ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ranveer Singh and Aditya Dhar Reportedly Plan New Film

బాక్సాఫీస్ షేక్ చేసిన పవర్‌ఫుల్ కాంబో రిపీట్

Ranveer Singh and Aditya Dhar Reportedly Plan New FilmRanveer Singh and Aditya Dhar Reportedly Plan New Film

బాలీవుడ్‌లో `ధురంధర్` తో  ట్రెండ్ సెట్ చేసిన రణ్ వీర్ సింగ్ -టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ మరోసారి జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. `ధురంధర్` సాధించిన చారిత్రాత్మక విజయంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో ఆదిత్య ధర్  తదుపరి సినిమాలకు రణ్ వీర్ సింగ్‌ను మొదటి ప్రాధాన్యతగా మలుచుకుంటున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమా 2027లో సెట్స్ పైకి వెళ్లనుందిట‌. ఆ సినిమా  2028 ప్రథమార్థంలో లేదా ఆ ఏడాది చివరి నాటికి  చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథాంశం విషయానికి వస్తే?  ప్రసిద్ధ చక్రవర్తి చంద్రగుప్త మౌర్య జీవిత చరిత్ర ఆధారంగా చారిత్రాత్మక ఎపిక్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు స‌మాచారం.

దీనికి సంబంధించి ఆదిత్య రైటింగ్ టీమ్ ఆ ప‌నుల్లో ప‌డిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల నుంచి తెలిసింది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. -ఇంత వ‌ర‌కూ ఆదిత్య చ‌రిత్ర‌ను ట‌చ్ చేయ‌లేదు. కేవ‌లం స్పై సినిమాలే చేసారు. ఈ నేప‌థ్యంలో కొత్త పాయింట్ తో ముందుకు రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా ప్ర‌ళ‌య్ సినిమా తెర‌క్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అనంత‌రం ర‌ణ‌వీర్ కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు

Are Dhurandhars Ranveer Singh And Aditya Dhar Planning A Reunion?