ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha celebrated an intimate traditional baby shower

అత్తారింట్లో సమంత సీమంతం

Samantha celebrated an intimate traditional baby shower Samantha celebrated an intimate traditional baby shower

 

హీరోయిన్ సమంత ఈ నెల లోనే డెలివరీ కాబోతుంది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిదో నెల నడుస్తుంది. ఈ ఏడాది సమంత ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత నటనకు బ్రేకిచ్చి భర్త రాజ్ తో కలిసి సంతోషంగా గడుపుతూ మధ్య మధ్యలో సరదాగా ఫోటో షూట్స్ అలాగే బేబీ బంప్ షూట్స్ అంటూ హల్ చల్ చేస్తుంది.

అయితే ఏడో నెలలోనే సమంత కొన్ని సాంప్రదాయాల ప్రకారం శిల్ప రెడ్డి, నీరజ కోన వంటి స్నేహతుల నడుమ సీమంతం వేడుకలు జరుపుకోగా.. తాజాగా ఆమె అత్తారింట్లో సీమంతం వేడుకలు జరుపుకుంది. భర్త రాజ్ నిడిమోరు తో కలిసి పూజలో కూర్చున్న సమంత ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అంతేకాదు అత్తింటి ఫ్యామిలీతో కలిసి పూజలు నిర్వహించి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోస్ తో పాటుగా మేము అంటూ చిన్న క్యాప్షన్ పెట్టింది సమంత. ఇక సమంత-రాజ్ నిడిమోరు తమ బిడ్డకు స్వాగతం పలికేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.

Samantha Ruth Prabhu celebrated an intimate traditional baby shower