత్యేకత పదవులది.

అయితే ప్రజలకి దిశా నిర్దేశం చేయగలిగే వృత్తిలో వున్న పాత్రికేయులు 

వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటే వివేకవంతులు అనిపించుకుంటారు.

లేక సగటు జనుల్లాగే సాగతీసుకుంటూ వెళితే నీతులు చెప్పడానికే.. అన్న సామెతకి నిదర్శనం అవుతారు.!

✍️-పర్వతనేని రాంబాబు.

Read Here : PR PUNCH - అక్కడే కొడుతోంది తేడా..! 

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/cinejosh-special-article-pr-punch_b_1603220113.jpg Wed 16th Mar 2022 11:43 PM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/60326/cinejosh-special-feature-pr-punch.html cinejosh special feature pr punch,cinejosh special article pr punch,pr punch on press club elections 2022-03-16 13:13:55 ఎన్నికలలో.. ఎన్ని కళలో - PR పంచ్ ఎన్నికలలో.. ఎన్ని కళలో - PR పంచ్ CineJosh.com
60296 అక్కడే కొడుతోంది తేడా - PR పంచ్ CineJosh Special Feature PR Punch

]]>
చిన్నదైనా, పెద్దదైనా, రీజనల్ మూవీ అయినా, పాన్ ఇండియా ఫిలిం అయినా ఎంతో కొంత బజ్ ఉన్న ఏ సినిమా వచ్చినా ముందు అందరి చూపు పడేది రివ్యూల పైనే. అభిమానులు అత్యుత్సాహం చూపిస్తారు కాబట్టి బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు కాసులు కురిపిస్తాయి కానీ సాధారణ ప్రేక్షకులు వచ్చేది మాత్రం సినిమా గురించి కాస్త తెలుసుకున్నాకే. అసలే థియేటర్లలో బాదుడు బాగా పెరిగింది కనుక పాజిటివ్ టాక్ వస్తే తప్ప కామన్ ఆడియన్ కదలట్లేదు. దాంతో రివ్యూల ప్రభావం - రివ్యూవర్ల బాధ్యత రెండూ పెరిగాయి. ఆఫ్ కోర్సు అమ్ముడుపోయే విశ్లేషకులూ ఉన్నారు - నమ్మకాన్ని సొమ్ము చేసుకునే వెబ్ సైట్లూ కొన్ని ఉన్నాయి. అక్కడే కొడుతోంది తేడా. అదేంటంటే....

బాగున్న సినిమా బాలేదని ఎవరూ అనరు. అన్నా అసలు టాక్ తెలుసుకున్న జనం ఆగరు. అలాగే ఆశించినట్టు లేని సినిమాకి రేట్ ఇచ్చి కొనుక్కునే రేటింగ్ పనికిరాదు. లోపాయికారీ ఒప్పందాలు లోపాన్ని దాచలేవు. ఇదే డైజెస్ట్ కావట్లేదు ఇండస్ట్రీ జనాలకి.!

రీసెంట్ గా రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం పట్ల అసహనం వ్యక్తం చేసారు. రివ్యూల కంటే రిజల్ట్ ముఖ్యమని అనేసారు. అయితే ఈ ప్రాసెస్ లో తన తొలి చిత్రానికి స్వచ్ఛందంగా వచ్చిన పాజిటివ్ రివ్యూలని మరిచారు. యావత్ సినీ ప్రేక్షకులు తెలుగు సినిమా వైపు తలతిప్పి చూస్తుంటే తెలుగు సినిమా లక్షణాలే లేకుండా చేసిన ప్రయత్నంలోని తడబాటుని, తప్పుని ఒప్పుకోలేకపోయారు.

అలాగే తమన్ కూడా.! క్రాక్, అఖండ, భీమ్లా సినిమాలకి తమన్ పెద్ద ఎస్సెట్ అని మీడియా కోడై కూసినపుడు లొట్టలు వేసుకుంటూ, రీ ట్వీట్లు కొట్టుకుంటూ, భుజాలు చరుచుకున్న తమన్ రాధే శ్యామ్ సినిమా స్పందనని మాత్రం తప్పు పడుతున్నారు. లవ్ స్టోరీ ఎలా ఉంటుందో కొటేషన్స్ చెబుతూ.. లెసన్స్ కోసం క్రిటిక్స్ తన కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనే రేంజ్ లో మాటలు జారుతుండడం గమనార్హం.

అసలు యునానిమస్ హిట్ టాక్ ని ఎంజాయ్ చేసే ఈ సినీ జనం మిక్స్ డ్ రెస్పాన్స్ ని కూడా హుందాగా స్వీకరించే రోజు ఎప్పటికైనా వచ్చేనా.?

వాళ్ళు చెప్పింది వినడము.. వాళ్లకి కావాల్సింది రాయడమే మీడియా మహత్తర బాధ్యత అనే భావజాలం మునుముందైనా కనుమరుగయ్యేనా.??

✍️-పర్వతనేని రాంబాబు.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/pr-punch_b_1503220929.jpg Tue 15th Mar 2022 12:03 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/60296/cinejosh-special-article-pr-punch.html cinejosh special article pr punch,cinejosh special feature pr punch 2022-03-14 13:33:39 అక్కడే కొడుతోంది తేడా - PR పంచ్ అక్కడే కొడుతోంది తేడా - PR పంచ్ CineJosh.com
60188 రాజమౌళి విలనిజాన్ని హైలైట్ చేస్తారు: సూర్య Suriya Interview about ET

]]>
విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులను ఒకేసారి పాండమిక్ మార్చేసిందని ఇ.టి. కథానాయకుడు సూర్య తెలియజేస్తున్నారు. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చేలా చేసిందని అన్నారు.  ఇ.టి. (ఎవరికీ తలవంచడు) సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య మీడియా సమావేశంలో చిత్రం గురించి మాట్లాడుతూ..

- పాండమిక్ ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి. ఫ్యామిలీతో ఎలా గడపాలనేది తెలిపింది. 

- అదేవిధంగా నా మిత్రుడు మాధవన్ కూడా విదేశాలకు వెళ్ళి వుంటే అక్కడ తన కొడుక్కి స్విమ్మింగ్ నేర్పించాడు. కుటుంబానికి చాలా సమయం కేటాయించాడు. 

- పాండమిక్ బిజినెస్ పరంగా పర్యాటక రంగాన్ని, ఆసుపత్రులను పూర్తిగా మార్చేసింది.  డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో జరగలేదు ఏడాదిన్నర కాలం చాలా ఇబ్బందులు పడ్డారు

- అదేవిధంగా సినిమా రంగంలోనూ పెను మార్పులు వచ్చాయి. ఆకాశం నీ హద్దురా,  జై భీమ్ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి ఆదరణ పొందాయి. కలకత్తా నుంచి కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు.

- డిజిటల్ లో అల్లు అరవింద్ గారికి చెందిన ఆహా! ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చేలా చేసింది. రాజమౌళి సినిమాలు అన్నిచోట్ల బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది. మలయాళ పరిశ్రమలో కొత్త కంటెంట్లు అందరూ చూసి ఆనందిస్తున్నారు. దాంతో పరిశ్రమ మొత్తం మారిపోయింది.

- ఒక్కొక్కరు ఆర్టిస్టుగా ఏం చేయాలనేది గ్రహించారు. పైరసీ అరికట్టి ఓటీటీ కొత్త ఆడియన్స్ను తీసుకువచ్చింది. తమిళనాడులో 8కోట్ల జనాభా వుంటే 80 లక్షల మంది ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. అఖండ, పుష్ప, భీమ్లానాయక్ చిత్రాలు పాండమిక్ తర్వాత బూస్ట్ ఇచ్చాయి. రేపు రాబోయే ఇ.టి. కూడా అంత బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను.

 - ఇటి.లో కోర్ పాయింట్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని  దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ఇ.టి సినిమా.

- మన ఇంటికి బంధువులు వస్తే అమ్మాయితో మంచి నీళ్ళు ఇప్పిస్తారు. అబ్బాయి ఇవ్వడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇందులో చర్చించాం. ఎక్కడా అసందర్భ సన్నివేశాలు వుండవు. అదే విధంగా భార్యా భర్తల మధ్య చిన్న విషయాలు వస్తే సర్దుకుపోవాలని భార్యకు చెబుతారు. ఇలాంటివి దర్శకుడు బాగా చూపించాడు.

