పైరసీ ముఠా గుట్టురట్టు
Piracy gang exposed
సినిమాలు విడుదలైన రోజే పైరసీ చేసి ఆన్ లైన్ లో విడుదల చేసే బ్యాచ్ చాలామంది ఉంది ఎన్నిసార్లు సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నా ఆ పైరసీ ని అడ్డుకోలేకపోయారు. తాజాగా నిన్న శుక్రవారం ఆకాశంలో ఒక తార సినిమా విడుదల కాగా.. ఈ సినిమాని పైరసీ చేసి ఆన్ లైన్ లో పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
అంతేకాదు రణబాలి, ఆదర్శ కుటుంబం, కల్ట్ సినిమాలను కూడా కర్నూలు సిటీ స్క్వేర్ మాల్ థియే అప్ లోడ్ చేసారు, ఆ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దానితో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ బ్యూరో.. కర్నూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసింది.
నిందితులు షేక్ రిజ్వాన్ (19), రాంపోగు అజయ్ (19)గా గుర్తింపు. ఒక్కో సినిమా రికార్డింగ్కు క్రిప్టో కరెన్సీ రూపంలో రూ.20 వేల కమీషన్ తీసుకుని.. టెలిగ్రామ్ ఛానళ్లు, పైరసీ వెబ్సైట్ల ద్వారా సినిమాల అక్రమ పంపిణీ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. నిందితుల నుంచి 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసికున్నట్లుగా సమాచారం.
















































