ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sai Pallavi And Sreeleela Dance To Alaakaa Loova From Om

స్టేజ్ పై డాన్స్ తో దుమ్మురేపిన హీరోయిన్స్

Sai Pallavi And Sreeleela Dance To Alaakaa Loova From OmSai Pallavi And Sreeleela Dance To Alaakaa Loova From Om


ఓ సినిమా ఈవెంట్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పోటా పోటీగా డాన్స్ స్టెప్స్ వెయ్యడం వాళ్ళ వాళ్ళ అభిమానులకే కాదు సాధారణ మూవీ లవర్స్ కూడా చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నిన్న సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్యూటిఫుల్ హీరోయిన్స్ సాయి పల్లవి, శ్రీలీల డాన్స్ కుమ్మేసారు.

ధనుష్ హీరోగా మమ్ముట్టి విలన్ గా తెరకెక్కిన ఓం చిత్రం ఈ నెల 29 శుక్రవారం విడుదలకాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ నిన్న హైదరాబాద్ వచ్చింది. రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్ కి సాయి పల్లవి శారీ లో క్యూట్ గా హాజరవ్వగా, శ్రీలీల మోడ్రెన్ కాస్ట్యూమ్స్ లో గ్లామర్ గా వచ్చింది.

స్టేజ్ పై వీరిద్దరూ ఓం చిత్రంలోని ఓ సాంగ్ కి కాలు కాదు మంచి స్టెప్స్ వేస్తూ అదరగొట్టేసాడు. ఆ ఈవెంట్ కి హాజరైన వారంతా శ్రీలీల, సాయి పల్లవి చేసిన డాన్స్ ని బాగా ఎంజాయ్ చేసారు. ఈ చిత్రంలో శ్రీలీల ధనుష్ వైఫ్ పాత్రలో కనిపిస్తుండగా.. సాయి పల్లవి పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతుంది. 

Sai Pallavi, Sreeleela turn Dhanush's OM event into a dance party