- రాజమౌళి, ఆయన ఫాదర్ విలనిజాన్ని హైలైట్ చేస్తారు. వారికి దానిని డీల్ చేయడం తెలుసు. ఇ.టి.లోనూ విలన్ సరికొత్తగా వుంటాడు. ఎంటర్టైన్ మెంట్, ఎమోషన్స్ దర్శకుడు బాగా చూపించాడు. ఇ

- కొత్త సినిమాలు లైన్ లో వున్నాయి. దర్శకుడు బాలతో ఏ సినిమా చేస్తున్నా. వెట్రిమారన్ తో వాడి వాసల్ సినిమా చేయాలి. అందులో ప్రతి షాట్ కి కనీసం 500 మంది ఆర్టిస్టులు వుండాలి. అందుకే  కరోనా టైంలో అది సాధ్యపడలేదు. జూన్లో ప్రారంభించాలని అనుకుంటున్నాం అని ముగించారు.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/suriya-interview_b_0503220852.jpg Sun 06th Mar 2022 07:22 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/60188/surya.html surya,suriya interview,suriya about et,suriya interview about et,surya photos 2022-03-05 20:52:03 రాజమౌళి విలనిజాన్ని హైలైట్ చేస్తారు: సూర్య రాజమౌళి విలనిజాన్ని హైలైట్ చేస్తారు: సూర్య CineJosh.com
60160 పెద్ద హీరోను అనే గర్వం ప్రభాస్ లో లేదు Bhagyashree Interview about Radhe Shyam

]]>
సల్మాన్ ఖాన్ రొమాంటిక్ హిందీ మూవీ మైనే ప్యార్‌ కియా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి భాగ్యశ్రీ. ప్రేమపావురాలు సినిమాతో తెలుగు ప్రేక్షక హృదయాలను ఉర్రూతలూగించింది. ఆ తరువాత  బాలకృష్ణ హీరోగా నటించిన యువరత్న రాణా సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా, రాజశేఖర్ హీరోగా నటించిన ఓంకారం సినిమాలోను నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ఆదరణ సంపాదించుకున్న నటి భాగ్యశ్రీ .ఆ తరువాత పలు హిందీ, మరాఠి, కన్నడ, భోజ్‌పురి సినిమాల్లో భాగ్యశ్రీ నటించారు. సుమారు రెండు దశాబ్దాల తరవాత తాజాగా  ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రంతో తన సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతోంది.

నేను సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు మొదటి సారిగా

తలైవి ,రాదే శ్యామ్ సినిమాలో యంగ్ మదర్ క్యారెక్టర్ చేయమని రెండు సినిమాల దర్శకులు వేరు వేరు గా కథలు చెప్పడం జరిగింది. రెండు సినిమాలు ప్యార్లల్ గా ఒకే సారి స్టార్ట్ అయినా కూడా ప్యాండమిక్ స్విచ్వేషన్ వలన రాధే శ్యామ్ డిలే అయ్యింది. ఫ్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కు ఫ్యాన్ ఇండియా సినిమా వంటి రాధే శ్యామ్ సినిమాలో నేను తల్లి గా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ చాలా గొప్ప నటుడు తనకు ఫ్యాన్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ తోటి వ్యక్తులతో తో కలిసి మెలిసి ఉంటాడు.తనతో సెట్ లో నటించేటప్పుడు ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ ఉండేది.పెద్ద హీరోను అనే గర్వం లేకుండా డౌన్ టూ ఎర్త్ ఉండటం ఈ మధ్య కాలంలో ప్రభాస్ నే చూస్తున్నాను.  యు.వి.క్రియేషన్స్ వాళ్ళు మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో సినిమా తీశారు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా గొప్పగా చిత్రీకరించారు. జార్జియా లో గడ్డ కట్టే చలి వున్నా కూడా నిర్మాతలు మమ్మల్ని బాగా చూసుకున్నారు.

మైనే ప్యార్‌ కియా తరువాత నేను కొన్ని సినిమాలు చేశాను. ఆ టైం లో పెళ్లి చేసుకొంటే ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుందని నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఫ్యామిలీ తో బిజీ గా ఉన్నందున నేను సినిమాలకు దూరం అయ్యాను. ఇప్పుడు మా పిల్లలు పెద్ద అయినందున మా హస్బెండ్ గాని గాని మా పిల్లలు గాని సినిమాలలో నటించమని ప్రోత్సాహించడంతో  సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాను

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరించారు. ఇవాళ బాలీవుడ్ తో ప్రతి ఒక్కరూ తెలుగు, తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగు నుండు చాలా మంచి చిత్రాలు తీస్తున్నారు. తెలుగులో ఒక్క మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా  నటనకు మంచి స్కోప్ వుండే పర్ఫార్మెన్స్ పాత్రలు ఎమున్నా చేయడానికి సిద్ధంగా వున్నాను అన్నారు.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/bhagyashree-interview_b_0303220602.jpg Fri 04th Mar 2022 04:32 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/60160/bhagyashree.html bhagyashree,radhe shyam,bhagyashree interview,prabhas,bhagyashree interview about radhe shyam 2022-03-03 18:02:11 పెద్ద హీరోను అనే గర్వం ప్రభాస్ లో లేదు పెద్ద హీరోను అనే గర్వం ప్రభాస్ లో లేదు CineJosh.com
60141 భీమ్లా చేశాక హీరోయిజం గురించి తెలిసింది Rana Daggubati Interview about Bheemla Nayak Success

]]>
భీమ్లానాయక్‌  డ్యానియేల్‌ శేఖర్‌ పాత్రతో మెప్పించిన రానా బుధవారం సినిమా గురించి ఆయన పాత్రకు వస్తున్న స్పందన గురించి మీడియాతో మాట్లాడారు.

భీమ్లానాయక్‌ విడుదల రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్‌ కంప్లీట్‌ అయ్యాక అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌తో సినిమా చూశా. అప్పటికే సోషల్‌ మీడియాలో సినిమా సూపర్‌హిట్‌ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది. 

ఇద్దరూ  ఇద్దరే...

కల్యాణ్‌గారి లాంటి పెద్ద స్టార్‌ వచ్చి ఇలాంటి జానర్‌ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌గారు చాలా ఎగ్జైటింగ్‌ పర్సన్‌. ఏం మాట్లాడిన చాలా విలువైన మాటలాగా ఉంటుంది. నాలెడ్జ్‌ ఉన్న వ్యకి, భాష సంస్కృతి మీద మంచి పట్టు వుంది. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్‌, పవన్‌కల్యాణ్‌ వల్ల చాలా నేర్చుకున్నా. 

ఆయనతో  బాగా కనెక్ట్‌ అయ్యా...

నా ఎక్స్‌పోజ్‌ సినిమానే. ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. డిఫరెంట్‌ ఆర్టిస్ట్‌లతో, కొత్త కథలు చేయాలనుకుంటా. అలాంటి వ్యక్తి పవన్‌కల్యాణ్‌. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. ఈ సినిమా అనుకున్నాక ఆయన నాకు బాగా కనెక్ట్‌ అయిపోయారు. చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి. 

భీమ్లానాయక్‌ చేశాక హీరోయిజం అంటే ఏంటో తెలిసింది. 

త్రివిక్రమ్‌ వెన్నెముక...

ఒక సినిమాను రీమేక్‌ చేయాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దాని మీద నాకూ అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న వెంకటేశ్‌ చాలా రీమేక్‌లు చేశారు. మార్పుల చర్చలు ఎలా ఉండాయో బాబాయ్‌ దగ్గర వినేవాడిని. ఈ సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్‌ చాలా కష్టపడ్డారు ఒరిజినల్‌ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా ఉన్న కథని మన వాళ్లకు నచ్చేలా ఎలా తీయాలో అలా చేశారు. 

నో డామినేషన్‌... 

ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్‌ ఏమీలేదు. డ్యాని పాత్ర కోసం నేను పెద్దగా కసరత్తులు ఏమీ చేయలేదు. డ్యాని ఎలా ఉండాలో అలాగే ఉన్నా. పవన్‌కల్యాణ్‌గారు కూడా అంతే! సింపుల్‌గా ఆ పాత్ర ఎలా ఉంటుందో అలాగే సెట్‌ లో ఉండేవారు. 

ఆ ప్రయత్నం చేస్తా. 

నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. బాహుబలి తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. 

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/rana-daggubati-interview_b_0203220530.jpg Thu 03rd Mar 2022 04:00 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/60141/rana-daggubati.html rana daggubati,rana daggubati interview,bheemla nayak success,pawan klayan,rana about bheemla nayak 2022-03-02 17:30:53 భీమ్లా చేశాక హీరోయిజం గురించి తెలిసింది భీమ్లా చేశాక హీరోయిజం గురించి తెలిసింది CineJosh.com
60116 రష్మిక వల్లే సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది Rashmika Mandanna Interview about Adavallu Meeku Joharlu movie

]]>
రష్మిక మందన్న ఆడవాళ్లు మీకు జోహార్లు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...

- ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది.

- ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య. ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. 

-  దర్శకుడు కిషోర్ తిరుమలతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. మాల వేసుకునేవారు. ఏం కోరుకున్నారు సార్ అని అడిగితే.. ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కదా అన్నీ సవ్యంగా జరగాలని కోరుకున్నా అని నవ్వుతూ చెప్పేవారు. 

- శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు.. షూట్ కు వచ్చినప్పుడు చాలా రిలాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం. 

- ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. నేను ఉన్నందుకే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని ఖుష్బూ గారు అనడం నామీదున్న ప్రేమతోనే.

- ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. వాళ్లను చూస్తుంటే మహిళా శక్తిని చూసినట్లు ఉంది. 

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/rashmika-mandanna-interview_b_2802220521.jpg Tue 01st Mar 2022 03:51 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/60116/rashmika-mandanna.html rashmika mandanna,rashmika mandanna interview,adavallu meeku joharlu movie,rashmika mandanna interview about adavallu meeku joharlu 2022-02-28 17:21:44 రష్మిక వల్లే సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది రష్మిక వల్లే సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది CineJosh.com
60088 రాధే శ్యామ్ మెయిన్ కంక్లూజన్ అదే,! Director Radha Krishna Kumar Interview about Radhe Shyam

]]>
-  రాధేశ్యామ్ స్టోరీ చెప్పిన వెంట‌నే అందులో ఉన్న మెయిన్ పాయింట్ కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు, త‌న పోషిస్తున్న విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఉన్న విభిన్న షేడ్స్ విష‌యంలో ప్ర‌భాస్ గారు చాలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించారు

- రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామ‌నుకున్నా కానీ ప్ర‌భాస్ గారు ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఇట‌లీ బ్యాక్ డ్రాప్ కి మార్చాను, అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువ‌ల్ ఎస్సెట్ గా మారింది

- కోవిడ్ కి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేశాము, కోవిడ్ కార‌ణంగా వ‌చ్చిన ఆంక్ష‌లు కార‌ణంగా ఇట‌లీని హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ మ‌ధ్య రాధేశ్యామ్ షూటింగ్ జ‌రిగింది

- జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్ గా ఓ విష‌యాన్ని చెప్పాము, అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్

- రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్ లో ప్ర‌భాస్ న‌టించారు, ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్

- దేశాల ప్ర‌భుత్వాల‌నే మార్చేసెంత శ‌క్తిగా సోషల్ మీడియా త‌యారైంది, అన్ని చిత్రాల ప్ర‌మోష‌న్స్ కి మీడియాతో పాటు సోష‌ల్ మీడియా అవ‌స‌రం

- రాధేశ్యామ్ ని థ‌మ‌న్ త‌న అద్భుత‌మైన రీరాక్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లారు

- ప్ర‌భాస్, పూజా హెగ్దేల జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా, రొమాంటిక్ గా ఉండ‌నుంది

- రాధేశ్యామ్ లో మెజార్టీ విఎఫ్ ఎక్స్ వ‌ర్క్స్ ఉక్రేయిన్ లోనే చేయించాము, అన్ని స‌కాలంలోనే పూర్తి చేశాము

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/director-radha-krishna-kumar-interview_b_2602220436.jpg Sun 27th Feb 2022 12:59 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/60088/director-radha-krishna-kumar.html director radha krishna kumar,radha krishna kumar interview,radha krishna kumar about radhe shyam,prabhas,pooja hegde,director radha krishna kumar interview 2022-02-26 14:29:00 రాధే శ్యామ్ మెయిన్ కంక్లూజన్ అదే,! రాధే శ్యామ్ మెయిన్ కంక్లూజన్ అదే,! CineJosh.com
59948 నా నెక్స్ట్ హీరో నాగ చైతన్య: కిషోర్ తిరుమల Director Kishor Tirumala Interview about Adavallu meeku Joharlu Movie

]]>
ఫిబ్రవరి 25 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రమోషన్స్ జోరు గా మొదలైపోయాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో తలపడడం అంటే కాస్త రిస్కీ విషయమే.. అయినా.. ఆడవాళ్లు మీకు జోహార్లు ఎక్కడా తగ్గడం లేదు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు కిషోర్ తిరుముల సినీజోష్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

కిషోర్ తిరుమల ఇంటర్వ్యూలో హైలైట్స్

ఈ సినిమాకు శ‌ర్వానంద్‌నే అనుకున్నారా?

ముందుగా ఆయ‌న్నే అనుకున్నాం. శర్వానంద్ వేరే జోనర్‌లకు చెందిన సినిమాలు చేస్తున్నాడని భావించాడు. అందుకే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చెప్పమని అడిగాడు. ఈ క‌థ చెప్పాను. శ‌ర్వా క‌థ‌ను వింటూ ఆనందించాడు. అతను కథను ఓకే చేసిన తర్వాత, నేను కొన్ని మార్పులు చేసి స్క్రిప్ట్‌ను రూపొందించాను.

ర‌ష్మిక క‌థ విని ఏమ‌న్నారు?

త‌ను చాలా బిజీ ఆర్టిస్టు. ఈ క‌థ‌ను రష్మిక మందన్న కు ఎక్స్ప్లెయిన్ చేయ‌గానే ఉల్లాసంగా అనిపించి వెంట‌నే చేసేస్తాను అని చెప్పింది. 

ఎక్కువ మంది మ‌హిళ‌లు వుండ‌డంలో కథ ఎలా సాగుతుంది?

ఒక ఇంటిలో ఒకే ఒక్క వార‌సుడు పుడ‌తాడు. అత‌నికి ఐదుగురు అక్కా చెల్లెళ్ళు వుంటారు. వారు అత‌న్ని ఎంత గారాబంగా, బాధ్య‌త‌గా చూస్తార‌నేది ఇందులో చూపించాను. వారి భావోద్వేగాలు ఈ వ్యక్తి చుట్టూ తిరుగుతాయి. నేను క‌థ‌ను  కాగితంపై పెడితే ఎంటర్టైన్మెంట్  ఉండేలా చూసుకుంటాను.

రిలీజ్ టైం క‌రెక్టే అనుకుంటున్నారా?

భీమ్లా నాయక్ విడుదల గురించి మీరు అడుగుతున్నారని అర్థ‌మైంది. మా సినిమా రిలీజ్ డేట్ అనేది నిర్మాతల ఫైనల్ చేస్తారు.

ఓటీటీవైపు వెళ్ళే ఆలోచ‌న వుందా?

OTT చేయడం అనేది ఒక ప్రతిభ. కానీ నేను పెద్ద స్క్రీన్ నే ఇష్ట‌ప‌డ‌తాను.

మీ కొత్త ప్రాజెక్ట్‌లు?

నా తదుపరి సినిమా నిర్మాత డివివి దానయ్య గారితో ఉంటుంది. ఇది రామ్-కామ్ అవుతుంది. హీరోగా నాగ చైతన్య అనుకుంటున్నాం.. ఇంటర్వ్యూ అంటూ ముగించారు.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/kishor-tirumala-interview_b_1602220522.jpg Thu 17th Feb 2022 03:52 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/59948/director-kishor-tirumala.html director kishor tirumala,kishor tirumala interview,adavallu meeku joharlu movie 2022-02-16 17:22:51 నా నెక్స్ట్ హీరో నాగ చైతన్య: కిషోర్ తిరుమల నా నెక్స్ట్ హీరో నాగ చైతన్య: కిషోర్ తిరుమల CineJosh.com
59843 నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని.! Director Manu Anand Interview about FIR

]]>
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ  చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో  ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు మను ఆనంద్ తో ఇంట‌ర్వ్యూ విశేషాలు.

