ధనుష్ ఓం సోషల్ మీడియా టాక్
O.M Public Talk
కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో కోలీవుడ్ లో తెరకెక్కిన ఓమ్ చిత్రం మంచి అంచనాలతో నేడు నవంబర్ 20 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఓమ్ పబ్లిక్ టాక్ లోకి వెళితే..
ఓమ్ చిత్రానికి తమిళ్ నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే తెలుగు నుంచి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ధనుష్ లుక్స్, ధనుష్ ఎంట్రీ, మమ్ముట్టి పవర్ ఫుల్ లుక్, సాయి పల్లవి పెరఫార్మెన్సు బావున్నాయి. సాయి అబ్యాంకర్ మ్యూజిక్, BGM నెక్స్ట్ లెవల్.. అంటూ కొంతమంది అంటే.. ఓమ్ చిత్రం ఫస్టాఫ్ వేరీ స్లోగా, వరస్ట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే బాగాలేదు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కొద్దిగా బెటర్‌గా ఉంది. యావరేజ్ మూవీగా అనిపించింది.. అంటూ కొంతమంది ఆడియన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
ఓమ్ సినిమా రెగ్యులర్ యాక్షన్ సినిమా కాదు. స్మగ్లింగ్ నేపథ్యంగా సాగే సినిమా ఓమ్. ఈ చిత్రం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినా.. కథలో భాగమైతే మంచి ఫీల్ వస్తుంది, ధనుష్ నేచురల్ పెరఫార్మెన్స్ రో యాక్టుట్టుకుంటే.. మమ్ముట్టి పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు.
శ్రీలీల కూడా బాగా చేసింది, ధనుష్, సాయి పల్లవి, మమ్ముట్టి మధ్యలో జరిగే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ అంటూ మరికొందరు ఆడియన్స్ ఓమ్ చిత్రం పై స్పందిస్తున్నారు. మరి ఓమ్ చిత్రం ఎలా ఉందొ అనేది పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..
















































