తరుణ్ భాస్కర్ ని అంతగా హర్ట్ చేసింది ఎవరు?
Tharun Bhascker's Change of Heart: Money Matters
సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటె జనాలు వెనక పడతారు, లేదంటే వారిని పట్టించుకోరు. హిట్స్ ఉంటేనే వారికి పేరు ఉంటుంది, ప్లాప్ వస్తే జనాలు మరిచిపోవడం పక్కనపెడితే స్నేహితులు కూడా దగ్గరకి రాని ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది సినిమా ఇండస్ట్రీ నే. అందుకే హిట్ కోసం పరితపిస్తుంటారు, కష్టపడతారు.
సినిమా హిట్ ఉంటేనే దర్శకుడికైనా, లేదంటే హీరోలకైనా క్రేజ్ ఉండేది. అయితే సినిమా రంగం నుంచి వచ్చిన వారసులకు ప్లాప్స్ తో సంబంధం ఉండదు. వారికీ ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. తాజాగా ENE రిపీట్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి.
కొద్దిరోజులుగా సక్సెస్ లేని తరుణ్ భాస్కర్ ENE రిపీట్ తో మళ్ళీ నిరూపించుకున్నారు. గత గురువారం విడుదలైన ENE రిపీట్ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవడమే కాదు అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఈ మూమెంట్ లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ అనేది కూలి పని కాదు. చదువుకుని వచ్చి చేసే పని. వాళ్లకు సరైన గౌరవం ఇచ్చిన మన నిర్మాతలకు థాంక్యూ అంటూ ENE రిపీట్ టీమ్ కి థాంక్స్ చెప్పిన తరుణ్ భాస్కర్..
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లెక్కలు వేసుకుంటారు. కానీ లెక్కలేకుండా ప్రేమించేది ప్రేక్షకులు మాత్రమే అంటూ.. ఇప్పటివరకు నా సినిమాల్లో డబ్బుకు పెద్దగా వాల్యూ లేదని, డబ్బు వెంట పడొద్దని చెప్పేవాడిని. కానీ అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి నేను డబ్బునే ఫాలో అవుతాను. నెక్స్ట్ సినిమా నుంచి ఏ సెంటర్, బీ సెంటర్, సీ సెంటర్.. అన్నింటినీ ఫోకస్ చేసి సినిమాలు చేస్తా..
చాలామంది నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక అథెంటిక్ వాయిస్ ఎంత దూరం వెళ్తుందో చూపిస్తాను. డ్యూటీ ఎక్కుతున్నాను. నేను మోకాళ్ల మీద పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడం అని పిలవను. నాకు ప్రేక్షకులే ముఖ్యం. నేను డైరెక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా శ్రద్ధ పెట్టి చేస్తాను. నా వాయిస్ ఏంటనేది చూపిస్తాను. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా సినిమా ద్వారా దాన్ని కరెక్ట్ చేస్తాను. ఇది రాసి పెట్టుకోండి అంటూ తరుణ్ భాస్కర్ మాట్లాడారు.
మరి తరుణ్ భాస్కర్ ని ఎవరు అంతగా హర్ట్ చేసారో, కథ విని రిజెక్ట్ చేసారో తెలియదు కానీ.. తరుణ్ భాస్కర్ మాత్రం బాగా డీప్ గా హర్ట్ అయ్యారు అనేది మాత్రం వాస్తవం.
















