ఎఫ్‌.ఐ.ఆర్‌. ఏ త‌ర‌హా సినిమా?

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్ర‌రిజంలో కేసులో ఇరుక్కుంటాడు. ఆ త‌ర్వాత ఏమ‌యింది అనేది క‌థ‌.

మీకు మొద‌టి సినిమా. విష్ణు విశాల్ ను ఎలా ఒప్పించ‌గ‌లిగారు?

ముందు విష్ణుకు డ్రెగ్ నేప‌థ్యంలో ఓ క‌థ చెప్పాను. అది భారీ సినిమా అవుతుంద‌ని మ‌రో క‌థ చెప్ప‌మ‌న్నారు. అప్పుడు ఎఫ్‌.ఐ.ఆర్‌. చెప్పాను.

మీ నేపథ్యం గురించి చెప్పండి?  

నేను ఆస్ట్రేలియాలో మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలో ప‌నిచేశాను. సినిమాపై ఇంట్రెస్ట్‌తో 2011లో ఇండియా వ‌చ్చాను. గౌత‌మ్ మీన‌న్ ద‌గ్గ‌ర 8 సంవ‌త్స‌రాలు ప‌నిచేశాను. 

దేశంలో లెఫ్ట్  రైట్ అనే గ్రూపులున్నాయి. ఇలాంటి టైంలో ఎఫ్‌.ఐ.ఆర్‌ వంటి సినిమా రిస్క్ ఏమో?

నేను ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ఎటువంటి కాంట్ర‌వ‌ర్సీని ట‌చ్ చేయ‌లేదు. ఒక ముస్లిం బోయ్ ప్ర‌పంచాన్ని ఏ కోణంలో చూస్తాడు అనేది చూపించాను. ఇది ఏ మ‌తానికి సంబంధించిన సినిమా కాదు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. హ్యూమ‌న్ రిలేష‌న్స్‌, డ్రామా కూడా వుంది. డైలాగ్స్ కూడా ఎవ‌రినీ టార్గెట్ చేసిన‌ట్లు వుండ‌వు. మ‌న‌ది సెక్యుల‌ర్ దేశం. ఫిలింలో కూడా అదే మేం చెబుతున్నాం. సినిమా చూశాక ప్రేక్ష‌కుడే తీర్పు ఇస్తాడు. 

ట్రైలర్ చూస్తే కంప్లీట్ యాక్ష‌న్ సినిమాలా వుంది. మరి ముగ్గురు హీరోయిన్ల‌కు స్పేస్ వుందా?

ఇందులో హీరో, విల‌న్‌, హీరోయిన్ అనేది లేదు. మూడు ఫిమేల్ పాత్ర‌లున్నాయి. అవి క‌థ‌కు కీల‌కం. 30 నిముషాల‌పాటు వారి పాత్ర‌లే వుంటాయి. విష్ణు పెద్ద‌గా క‌నిపించ‌డు. రానురాను క‌థ లో టిస్ట్‌లు క‌నిపిస్తాయి.

ర‌వితేజ‌ మీ సినిమాలో ఎలా ప్ర‌వేశించారు?

విష్ణు భార్య జ్వాలా గుప్త‌గారు ర‌వితేజ‌కు క్లోజ్ ఫ్రెండ్‌. అందుకే ఈ సినిమా పూర్త‌య్యాక  ఆరు నెల‌ల క్రితం ట్రైల‌ర్ చూపించారు. అది చూడ‌గానే సినిమా చూస్తాన‌న్నారు. చూశాక చాలా బాగుంది.. నేను ఈ సినిమాకు హెల్ప్ చేస్తాన‌ని ముందుకు వ‌చ్చారు.

ఒకేరోజు రవితేజ‌ సినిమా మీ సినిమా విడుదలవడం ఎలా అనిపిస్తుంది?

ర‌వితేజ ఖిలాడి అంచ‌నాల‌తో వస్తుంది. ఫ్యాన్స్ చూస్తారు. అలాగే ర‌వితేజ స‌మ‌ర్ప‌కులుగా వున్నార‌నే ఆస‌క్తితో మా సినిమానూ ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ చూస్తార‌నే న‌మ్మ‌కం వుంది.

మీ సినిమాను ఎందుకు చూడాలంటే ఏమి చెబుతారు?

తెలుగు ఆడియ‌న్స్ సినిమా ప్రియులు. మంచి సినిమాని ఆద‌రిస్తారు. కొత్త‌వారిని స‌పోర్ట్ చేస్తారు. 

తెలుగులో మీకు న‌చ్చిన హీరో ఎవ‌రు.?

నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని. ఆయ‌న సినిమా త‌ప్ప‌కుండా చూస్తా. అలాగే మ‌హేష్‌బాబు సినిమాలు చూస్తా. పుష్ప సినిమా కూడా చెన్నైలో తెలుగు వ‌ర్ష‌న్ చూశా.

ద‌ర్శ‌కులలో ఎవ‌రంటే ఇష్టం?

కొర‌టాల శివ‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో చాలా అంశాలు దాగి వుంటాయి. అలాగే బాహుబ‌లి వంటి ఇంట‌ర్నేష‌నల్ సినిమా తీసిన రాజమౌళిగారు కూడా ఇష్టం.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/director-manu-anand-interview_b_0802220818.jpg Wed 09th Feb 2022 06:48 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/59843/director-manu-anand.html director manu anand,director manu anand interview,fir movie,r avi teja,vishnu vishal 2022-02-08 20:18:55 నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని.! నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని.! CineJosh.com
59823 మహేష్ - బన్నీలతో పోల్చుకునే రోల్ ఇది Director Vimal Krishna Interview about DJ Tillu

]]>
మహేష్ - బన్నీలతో పోల్చుకునే రోల్ ఇది - డి జె టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ

ఏ ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి డిజె టిల్లు చిత్రాన్ని చూడొచ్చని చెబుతున్నారు దర్శకుడు విమల్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డిజె టిల్లు చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత.  శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిజె టిల్లు సినిమా విశేషాలను దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

- సినిమాలకు ముందు షార్ట్ ఫిలింస్ చేశాను. ఒకట్రెండు చిత్రాల్లో నటించాను. కానీ నా ఆలోచన ఎప్పుడూ ఒక మంచి కథను తెరపై చూపించాలి అని ఉండేది. ఆన్ స్క్రీన్ ఉండాలనే కోరిక తక్కువ. సిద్దూ నాకు పదేళ్లుగా తెలుసు. తన బాడీ లాంగ్వేజ్, ఎలా మాట్లాడుతాడు ఇవన్నీ చూశా. నేను కథ రాసుకున్నప్పుడు ఈ టిల్లు క్యారెక్టర్ కు సిద్ధు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. సిద్ధూకు చెబితే చాలా బాగుందని చేసేందుకు ముందుకొచ్చాడు. నేను కథ రాస్తే, సిద్ధూ డైలాగ్స్ రాశాడు. మేమిద్దరం కలిసి రచన చేశాం. మేము మాట్లాడుకుంటున్నప్పడే చాలా సంభాషణలు వచ్చేవి. వాటిని సినిమాలో ఉపయోగించాం. లాక్ డౌన్ ముందు రాసిన కథ ఇది. తర్వాత మాకు ఇంప్రూమెంట్ చేసుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. దాంతో వీలైనంత డీటైయిల్డ్ గా స్క్రిప్ట్ రెడీ చేశాం. నా దగ్గర ఇది కాక మరో మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే నా తొలి సినిమా ప్రభావాన్ని చూపించాలి. జనాల్లోకి వెళ్లాలి. అందుకే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కథతో తొలి సినిమా రూపొందించాను.

- సిద్ధూ నేనూ సినిమాను చూసే విధానం ఒకేలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అనే విషయంలో ఇద్దరం దాదాపు ఒకేలా ఆలోచిస్తాం. మా మధ్య ఎప్పుడూ క్రియేటివ్ విబేధాలు రాలేదు. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా విడుదలయ్యాక నిర్మాత వంశీ గారి దగ్గర నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. అప్పటికే మా దగ్గర డిజె టిల్లు కథ సిద్దంగా ఉంది. వెంటనే వెళ్లి చెప్పాం. ఆయనకు నచ్చడంతో సితారలో సినిమా మొదలైంది. సినిమా తొలి భాగాన్ని ఎంత ఆస్వాదిస్తారో, ద్వితీయార్థాన్నీ చూస్తూ అంతే ఆనందిస్తారు. 

