విశ్వంభర కు అదే బ్యాలెన్స్ !
Vishwambhara release date update
మెగాస్టార్ చిరంజీవి-వశిష్ట కలయికలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరిగిపోతుంది. నిన్నటివరకు సీజీ వర్క్ కోసం డిలే అయితే విశ్వంభర చిత్రం ఇప్పుడు సీజీ వర్క్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసారు. విశ్వంభర లో కీలక పాత్రలో కనిపించబోతున్న షఫీ తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు.
ఆ అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే విశ్వంభర పనులు చకచకా పూర్తవుతున్నా విశ్వంభరకు ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ కనిపిస్తుంది. అదే విడుదల తేదీ అనౌన్సమెంట్. అదే సమస్య విశ్వంభర కు. సంక్రాంతి సంక్రాంతి అంటున్నారు కానీ.. ఆ తేదీపై స్పష్టతనివ్వకుండా ఇంకా ఇంకా నాన్చుతున్నారు.
విశ్వంభర విడుదల ఈ ఏడాది అయితే లేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఉంటుందా, లేదంటే మార్చ్ లేదు సమ్మర్ ఏదో తేల్చేస్తే అందరూ రిలాక్స్ అవుతారు. ముఖ్యంగా కాక మేకర్స్ రిలాక్స్ అవుతారు.
















































