ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actor sentenced to one year in prison in a POCSO case!

పోక్సో కేసులో నటుడికి ఏడాది జైలు శిక్ష!

Actor sentenced to one year in prison in a POCSO case!Actor sentenced to one year in prison in a POCSO case!

మలయాళ, తమిళ చిత్రాల్లో పలు కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీజిత్ రవికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నాలుగేళ్ల క్రితం మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో  కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన కేరళలోని త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు  50 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి రమ్య మీనన్ స్పష్టం చేశారు.

కేసు వివరాల ప్రకారం 2022 జూలై 4వ తేదీన పాఠశాల నుంచి తమ అపార్ట్‌మెంట్ సముదాయానికి తిరిగి వెళ్తున్న మైనర్ చిన్నారుల ముందు శ్రీజిత్ రవి అసభ్యంగా ప్రవర్తించి వారిని బెదిరించారన్న ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణ అనంతరం ఐపీసీ సెక్షన్ 509.. అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్ 11(i) కింద ఆయనపై నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున మొత్తం 21 మంది సాక్షులు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడం కీలకంగా మారింది. గతంలో ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని కోరుతూ శ్రీజిత్ రవి 2022లో ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురవడంతో విచారణ ప్రక్రియ కొనసాగి తుది తీర్పు వెలువడింది.

అయితే ఈ తీర్పుపై కేరళ హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీజిత్ రవి తరపు న్యాయవాదులు కోరడంతో కోర్టు శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపివేసింది. ఇద్దరు పూచీకత్తుదారులతో  50 వేల బాండ్ సమర్పించడంతో ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ డిసెంబర్ 23న తిరిగి కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

సీనియర్ నటుడు టీజీ రవి కుమారుడైన 50 ఏళ్ల శ్రీజిత్ రవి 2005 నుంచి మలయాళంతో పాటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ అనేక సినిమాల్లో  బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. తాజా తీర్పు మాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Sreejith Ravi has been sentenced to one year
O.M Review
O.M Review
25 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
25 Nov 2026
DNK Review
DNK Review
25 Nov 2026
GOAT Review
GOAT Review
25 Nov 2026
Scene Review
Scene Review
25 Nov 2026
Ramayana Review
Ramayana Review
25 Nov 2026