రామాయణ 2 డేట్ కి వారణాసి?

 Is Varanasi Movie Release PostponedIs Varanasi Movie Release Postponed


కొద్దిరోజులుగా రాజమౌళి వారణాసి చిత్రం రిలీజ్ డేట్ మారబోతుంది అంటూ సోషల్ మీడియా లో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. వారణాసి విడుదల తేదీ ఏప్రిల్ 7, 2027 నుంచి మారుతుంది అనే ప్రచారానికి టీమ్ అడ్డుకట్ట వెయ్యడం లేదు. మరోపక్క షూటింగ్ ఫినిష్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయ్యింది చిత్ర బృందం.

మరి వారణాసి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్ వర్క్ అన్ని సజావుగా సాగుతుంటే వారణాసి పోస్ట్ పోన్ ఎందుకు అవుతుంది అనేవాళ్ళు లేకపోలేదు. తాజాగా వారణాసి చిత్రాన్ని ఏప్రిల్ 7 నుంచి వాయిదా వేసి 2027 ఆగష్టు నెలపై కన్నేశారు అని ఒకరు, కాదు కాదు 2027 దివాళి కి రామాయణ పార్ట్ 2 తప్పుకుంది.

ఆ డేట్ కి వారణాసి విడుదల ఉంటుంది అని కొందరు మాట్లాడుతున్నారు. రామాయణ 2 తప్పుకోవడంతో ఆ డేట్ పై ప్రభాస్ స్పిరిట్ కన్ను పడింది, చాలా స్పీడుగా స్పిరిట్ డేట్ లాక్ చేసి ప్రకటించేసారు. ఇప్పుడు వారణాసి కూడా అదే డేట్ పై అంటే నమ్మలా అనేది మరికొంతమంది మాట్లాడుతున్న మాట. మరి ఈ ఊహాగానాలపై రాజమౌళి క్లారిటీ ఇస్తే బావుంటుంది. 

Buzz About Varanasi New Release Date