అభిమానులకు ధనుష్ స్పెషల్ అప్పీల్!

Dhanush's special appeal to fans!Dhanush's special appeal to fans!

కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ `ఓం: ఆపరేషన్ మోల్`  విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 20న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో తొలి రోజు ఉదయం 6 గంటల షోలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ధనుష్ స్పందించారు. ముఖ్యమంత్రి విజయ్‌కు.. ప్రభుత్వానికి  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా తెల్లవారుజాము షోలకు వెళ్లే అభిమా నులకు కొన్ని ముఖ్యమైన విజ్ఞప్తులు చేశారు.  అభిమానులు బాధ్యతాయుతంగా ఉండాలని, తెల్లవారుజాము షోల వద్ద ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. సినిమా ప్రశాంతంగా, ఆనందంగా చూడటమే అసలైన సంబరమని థియేటర్లకు వచ్చి సినిమా చూడటం ద్వారా సినీ కార్మికులకు, పరిశ్రమ ఎదుగుదలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

`ఓం` చిత్రం సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. గతంలో వేరే టైటిల్‌తో ప్రచారం జరిగినా? ఇప్పుడు `ఓం: ఆపరేషన్ మోల్` పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూడు గంటల నిడివితో రూపొందిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులోని శేషాచలం అడవుల్లో జరిగే అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుండటం విశేషం.
 

Dhanush makes special request to fans