ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Fan suicide attempt outside Pawan Kalyan residence

చేతులు కోసుకున్న పవన్ అభిమాని

 Fan suicide attempt outside Pawan Kalyan residenceFan suicide attempt outside Pawan Kalyan residence

 

జూబ్లీహిల్స్ లోని పవన్ ఇంటి ముందు ఆయన ఆభిమాని, ఆయన్ను కలవనివ్వమని హల్ చల్ చేస్తూ చేతులు, ఛాతిపై కోసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ ఖమ్మంకి చెందిన సుచిత్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ లోని పవన్ ఇంటికి వచ్చాడు.

అక్కడ పవన్ కళ్యాణ్ ను కలవాలని హడావిడి చెయ్యగా.. పవన్ బాడీగార్డ్ అడ్డుకోగా.. బాడీగార్డ్ పై దాడి చేసి చేతులు, ఛాతిపై కోసుకున్న సుచిత్ ని అక్కడే ఉన్న స్థానికులు ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అభిమానం ఉండొచ్చు కానీ.. ఇలా తమను తాము గాయపరుచుకుని ఇంట్లో వాళ్ళను బాధపెట్టేంత అభిమానం ఉండకూడదు, స్టార్స్ ఎన్నిసార్లు అభిమానులను వారిస్తున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. ఇప్పుడు పవన్ ని కలిసేందుకు వచ్చి సుచిత్ ఇలా చేసుకోవడం నిజంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. 

Pawan Kalyan