- ట్రైలర్ లో చూస్తే నాయిక చుట్టూ ముగ్గురు నలుగురు మగాళ్లు ఉన్నట్లు చూపించాం. ఆ నలుగురు సోదరులు అవొచ్చు, స్నేహితులు అవొచ్చు. కానీ సమాజం మహిళను ఆ సందర్భంలో చూసే కోణం వేరు. ఈ దృక్పథం తప్పు. అయితే ఈ విషయాన్ని సందేశంగా చెబితే ఎవరికీ నచ్చదు. లోతుగా వెళ్లి చర్చిస్తే విసుగొస్తుంది. కానీ నవ్విస్తూ, వినోదాత్మకంగా చూపిస్తే చూస్తారు. మేము ఎంటర్ టైనింగ్ దారిని ఎంచుకుని డిజె టిల్లు చేశాం. 

- ట్రైలర్ లో రొమాంటిక్ ఫ్లేవర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు కానీ సినిమాలో కథానుసారం అలా కొంత రొమాంటిక్ సందర్భాలు ఉంటాయి. కావాలని రొమాన్స్ ఎక్కడా చేయించలేదు. అది హద్దులు దాటేలా ఉండదు. సిద్దూ హైదరాబాద్ కుర్రాడు, అతనిలో డిజె టిల్లు క్వాలిటీస్ ఉన్నాయి. ఆ బాడీ లాంగ్వేజ్ మేకోవర్ అంతా దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్యారెక్టర్ లోకి త్వరగా వెళ్లిపోగలిగాడు. నరుడు బ్రతుకు నటన అని ముందు టైటిల్ అనుకున్నాం కానీ సినిమా గురించి ఎవరికి చెప్పినా ఇది డిజె టిల్లు కదా అనేవారు. దాంతో అదే పేరును టైటిల్ గా పెట్టుకున్నాం. 

- టిల్లు తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటాడు. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో పోల్చుకుంటాడు. హీరోకున్న ఈ క్వాలిటీ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. సినిమాలో నాయిక పేరు రాధిక. మాటల్లో..జాతీయ ఉత్తమ నటి రాధిక ఆప్తే అని సరదాగా అనుకున్నాం. అది సినిమాలో అలాగే పెట్టాం. నిర్మాత నాగవంశీ చాలా సపోర్ట్ చేశారు. ఏది ఎలా కావాలంటే అలాగే చేయండని ప్రోత్సహించారు. ఎప్పుడూ ఇది వద్దు అని చెప్పలేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు కుటుంబ కథా చిత్రాల సంస్థ అని పేరుంది. అలాగని డిజె టిల్లు కథను తెరకెక్కించడంలో కాంప్రమైజ్ కాలేదు. సహజంగా మా కథలోనే ఎవరికీ ఇబ్బందిలేని అంశాలున్నాయి.

- త్రివిక్రమ్ గారు స్క్రిప్టు విషయంలో మంచి సూచనలు ఇచ్చారు. త్రివిక్రమ్ గారిని తరుచూ కలవడం, మీటింగ్స్ ఈ సినిమాతో మాకు దొరికిన గొప్ప జ్ఞాపకాలు. 

- డిజె టిల్లు ద్వారా కొత్త టేకింగ్, ఫ్రెష్ మేకింగ్ చూపించాలన్నదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సఫలం అయ్యామని అనుకుంటున్నాము. నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ట్రైలర్ చూశాక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామని ఫోన్ చేశారు. సినిమా కుదిరాక వివరాలు వెల్లడిస్తా.

హీరో సిద్దు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా డిజె టిల్లునుంచి నీ కనులను చూశానే పాట విడుదల:

సోమవారం హీరో సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా డిజె టిల్లు చిత్రం నుంచి నీ కనులను చూశానే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రవికాంత్ పేరెపు సాహిత్యాన్ని అందిచగా సిద్ధు పాడటం విశేషం. అడ్మైరింగ్ పాటలా సాగే ఈ గీతం కథానాయకుడి ప్రేమను ఆవిష్కరించింది. నీ కనులను చూశానే, ఓ నిమిషం లోకం మరిచానే, నా కలలో నిలిచావే, నా మనసుకు శ్వాసై పోయావే అంటూ సాగుతుందీ పాట.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/director-vimal-krishna-interview_b_0702220612.jpg Tue 08th Feb 2022 04:42 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/59823/director-vimal-krishna.html director vimal krishna,director vimal krishna interview,dj tillu movie 2022-02-07 18:12:50 మహేష్ - బన్నీలతో పోల్చుకునే రోల్ ఇది మహేష్ - బన్నీలతో పోల్చుకునే రోల్ ఇది CineJosh.com
59818 ఏపీలో పర్మిషన్ అడిగాం: నిర్మాత కోనేరు Producer Koneru Satyanarayana Interview about Khiladi Movie

]]>
కమర్షియల్ అంశాలు ఉంటూనే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఖిలాడీ సినిమా ఉంటుంది - చిత్ర‌ నిర్మాత కోనేరు సత్య నారాయణ

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది.  డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు మీడియాతో ముచ్చటించారు.

ఖిలాడి సినిమా కథను రమేష్ వర్మ నాకు చెప్పారు. కథ విన్నప్పుడే నాకు నచ్చింది. ఇది రవితేజ గారికి బాగుంటుందని అన్నాను. ఆయనకు కూడా కథ వినిపించారు. చేస్తాను అని మాటిచ్చారు. రైటర్ శ్రీకాంత్ గారితో డైలాగ్స్ రాయించాం. అయితే సినిమా ప్రారంభించడానికి ఆలస్యమవుతుందని అనుకున్నాం. కానీ వెంటనే సినిమా చేసేద్దామని రవితేజ అన్నారు.

నేను కథను నమ్ముతాను. రాక్షసుడు సినిమా కథను నమ్మాను. అది హిట్ అయింది. ఇందులో కథ బాగుంటుంది. హీరో హీరోయిన్లు కెమెరా ఇదంతా సెకండరీ. కథ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. మీ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్ట్ చేయాలని ఈ సినిమాను చేస్తున్నానని రవితేజ గారితో చెప్పాను.

రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఇలాంటి పాయింట్‌తో ఇది వరకు సినిమా రాలేదు. కొత్త పాయింట్‌తో రాబోతోంది. బాలీవుడ్ మూవీలా ఉంటుంది. ఇటలీలో కొన్ని షాట్లు తీశాం. వాటిని చూస్తే హాలీవుడ్‌ రేంజ్‌లో అనిపిస్తుంది. సినిమా ఎంతో స్టైలీష్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉంటాయి.

నా సినిమా మీదు నాకు నమ్మకం ఉంది. సినిమా చూసి ఈ మాట చెబుతున్నాను. అవుట్ కమ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. రాక్షసుడు సినిమా చూసి ఎలాంటి ఫలితం వస్తుందని అనుకున్నానో ఇప్పుడు దాని కంటే ఎక్కువ రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాను.

రమేష్ వర్మ నాకు ఈ సినిమాను చూపించారు. నాకు బాగా నచ్చింది. దీంతో ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. అందుకే ఆ కారును బహుమతిగా ఇచ్చాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది.

ఇతర వ్యాపారాలు, విద్యా సంస్థలున్నా కూడా హవీష్ కోసమే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాను. హవీష్ కోసమే సినిమాలను నిర్మించాను. హవీష్ కు ఈ ఫీల్డ్‌లోనే ఆసక్తి ఉంది.

ఈ కథను ఆల్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్దామని పెన్ స్టూడియోస్‌తో కలిశాం. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది.

సినిమా విడుదల విషయంలో నాకు కూడా అనుమానం ఉండేది. అనుకున్న సమయానికి రమేష్ వర్మ అందిస్తాడా? లేదా? అనుకున్నాం. కానీ దీన్నో చాలెంజ్‌లా తీసుకున్నారు. చెప్పిన సమయానికి సినిమాను రెడీ చేసి ఇచ్చారు.

ఏపీలో నాలుగు ఆటలకు పర్మిషన్ అడిగాం. అయినా నైజంలో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. సోలో రిలీజ్‌గానే వస్తున్నాం. ఫిబ్రవరి 25వరకు ఇంకో పెద్ద సినిమా ఏదీ కూడా రాకపోవచ్చు. ఖిలాడీ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని నమ్ముతున్నాను.

