ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rukmini Vasanth's stunning style statement

స్టైలిష్ గా రుక్మిణి వసంత్

Rukmini Vasanth's stunning style statementRukmini Vasanth's stunning style statement


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో నటిస్తూ టాలీవుడ్ లో క్రేజీగా మారిన కన్నడ భామ రుక్మిణి వసంత్ సోషల్ మీడియా లుక్స్ చాల డిఫ్రెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తాయి. ఆమె గ్లామర్ షో చేసినా ఎబ్బెట్టుగా అనిపించదు. మంచి హైట్ ఆమె సొంతం. అందుకే ఆమె గ్లామర్ షో చేసినా, అందాలు చూపించినా యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

తాజాగా హోటల్ కారిడార్ లో రుక్మిణి వసంత్ బ్లాక్ మోడ్రెన్ కాస్ట్యూమ్ లో చాలా స్టైలిష్ గా గ్లామర్ గా కనిపించి షాకిచ్చింది. రుక్మిణి వసంత్ లోని ఈ యాంగిల్ అభిమానులకే కొత్తగా కనిపించింది. దానితో ఆమె ఫ్యాన్స్ స్టైలిష్ రుక్మిణి అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఎన్టీఆర్ డ్రాగన్ కన్నా ముందే రుక్మిణి వసంత్ కాంతార 2తో పాన్ ఇండియా మర్కెట్ లోకి అడుగుపెట్టింది. తర్వాత అమ్మడు కి ఈ ఏడాది యష్ టాక్సిక్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని ఎన్టీఆర్ డ్రాగన్ పైనే. అంతేకాదు రుక్మిణి వసంత్ పేరు టాలీవుడ్ యంగ్ హీరోల పక్కన గట్టిగానే వినిపిస్తుంది. 

Rukmini Vasanth latest look goes viral