ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sudigali Sudheer GOAT Social Media Talk

సుడిగాలి సుధీర్ కి ఇది అవమానమే!

Sudigali Sudheer GOAT Social Media TalkSudigali Sudheer GOAT Social Media Talk

 


సుడిగాలి సుధీర్ కి సినిమాలు అవసరమా.. ఇది మేమంటున్న మాట కాదు.. GOAT సినిమా చూసిన ఆడియన్స్ అంటున్న మాట. మంచిగా బుల్లితెర షోస్ చేసుకోక.. ఎవడో చెప్పాడని హీరోగా లక్కు పరీక్షించుకున్నావ్. పెద్దగా వర్కౌట్ అవ్వనప్పుడు సైలెంట్ గా ఉండాలి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. వేదవ్యాస్ దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన GOAT గత  గురువారం విడుదలైంది.

GOAT సెట్ లో గొడవలు, ఏవేవో కారణాలతో మూడేళ్లకు సినిమా విడుదలయ్యింది. విడుదలయ్యాక ఈ చిత్రానికి పూర్ రివ్యూస్, పూర్ రేటింగ్స్ వచ్చాయి. సుధీర్ కామెడీ టైమింగ్, అక్కడక్కడా నవ్వించే సన్నివేశాలు సినిమాలో చెప్పుకోవడానికి మరేమి లేవు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా డిజప్పాయింట్ చేసింది. సుధీర్ కి ఈ ఫీడ్ బ్యాక్ అవమానమే.

సుడిగాలి సుధీర్ కి బుల్లితెర పై ఉన్న క్రేజ్ ఇలాంటి సినిమాలు చేసి పోగొట్టుకోవడం ఆయన అభిమానులకే రుచించడం లేదు. సుధీర్ చాలా గ్యాప్ తో సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో రెండుమూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటితో హిట్ కొట్టి తనని విమర్శించే వాళ్ళ నోళ్లు మూయించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Sudigali Sudheer GOAT Public Talk