హవీష్‌ ప్రస్తుతం సంజయ్ రామస్వామి అనే సినిమాను చేస్తున్నాడు. ఆ స్టోరీ, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆ తరువాత ఏ స్టూడియోస్ మీద చేస్తున్నాం. రాక్షసుడు 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. వంద కోట్ల యోధ‌ అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం.

ఏ వ్యాపారం అయినా కూడా నిబద్దత, క్రమశిక్షణతో చేయాల్సి ఉంటుంది. సినిమా కోసం నేను మొత్తం డిజిటల్‌ పేమెంట్ చేశాను. ఇప్పటి వరకు నేను సినిమా ఇండస్ట్రీలో యాభై శాతం నేర్చుకున్నట్టు అయింది. ఇంకో రెండు మూడు సినిమాలు చేస్తే ఇంకాస్త నాలెడ్జ్ వస్తుంది.

ఇంత వరకు ఇంజనీరింగ్ కాలేజ్‌లు పెట్టాను. కానీ ఇప్పుడు వంద ఎకరాల్లో ఓ యూనివర్సిటీ కట్టాలని అనుకుంటున్నాను. అందులో ఇంజనీరింగ్ కంటే ఎంటర్టైన్మెంట్‌ను ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. వరల్డ్ హై క్లాస్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ యూనివర్సిటీని కట్టాలని అనుకుంటున్నాను.

పెళ్లి చూపులు సినిమాను తమిళంలో రీమేక్ చేశాను హిట్ అయింది. రాక్షసుడు సినిమాను కూడా రీమేక్ చేశాను. అది కూడా హిట్ అయింది. ఖిలాడీ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమా కాస్త బడ్జెట్ పెరిగినా కూడా బాగా వచ్చింది. రీమేక్ కథను అనుకున్నాం. కానీ అది మధ్యలో ఆపేసి.. ఖిలాడీని లైన్‌లో పెట్టాం.

కథకు తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టుకోవాలి. దేవీ శ్రీ ప్రసాద్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐదు పాటలు హిట్ అయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో టైప్ మ్యూజిక్ ఇస్తుంటారు. హీరోయిన్లు కూడా చక్కగా నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిందీలో కూడా పోటీగా ఏ సినిమా రావడం లేదు. హిందీలో రవితేజ డబ్బింగ్ చెప్పలేదు. కానీ అక్కడ ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది.

సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషలలో ఖిలాడి సినిమా విడుదల కానుంది.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/producer-koneru-satyanarayana-interview_b_0702220329.jpg Tue 08th Feb 2022 01:59 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/59818/producer-koneru-satyanarayana.html producer koneru satyanarayana,khiladi movie,r avi teja,producer koneru satyanarayana interview 2022-02-07 15:29:48 ఏపీలో పర్మిషన్ అడిగాం: నిర్మాత కోనేరు ఏపీలో పర్మిషన్ అడిగాం: నిర్మాత కోనేరు CineJosh.com
59788 ర‌వితేజ‌ ష్యూర్ షాట్ హిట్ అన్నారు - విష్ణు విశాల్ Kollywood Hero Vishnu Vishal Interview about FIR Movie

]]>
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్. ఈ  చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మీడియాతో ముచ్చటించారు.

ఇండస్ట్రీలోని కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ మూవీ దర్శకుడు మను ఆనంద్ పరిచయమయ్యారు. ఆయన గౌతమ్ మీనన్ గారితో పని చేశారు. మొదటగా ఆయన ఓ యాక్షన్ పాక్డ్ స్టోరీని చెప్పారు. ఇంకా వేరే ఏదైనా ఉందా? అని అడిగాను. కథ మొత్తం రెడీ కాలేదు కానీ.. లైన్ ఉందని అన్నాను. ఆ లైన్ చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశాను. అంత సున్నితమైన కథను ఒప్పుకుంటాను అని ఆయన అనుకోలేదు. నేను ఓకే అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. మామూలుగా అయితే ఈ సినిమాను వేరే ఫ్రెండ్ నిర్మించాలి. కానీ చివరకు నేనే నిర్మాతగా మారాను.

నేను క్రికెటర్‌ని. మా నాన్న పోలీస్ ఆఫీసర్. ఎప్పుడూ ట్రాన్సఫర్ అవుతూనే ఉంటారు. క్రికెట్ వల్ల నాకు సయ్యద్ మహ్మద్ ఎక్కువ దగ్గరయ్యారు. నేను ఎప్పుడూ మతాలు, కులాలు, ప్రాంతాలు అని చూడను. వాటిపై నాకు నమ్మకం లేదు. మా ఇద్దరి మధ్య మతం ఎప్పుడూ రాలేదు. కానీ సమాజంలో జరిగిన సంఘటనలు బాధను కలిగిస్తుంటాయి. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా కొన్ని ఘటనలు నాకు గుర్తొచ్చాయి. ఈ సినిమాలో ఎవ్వరినీ, ఏ మతాన్ని కూడా బాధపెట్టబోం. మతం కంటే మానవత్వమే గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ సినిమా కోసం మను ఆనంద్ చాలా రీసెర్చ్ చేశారు. నిజ జీవితంలో ఓ ముస్లిం అబ్బాయికి జరిగిన ఘటనలను కూడా ఉదాహరణగా చూపించారు. మతాన్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి ఘటనలు ఎక్కడైనా, ఎవరికైనా జరగొచ్చు. ఈ సినిమాలో మాత్రం ఏ మతాన్ని కూడా కించపరిచేలా సన్నివేశాలు లేవు. సెన్సార్ సమయంలోనూ రెండు మూడు పదాలకు మ్యూట్ చెప్పారు,  కట్స్ కూడా చాలా తక్కువే సూచించారు.

నాకు గౌతమ్ మీనన్‌ సర్ అంటే చాలా ఇష్టం. నేను ఆయన అభిమానిని. ఆయన యాక్టర్స్ నుంచి నటనను రాబట్టుకునే తీరు బాగుంటుంది. వారణం ఆయిరాం (సూర్య సన్నాఫ్ కృష్ణన్) సినిమాలో సూర్యను చూపించిన విధానం నాలో ఎంతో స్పూర్తినిచ్చింది. ఎంతో చాలెంజింగ్ రోల్స్ చేయాలని అనుకున్నాను. అరణ్య సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ఎన్నో గాయాలయ్యాయి. వారణం ఆయిరాం సినిమాయే నాకు స్పూర్తి. అలాంటి డైరెక్టర్ నా సినిమాలో, నా నిర్మాణంలో నటించారు. ఆయన ఎంతో మంచి నటులు.

రాక్షసన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయమని నా భార్య జ్వాల అడిగారు. కానీ నేను ఆ సినిమాకు నిర్మాతను కాను. ఈ చిత్రాన్ని చూసిన నా భార్య ‘నువ్వే నిర్మాత కదా? ఈ సారి మాత్రం తెలుగులో కచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే’ అని అన్నారు. నా భార్య ఫ్రెండ్ రవితేజ గారి వద్ద పని చేస్తుంటారు. అలా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాం. నా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని రవితేజ అన్నారు. ఇలాంటి సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటావ్ అని అడిగారు. నేను మీలా మాస్ హీరో అవ్వాలని అనుకుంటున్నాను అని చెబితే.. నేను నీలా కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఈ మూవీ రఫ్ కట్ చూసి షూర్ షాట్ హిట్ అని అన్నారు. కొన్ని కరెక్షన్స్ చెప్పారు. కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. నా కెరీర్‌లో ఈ సినిమా హయ్యస్ట్ బిజినెస్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలు, కంటెంట్ సినిమాలను ఆదరిస్తారు.

నాకు రీమేక్స్ అంటే నచ్చవు. ఒక్కసారి చూసిన సినిమాను మళ్లీ చేయాలంటే నచ్చదు. ఒరిజినల్ అనేది ఎప్పుడూ ఒరిజినలే. రీమేక్ సినిమా కంటే నా ఒరిజినల్ సినిమా బాగుంటేనే సంతోషిస్తాను. అందుకే ఇలాంటి పోలికలు రావొద్దని నేను రీమేక్ చేయను. నా సినిమాలు రీమేక్ అయినా చూడను. కానీ నేను క్రికెటర్ అవ్వడంతో జెర్సీ రీమేక్ చేశాను.

