వారణాసి వాయిదాకు కారణం అదే!
SS Rajamouli may postpone Varanasi
ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ నటించిన వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల కావడం లేదు.. ఇది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నలుగుతున్న వార్త. ఈ వార్తలపై రాజమౌళి క్లారిటీ ఇవ్వరు, ఆ వార్తలకు చెక్ పెట్టకపోయేసరికి వారణాసి వాయిదా అఫీషియల్ అయ్యి కూర్చుంది.
అయితే వారణాసి చిత్రం ఏప్రిల్ 7 నుంచి షిఫ్ట్ అవుతుంది అనేది తేలిపోయినా.. వాయిదా ఎందుకు అనే విషయంలో మహేష్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ ఉంది. అయితే వారణాసి చిత్రాన్ని ఏప్రిల్ 7నుంచి వాయిదా వెయ్యడానికి ప్రధాన కారణం సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనేది రాజమౌళి అండ్ టీమ్ ఆలోచనట.
షూటింగ్ ముగిసినా వారణాసి బెస్ట్ అవుట్ పుట్ కోసం పోస్ట్ ప్రొడక్షన్, భారీ VFX పనులకు ఎక్కువ సమయం కావాలని చిత్ర బృందం అనుకుంటుందట. షూటింగ్ రీసెంట్ గా పూర్తయినా, ప్రస్తుతం CG వర్క్, రీ-రికార్డింగ్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.. అందుకే సినిమాని వాయిదా వేసి కొత్త డేట్ ని లాక్ చేసి త్వరలో ప్రకటించాలి అని డిసైడ్ అయ్యారట.















































