ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Who is danger zone this week..!

BB10: ఈ వారం డేంజర్ జోన్ ఎవరంటే..!

Bigg Boss 10: Who is danger zone this week..!Bigg Boss 10: Who is danger zone this week..!

 

బిగ్ బాస్ సీజన్ 10 లో గత వారం దీపావళి సందర్భంగా కంటెస్టెంట్స్ ని ఏడిపించి ఇంటికి పంపించడం ఇష్టం లేక.. ఎలిమినేషన్ ని ఎత్తేసేసాడు బిగ్ బాస్. సుధీర్, నీతూ బోటం లైన్ లో ఉన్నారు. ఎలిమినేషన్ తీసెయ్యడంతో వారు సేవ్ అయ్యారు. కానీ ఈ వారం హౌస్ మొత్తం నామినేషన్ లో ఉంది.

కెప్టెన్ వంశి తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఓటింగ్ లో త్రిగుణ vs ముఖేష్ అన్న రీతిలో ఈ వారం ఓటింగ్ కనిపించింది. రోహిత్ ఫ్యాన్స్ త్రిగుణ మీద కోపంతో ముఖేష్ కి ఓట్లు గుద్దుతున్నారు. ఆ తర్వాత అమన్, నరేష్, రాంప్రసాద్, శ్వేతా తదుపరి స్థానాల్లో ఉండగా.. ఈ వారం డేంజర్ జోన్ లో దేబ్జానీ, నీతూ మాస్టర్ వర్షిణి ఉన్నారు.

గత కొన్ని వారాలుగా వర్షిణి ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అవుతూ వచ్చింది. కానీ ఈవారం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మరోపక్క నీతూ మాస్టర్ గేమ్ బాగా ఆడినా ఆమె కావాలనే త్రిగుణ, వంశి లతో గొడవలు పడడమే కాదు, ఆమెకు ఓటింగ్ శాతం తక్కువ ఉంది. ఇక దేబ్జానీ అప్పుడే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.

సో ఈ వారం నీతూ లేదంటే వర్షిణి ఇంటికెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది.

Bigg Boss 10