ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Teja Sajja's Engagement Photos Revealed

గ్రాండ్ గా యంగ్ హీరో ఎంగేజ్మెంట్

Teja Sajja's Engagement Photos RevealedTeja Sajja's Engagement Photos Revealed

 

హనుమాన్, మిరాయ్ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారిన కుర్ర హీరో తేజ సజ్జా  పెళ్లి పీటలెక్కుతున్నాడు. ఈరోజు సోమవారం హైదరాబాద్ లో తేజ సజ్జా ఎంగేజ్మెంట్ అతిరథమహారధుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో తేజ సజ్జా నిశ్చితార్ధం చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

తేజ సజ్జా కు కాబోయే భార్య చాలా అందంగా కనిపించగా.. అమ్మాయి వివరాలు మాత్రం తేజా బయటపెట్టలేదు. అయితే తేజ సజ్జా కు కాబోయే భార్య అమెరిలోనే పెరిగింది అని, ఆమె కుటుంబానికి ఇండియాలోనూ పలు బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక తేజ సజ్జా నిశ్చితార్ధానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

మెగాస్టార్ చిరు దగ్గర నుంచి రవితేజ వరకు, నాని దగ్గర నుంచి రానా వరకు తేజ సజ్జా నిశ్చితార్థంలో మెరిశారు. ఇక వచ్చే నెలలో తేజ సజ్జా వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుంది. ఈ వేడుకలో కేవలం ఇరు కుటుంబాల వారు, కొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొంటారని తెలుస్తుంది.

Teja Sajja gets engaged