ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiru Leaks: Anaswara Rajan's Character Revealed in KAAKA?

చిరు లీక్స్: కాక లో అనశ్వర పాత్రపై లీక్స్

Chiru Leaks: Anaswara Rajan's Character Revealed in KAAKA?Chiru Leaks: Anaswara Rajan's Character Revealed in KAAKA?

 

మెగాస్టార్ చిరంజీవి అతిధిగా ఏ హీరో సినిమా ఈవెంట్ కి వెళ్లినా ఆయన తను నటిస్తున్న సినిమాల విషయాలను లీక్ చేస్తూ దర్శకుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ కాక సినిమా విషయాలను ఇట్లు అర్జున ఈవెంట్ లో లీక్ చేసారు. ఇట్లు అర్జున చిత్రంలో కాక కేక పెట్టిస్తుంది అంటూనే.. కీ రోల్ చేస్తున్న అనశ్వర రాజన్ గురించి మాట్లాడుతూ..

అనశ్వర కాక లో మంచి రోల్ చేసింది. చాలా రోజులుగా ఆ అమ్మాయితో ట్రావెల్ చేస్తున్న.. కాక గురించి ఏమైనా మాట్లాడతావా.. ఓ నువ్వు మాట్లాడలేవు కాదా అంటూ చిరు అనశ్వర రాజన్ కాక లో మూగ అమ్మాయిగా కనిపించబోతుంది అని ఇండైరెక్ట్ గా లీక్ చేసేసారు. దానితో సోషల్ మీడియా మొత్తం చిరు లీక్స్, కాక లో అనశ్వర మూగ అమ్మాయి కేరెక్టర్ చేస్తుంది అని ఫిక్స్ అవుతున్నారు.

ఇక చిరు-బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాక చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకాబోతుంది. అందుకు అనుగుణంగా షూటింగ్ కూడా చాలా స్పీడుగా జరుగుతుంది. ఇక ఈ చిత్ర అప్ డేట్స్ అఫీషియల్ కన్నా చిరు లీక్స్ మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నా

Chiru Leaks: Major Hint About Anaswara Rajan Mute Role In Kaaka