గోల్డెన్ గ్లోబ్స్ 2027 రేసులో రామాయణం!
Ramayana in the race for the 2027 Golden Globes!నితీష్ తివారీ డైరెక్షన్లో తెరకెక్కిన `రామాయణం` 84వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రేసులో నిలిచింది. రణబీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బెస్ట్ మోషన్ పిక్చర్ - డ్రామాతో పాటు బెస్ట్ మోషన్ పిక్చర్ - నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాల్లో ఎలిజిబిలిటీ జాబితాలో చోటు దక్కించుకుంది. సోనీ పిక్చర్స్ రిలీజింగ్ కింద సబ్మిట్ అయిన సినిమాకు.. డ్రామా విభాగంలో 88 సినిమాల మధ్య నాన్ ఇంగ్లీష్ విభాగంలో 42 సినిమాల మధ్య పోటీ ఉంది. స్క్రీన్ప్లే క్రెడిట్లలో శ్రీధర్ రాఘవన్, నితీష్ తివారీ పేర్లు ఉన్నాయి.
అయితే మ్యూజిక్ విభాగంలో మాత్రం రామాయణం పేరు కనిపించలేదు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ లాంటి దిగ్గజాల కలయికలో వచ్చిన సంగీతం మీద ఇంత చర్చ జరిగినా? బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జాబితాల్లో ఈ సినిమా లేకపోవడం గమనించదగ్గ విషయం.
ఇదే రేసులో డ్యూన్: పార్ట్ త్రీ కూడా డ్రామా కేటగిరీలో ఉండగా.. స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మ్యూజికల్ లేదా కామెడీ విభాగంలో నిలిచింది. అయితే ఇది కేవలం పరిశీలన కోసం సమర్పించిన ఎలిజిబిలిటీ లిస్ట్ మాత్రమేనని, తుది నామినేషన్లు కాదని తెలుస్తోంది.
















