సినిమాను డాక్యుమెంటరీగా తీస్తే ఎవ్వరూ చూడరు. కమర్షియల్ పంథాలో చెప్పాలి. ఈ సినిమాలో డైలాగ్స్ మనసును తాకేలా ఉంటాయి. ప్రతీ పాత్ర, ప్రతీ డైలాగ్‌కు ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. మేం ఏం చెప్పదలుచుకున్నామో అది అందరికీ సులభంగా అర్థమవుతుంది.

కరోనా తరువాత జనాలు ఇంకా ఇంటెలిజెంట్ అయ్యారు. ఓటీటీలో అన్ని రకాల సినిమాలు చూసేశారు. వారిని ఎంటర్టైన్ చేయాలంటే ఏదో ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. టైటిల్ నుంచి కూడా ఏదో ఒక కొత్తదనాన్ని ఆశిస్తుంటారు. అందుకే ఈ సినిమా టైటిల్‌ను FIR అని పెట్టాం. ఆ టైటిల్ మీనింగ్ ఏంటన్నది ఇప్పుడు చెప్పలేను. సినిమా చూశాక అర్థమవుతుంది.

పాటల కంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా సెకండాఫ్ మొత్తం కూడా యాక్షన్ పార్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్ చూసి చాలా మంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకున్నారు. ప్రయాణం పాట పెద్ద హిట్ అవుతుంది.

ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. పాత మొహాలే ఉంటే.. తరువాత ఏం జరగుతుందో ఊహించేస్తారు. అందుకే ఈ సినిమాకు చాలా మంది కొత్త వారిని తీసుకున్నాం.

నా కెరీర్‌లో రాక్షసన్ కంటే ముందు హిట్లున్నాయి. రాక్షసన్ మాత్రం నా మార్కెట్‌ను పెంచేసింది. ఈ సినిమా తరువాత చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి. పెద్ద బ్యానర్లు, మంచి డైరెక్టర్లతో సినిమాలు ఓకే అయ్యాయి. మధ్యలోనే కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. నాకు ఇలా జరగడం ఏంటి? అనే కోపంతోనే నిర్మాతగా మారాలని అనుకున్నాను. అలా ఈ సినిమాను నిర్మించాను. కరోనా వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సెకండ్ వేవ్ సమయంలో కాస్త ఒత్తిడికి గురయ్యాను. ఓటీటీకి ఇచ్చేయాలా? అని ఆలోచించాను. థియేట్రికల్ కలెక్షన్స్ బట్టే మార్కెట్ ఉంటుంది కాబట్టి థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్నాను. సినిమాను చూసిన ఫ్రెండ్స్, ఇతర హీరోలు, ఓటీటీ సంస్థలు ఇలా అందరూ కూడా థియేటర్లోనే విడుదల చేయండి అని అన్నారు.

చివరి సమయంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశాం. ముందుగా మేలో ఈ సినిమాను విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ ఫిబ్రవరిలో డేట్ దొరికింది. అప్ప‌టికి ఇంకా తెలుగు వర్షన్‌ కంప్లీట్ అవ్వలేదు. సెన్సార్ కాలేదు. దాంతో ఆరేడు రోజులు మా టీం అంతా నిద్రపోకుండా కష్టపడ్డాం.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/kollywood-hero-vishnu-vishal-interview_b_0502220544.jpg Sun 06th Feb 2022 04:14 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/59788/vishnu-vishal.html vishnu vishal,ravi teja,fir movie,vishnu vishal interview 2022-02-05 17:44:40 ర‌వితేజ‌ ష్యూర్ షాట్ హిట్ అన్నారు - విష్ణు విశాల్ ర‌వితేజ‌ ష్యూర్ షాట్ హిట్ అన్నారు - విష్ణు విశాల్ CineJosh.com
59775 ఫ్రెష్ కామెడీ కథ.. డీజే టిల్లు: నేహా శెట్టి Neha Shetty Interview about DJ Tillu

]]>
అన్ని వర్గాల ప్రేక్షకులను డిజె టిల్లు సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన డిజె టిల్లు ఈనెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్ర నిర్మాత.  శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిజె టిల్లు సినిమా విశేషాలను, చిత్రంలో నటించిన తన అనుభవాలను తెలిపింది నేహా శెట్టి. ఆమె మాట్లాడుతూ..

- బాల్యం నుంచే నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. మెహబూబా చిత్రంలో నటించాను. ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు డిజె టిల్లు సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

- సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే ఎలా కాదనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే కారణం కాదు, మంచి స్క్రిప్ట్ ఉంది. సిద్ధూ, విమల్ క్రియేటివ్ గా సినిమాను, ఫన్ గా డిజైన్ చేశారు. మీరు ట్రైలర్ లో డైలాగ్స్ వినే ఉంటారు. ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.

- డిజె టిల్లు ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి.

- డిజె టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్తే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. ఎ‌వరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. రాధిక క్యారెక్టర్ ను నేను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ఆ పాత్రలా మారిపోయాను. తప్పును తప్పులా ఒప్పును ఒప్పుగా చెబుతుంది. నేను రాధిక క్యారెక్టర్ తో చాలా రిలేట్ చేసుకోగలను. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర అది.

- రాధిక పాత్రలో నటించేప్పుడు దర్శకుడు విమల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నానుంచి సహజంగా ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు. కానీ నేను భయపడ్డాను. నేను అనుకున్నట్లు చేస్తే ఎలా వస్తుందో అని. కానీ అందరికీ రాధిక క్యారెక్టర్ లో నేను నటించిన విధానం నచ్చింది. సన్నివేశాలన్నీ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఉంటాయి. రాధిక పాత్ర చేసేందుకు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. సహజంగా నాకు అనిపించినట్లు నటించాను.

- ఈ సినిమా చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నాను. నేను తెలంగాణ వినడం యాస కొత్త. ఈ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ యాసలో ఇంకా సినిమాలు రావాలి. చాలా  ఫ్రెష్ కామెడీ కథలో ఉంటుంది. హీరోను రాధిక కన్ఫ్యూజ్ చేసినట్లు ట్రైలర్ లో చూపించాం. రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. 

- సిద్ధు టాలెంటెట్ యాక్టర్. అతను యాక్ట్ చేస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయాను. అతను రచయిత, గాయకుడు కూడా. సిద్ధు నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను, సిద్దు, విమల్, బ్రహ్మాజీ, ప్రిన్స్ మేమంతా స్నేహితుల్లా సరదాగా ఉండేవాళ్లం. పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యా, బాధపడ్డాం, ఆ ఒత్తిడినంతా డిజె టిల్లు చూస్తే నవ్వుతూ మర్చిపోతారని చెప్పగలను. నేను నటించబోయే కొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖరారు కాగానే చెబుతాను.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/neha-shetty-interview_b_0402220606.jpg Sat 05th Feb 2022 04:36 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/59775/neha-shetty.html neha shetty,neha shetty interview,neha shetty interview about dj tillu 2022-02-04 18:06:58 ఫ్రెష్ కామెడీ కథ.. డీజే టిల్లు: నేహా శెట్టి ఫ్రెష్ కామెడీ కథ.. డీజే టిల్లు: నేహా శెట్టి CineJosh.com
59509 హీరో నట్టి క్రాంతి ఇంటర్వ్యూ Natti Kranthi Interview

]]>
న‌టుడిగా ర‌జ‌నీకాంత్‌ అంటే ఇష్టం. సినిమారంగంలో గురువులుగా డా. దాస‌రి నారాయ‌ణరావు, డా. డి. రామానాయుడు అయితే న‌ట‌న గురువుగా స‌త్యానంద్ గార‌ని - వ‌ర్థ‌మాన క‌థానాయ‌కుడు నట్టిక్రాంతి  తెలియ‌జేశారు. సినిమారంగంలో నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, ఎగ్జిబిట‌ర్‌గా, పంపిణీదారుడిగా విశేష అనుభ‌వం వున్న న‌ట్టికుమార్ త‌న‌యుడే నట్టిక్రాంతి. త‌న తండ్రి నుంచి నేర్చుకున్న మంచిత‌నం, ఎదుటివారిని గౌర‌వించడం, నిర్మాణ విలువ‌ల‌తో న‌టుడిగా నిర్మాత‌గా ఎద‌గాల‌నేది త‌న ఆశ‌య‌మ‌ని నట్టిక్రాంతి.స్ప‌ష్టం చేస్తున్నారు.

