Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రణీత(డైనమైట్)

Thu 27th Aug 2015 11:17 AM
dynamite movie,manchu vishnu,praneetha,devakatta  సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రణీత(డైనమైట్)
సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రణీత(డైనమైట్)
Advertisement

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అరియానా, వివియానా సమర్పణలో దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా 'డైన‌మైట్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రణీత తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి..?

సిటీ లో ఉండే మోడరన్ గర్ల్ పాత్రలో కనిపిస్తాను. చాలా ఫార్వార్డ్ గా ఆలోచించే క్యారెక్టర్ తనది. అలాంటి ఓ అమ్మాయికి భయంకరమైన ఇన్సిడెంట్ ఎదురవుతుంది. ఆ పరిస్థితుల నుండి తను బయట పడడానికి హీరో ఎలా హెల్ప్ చేసాడనే అంశాలపై సినిమా నడుస్తుంది.  

యాక్షన్ సీన్స్ లో నటించారు కదా.. రిస్క్ అనిపించలేదా..?

రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్ కి సమస్య వస్తే హీరో కాపాడి తనను సేవ్ చేస్తాడు. కాని ఈ సినిమాలో హీరోయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ లో హీరోతో పాటు ట్రావెల్ అవుతుంటుంది. కొన్ని షాట్స్ నేను చేయలేను అనుకున్నప్పుడు ఫైట్ మాస్టర్ దగ్గరుండి చేయించేవారు. షూటింగ్ టైం లో నా కాళ్ళకు, చేతులకు చాలా గాయాలయ్యాయి.

సోలో హీరోయిన్ గా చాలా గ్యాప్ వచ్చినట్లుంది..?

అత్తారింటికి దారేది చిత్రానికి ముందు సోలో హీరోయిన్ గా చేసాను. మంచి సినిమాల్లో మాత్రమే నటించాలని మెల్లగా మూవీస్ ఓకే చేసుకుంటున్నా. నేను నటించే పాత్రకు ఇంపార్టన్స్ ఉండాలి. 'రాక్షసుడు' సినిమాలో నా స్క్రీన్ ప్లేస్ చాలా తక్కువ సేపు ఉంటుంది. కాని సినిమా చూసిన వారికి మాత్రం నా పాత్ర గుర్తుండిపోతుంది. అలాంటి రోల్స్ లో నటించాలనుంది.

విష్ణుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

వండర్ ఫుల్ యాక్టర్ తను. విష్ణు మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హాలీవుడ్ ఫిల్మ్స్ ఎక్కువగా చూస్తాడు. తన సినిమాలు కూడా అలానే ఉండాలని భావిస్తాడు. 

డైరెక్టర్ గురించి..?

దేవకట్ట గారికి స్క్రిప్ట్ పై చాలా క్లారిటీ ఉంది. ఇది రీమేక్ చిత్రమైనా తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీసారు. తన స్క్రీన్ ప్లే అధ్బుతంగా ఉంటుంది. 

సినిమాలో చాలెంజింగ్ గా తీసుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా..?

ఈ చిత్రంలో బిగ్గెస్ట్ చాలెంజింగ్ అంటే ఫైట్ సీన్సే. బాలీవుడ్ లో వచ్చిన క్వీన్, ఎన్హెచ్ 4, పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న చిత్రాలు. అదే రేంజ్ లో ఈ సినిమా కూడా ఉంటుంది. యాక్షన్ సీన్స్ లో మొదటిసారి నటించాను. అందరికి చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను.

కన్నడలో సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఏమైనా ఉందా..?

ప్రొడ్యూస్ చేయడం, డైరెక్ట్ చేయడం అనేవి చిన్న విషయాలు కావు. ప్రస్తుతం నటిగానే కంటిన్యూ చేస్తాను. ఫ్యూచర్ లో ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement