Advertisementt

PR పంచ్ - జగన్నాటక సూత్రధారి

Sat 14th May 2022 06:12 AM
pr punch special article  PR పంచ్ - జగన్నాటక సూత్రధారి
Curse of CM Jagan crushing Tollywood? PR పంచ్ - జగన్నాటక సూత్రధారి
Advertisement
Ads by CJ

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారంటే.. మహేష్ బాబు సర్కారు వారి పాట కి వచ్చిన టాక్ చూసిన వారంతా అబ్బో ఏపీ వెళ్లారు సీఎం జగన్ ని కలిశారు.. టికెట్ రేట్స్ పెంచమని వేడుకున్నారు, అలా దండాలు పెట్టొచ్చిన వాళ్ళకి ఆడియన్స్ చుక్కలు చూపిస్తున్నారట. జగన్ ని కలిసిన ప్రభాస్ కి రాధే శ్యామ్ డిజాస్టర్  అయ్యింది. అలాగే జగన్ ని కలిసిన మెగాస్టార్  సినిమా ఆచార్య ప్లాప్ అయ్యింది. జగన్ ని కలిసిన మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట దొబ్బింది అంటూ రాధే శ్యామ్ సముద్ర మట్టం, ఆచార్య పాదఘట్టం, సర్కారు వారి పాట నేల మట్టం అంటూ మీమ్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ ని విమర్శించిన వారు, జగన్ మీటింగ్ కి దూరంగా ఉన్నవారు, టికెట్ రేట్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీసు ఫైట్ కి దిగిన వారు బ్లాక్ బస్టర్స్ కొట్టారు.

డిసెంబర్ 3న ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు నడుస్తున్న టైం లో అఖండ సినిమాతో నందమూరి నటసింహం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు, 50 రోజులు థియేటర్స్ లో ఆడించి రికార్డ్ సృష్టించారు. ఇక అదే నెల 17న అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ చేసారు. ఆ సినిమా అప్పుడు కూడా ఏపీలో టికెట్ ధరల ఇష్యు తెగలేదు. అయినా పుష్ప బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం జగన్ ని కలిసి సమస్యని పరిష్కరించామని చెప్పినా, పవన్ కళ్యాణ్ మీద కక్ష కట్టి టికెట్ ధరలు పెంపు జీవో ఇవ్వకుండా తాత్సారం చేసినా.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో అద్భుతమైన హిట్ కొట్టారు. మరి టికెట్ రేట్ల తో సంబంధం లేకుండా బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ ముగ్గురు ముందు.. టికెట్ ధరలు పెంచుకోవడానికి జగన్ కి వంగి వంగి దండాలు పెట్టిన ఈ ముగ్గురుకి భారీ షాక్ తగిలింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్యన, ఆడియన్స్ మధ్యన జరుగుతున్న చర్చ. ఇక నిన్నగాక మొన్న రిలీజ్ అయిన సర్కారు వారి పాట ని సోషల్ మీడియాలో ఓ వర్గం ఫాన్స్ చీల్చి చెండాడుతున్నారు. ఇదంతా జగన్ మాయే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

✍️-పర్వతనేని రాంబాబు.

Curse of CM Jagan crushing Tollywood?:

PR Punch Cinejosh Special Article

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