నట్టిక్రాంతి.క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా వర్మ వీడు తేడా- అనేది ఉప‌శీర్షిక‌. ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయిక‌లు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన  ఈ చితం జనవరి 21న భారీగా విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా నట్టిక్రాంతి విలేక‌రుల‌తో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

- తొలి సినిమాకే ద‌ర్శ‌కుడు తండ్రి కావ‌డం అదృష్టంగా భావిస్తున్నా. న‌టుడిగా నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మొద‌టి రోజు కొద్దిగా ఇబ్బంది ప‌డినా రెండో రోజునుంచి కెమెరా ముందు ఫీలింగ్ లేకుండా న‌టించేశాను.

- నాకు ద‌ర్శ‌క‌త్వం అంటే ఇష్టం. అందుకే కొన్ని సినిమాల‌కు అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాను. ఆ త‌ర్వాత నిర్మాత‌గా కూడా నిల‌దొక్కుకోవాల‌ని అనుకొన్నాను. దానికి సంబంధించిన శిక్ష‌ణ పొందేందుకు యు.ఎస్‌.లోని న్యూయార్క్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో త‌ర్ఫీదు పొందాను. అక్క‌డ  ఎడిటింగ్ వంటి అంశాలు నేర్చుకున్నాను. అది ఈ సినిమాకు ఉప‌యోగ‌ప‌డ్డాయి.

- ఆ త‌ర్వాత వైజాగ్ స‌త్యానంద్‌గారి వ‌ద్ద న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్నాను. ఆయ‌న నేను చేస్తున్న వ‌ర్మ‌ సినిమా క‌థ తెలుసు. నీ బాడీ లాంగ్వేజ్‌కు స‌రైన క‌థ‌. అంటూ ఆశీర్వ‌దించారు. ఆ త‌ర్వాత ట్రైల‌ర్ చూశాక మంచి భ‌విష్య‌త్ వుంద‌న్నారు.

- వ‌ర్మ‌ టైటిల్ విన‌గానే రామ్ గోపాల్ వ‌ర్మ గురించి అనుకుంటారు. క‌థ‌కూ దానికి సంబంధ‌మే లేదు. కేవ‌లం ప్ర‌మోష‌న్ కోసం చేశాం. ఇదో థ్రిల్ల‌ర్ క‌థ‌. చ‌క్క‌టి ల‌వ్ స్టోరీకూడా వుంది.

- క‌థ ప్ర‌కారం హీరో పేరు వ‌ర్మ‌. త‌ను ఓ సైకో. అలాంటి వ్య‌క్తి ప్రేమ‌లో ప‌డితే ఎలా వుంటుంది?  చివ‌రికి ఏమ‌యింది? అనేది సినిమాలో ఆస‌క్తిక‌రంగా వుంటుంది. చివ‌రి అర‌గంట‌పాటు ప్రేక్ష‌కుడ్ని క‌ట్టిప‌డేస్తుంది. హృద‌యాన్ని క‌దిలించే సినిమా అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను.

- తొలిసినిమానే కొత్త ప్ర‌యోగం చేయాల‌ని చేశాను. ఈరోజుల్లో ఆడియ‌న్స్ చాలా మెచ్చూర్డ్ అయ్యారు. సాధార‌ణ సినిమాలకంటే `వ‌ర్మ‌` వంటి వైవిధ్య‌మైన క‌థ‌ల‌నే చూస్తున్నారు. రేపు సినిమా చూశాక మీరు నిజ‌మ‌ని న‌మ్ముతారు.

- నాన్న‌గారు ద‌ర్శ‌కుడు అయినా నేను నేర్చుకున్న‌విష‌యాలు ఈ సినిమాకు అప్ల‌య్‌చేయ‌లేదు. నాన్న‌గారు ఎంతో అనుభ‌వం వున్న వ్య‌క్తి. ఆయ‌న వ‌ల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. న‌టుడిగా నా పాత్ర నేను పోషించా

- ఇది రెగ్యుల‌ర్ ప్రేమ‌క‌థ‌లా వుండ‌దు. ఇద్ద‌రు హీరోయిన్ల ప‌రిచ‌యం ఆ త‌ర్వాత ఏమ‌యింది అనేది ఆస‌క్తిక‌రంగా వుంటుంది. ఇక ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌రంగా చ‌మ‌క్ చంద్ర‌, శ్రీ‌ధ‌ర్‌తోపాటు నేను కూడా అల‌రిస్తాను. థ్రిల్లింగ్ అంశాలున్నాయి. చూసిన ప్రేక్ష‌కుడు మంచి సినిమా చూశామ‌న్న ఫీలింగ్‌తో బ‌య‌ట‌కు వ‌స్తాడు.

- ఇక యాక్ష‌న్ ప‌రంగా రెండు రోజులు శిక్ష‌ణ తీసుకుని ఆ ఎపిసోడ్ చేశాను.కెమెరాలో చూశాక నేనేలా చేసింది అన్నంత‌లా వుంది. ఇటీవ‌లే ఈ సినిమాను కొంత‌మంది ప్ర‌ముఖులు చూశారు. మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. టెంప‌ర్ సినిమాకు క్ల‌యిమాక్స్‌లో ఎలా క్లాప్స్ ప‌డ్డాయో ఈ సినిమాకూ ప‌డ‌తాయ‌నే న‌మ్మ‌క‌ముంది.

- బ‌య‌ట వారు చూసి చెప్ప‌డం వేరు. అమ్మ‌గాను, నా సోద‌రి చూసి న‌టుడిగా బాగా చేశాని మెచ్చుకోవ‌డం మ‌రింత బ‌లాన్నిచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఆ త‌ర్వాత త‌మిళ ప్రేక్ష‌కులు బాగా న‌చ్చుతుంద‌నే న‌మ్మం కూడా వుంది. త‌మిళంలో ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అవ్వ‌లేదు. ముందు నాలుగు భాష‌ల్లో విడుద‌ల‌చేస్తున్నాం. ఆ త‌ర్వాత త‌మిళంలో విడుద‌ల చేస్తాం.

- న‌టుడిగా హీరోనే కాకుండా క‌థ‌లో ప్రాధాన్య‌త వున్న పాత్ర చేస్తాను. బ‌య‌టి ప్రొడ‌క్ష‌న్‌లో చేయ‌డానికి రెడీ. నాకు టెక్నిక‌ల్‌గా అన్ని విష‌యాలు తెలుసు కాబ‌ట్టి ప్ర‌స్తుతం నిర్మాణ‌ప‌రంగా బాధ్య‌త‌లు చూడాల‌నుకుంటున్నా. ఆ త‌ర్వాత అన్నీ క‌లిసివ‌స్తే ద‌ర్శ‌క‌త్వం చేప‌డ‌తాను.

- క‌శ్మీర్‌లో గ‌డ్డ గ‌ట్టే చ‌లిలో నాలుడురోజుల‌పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించాం. హీట‌ర్‌లు పెట్టుకుని అలా సినిమా చేయ‌డం గొప్ప అనుభూతిగా మిగిలింది.

- ప్ర‌తి న‌టుడికి సంక్రాంతికి సినిమా విడుద‌ల కావాల‌ని వుంటుంది. నాకు చిన్న‌ప్ప‌టినుంచీ క‌ల. అది ఈసారి నెర‌వేరుతుంది. ఈనెల 21న నాలుగు భాష‌ల్లో విడుద‌ల కావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే నెల‌లో జ‌వ‌వ‌రి 28 నేను నిర్మాత‌గా వున్నడి.జె. సినిమా విడుద‌ల‌కావ‌డం నాకు ప్ర‌త్యేకంగా అనిపిస్తుంది.

]]>
http://www.cinejosh.com/telugu/newsimg/hero-natti-kranthi-interview_b_1801220659.jpg Wed 19th Jan 2022 05:29 AM Ganesh http://www.cinejosh.com/news-in-telugu/6/59509/natti-kranthi.html natti kranthi,natti kranthi interview,natti kranthi interview photos 2022-01-18 18:59:00 హీరో నట్టి క్రాంతి ఇంటర్వ్యూ హీరో నట్టి క్రాంతి ఇంటర్వ్యూ CineJosh.com