ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun is said to be receiving Rs. 175 cr for AA23

ఊహకందని రీతిలో AA 23

Allu Arjun is said to be receiving Rs. 175 cr for AA23Allu Arjun is said to be receiving Rs. 175 cr for AA23


అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో రాకా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ కోలీవుడ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్నారు, అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్ తో AA 23 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. రీసెంట్ గానే అల్లు అర్జున్-లోకేష్ కానగరాజ్ లు మూవీ స్క్రిప్ట్ పై చర్చించారు.

అయితే AA 23 ఊహకందని రీతిలో తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది. AA23 లెక్కలు కూడా మామూలుగా లేవు అనే చర్చ టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా లాక్ అయ్యాకే సెట్స్‌పైకి వెళ్లాలని అల్లు అర్జున్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రానికి గాను రెమ్యునరేషన్ గా అల్లు అర్జున్ రూ.175 కోట్లు + 33% లాభాల్లో వాటా ఉంటుంది అని..

దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు పారితోషికంగా రూ.70 కోట్లు + 33% లాభాల్లో వాటా అని తెలుస్తుంది. మరో 33% వాటా మైత్రీ మూవీ మేకర్స్‌కు ఉంటుందట. సినిమా బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యాక వచ్చే నికర లాభాలను అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, మైత్రి వారు ముగ్గురూ పంచుకోనున్నారని టాక్. 
 

Allu Arjun AA23 movie latest update