ఆనంద్ తో ధనుష్ నాల్గవ చిత్రం

ప్రేమకథలకు ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో దిట్టగా పేరున్న బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్- కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈసారి రూట్ మార్చబోతున్నారా? ఇప్పటివరకూ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాల తీరు వేరుగా ఉండేది. కానీ నాల్గవ ప్రాజెక్టు లో రొమాన్స్‌తో పాటు ధీటుగా యాక్షన్ కూడా ఉంటుందన్న వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.`రాంఝనా`,`అత్రంగీ రే`, `తేరే ఇష్క్ మే` వంటి చిత్రాల తర్వాత ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ మరోసారి చేతులు కలపబోతున్నారు.
ఓ రొమాంటిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ స్కేల్‌తో.. విజువల్‌గా ప్రేక్షకులను కట్టిపడేసేలా మలుస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భావోద్వేగాలు.. ప్రేమ చుట్టూ తిరిగేవి. అయితే ఈసారి కథలో రొమాన్స్ ఉన్నా? పెద్ద ఎత్తున ఫైట్లు, హై-స్కేల్ స్టంట్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. గత కాలాన్ని గుర్తుచేసేలా సెట్స్‌ను తీర్చిదిద్ది.. ఆ పీరియాడిక్ నేపథ్యాన్నే సినిమా విజువల్ లాంగ్వేజ్‌కు ప్రధాన బలంగా మలుస్తున్నట్లు తెలుస్తోంది.
ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కి పీరియాడిక్ యాక్షన్ జోనర్ కొత్తదే. గతంలో కలిసి పనిచేసిన సినిమాల కంటే పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ప్రాజెక్టు ఉండటంతో కథను ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా షూటింగ్ 2027 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.















































