ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Nagarjuna Fires Back At Rohit

BB10: రోహిత్ ని రోస్ట్ చేసిన నాగార్జున

Bigg Boss 10: Nagarjuna Fires Back At Rohit Bigg Boss 10: Nagarjuna Fires Back At Rohit

 

బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్నిపరీక్ష ద్వారా ఎంటర్ అయిన రోహిత్ హౌస్ లో ముందు నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించాడు. మొదటి రెండు వారాల్లో రోహిత్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనే అనుకున్నారు. కానీ నాలుగో వారంలో రోహిత్.. షాలిని చుట్టూ తిరగడం, పని మానేసి సోది చెప్పడం అన్ని అతనికి మైనస్ లుగా మారాయి.

గత వారం బిగ్ బాస్ ని కామెంట్స్ చేసిన రోహిత్ ని హౌస్ నుంచి వెళ్లిపొమ్మన్న హోస్ట్ నాగార్జున ఈవారం కూడా రోస్ట్ చేసి వదిలిపెట్టారు. రోహిత్ మొహం పై చాలామంది హౌస్ మేట్స్ స్టాంప్ వేశారు. అతను ఆట మానేసాడు, ఇంటి పనులు ఇచ్చినా పనులు సరిగ్గా చెయ్యడం లేదు అన్నారు. వంశి, వర్షిణి, దేబ్జానీ ఇలా చాలామంది రోహిత్ ని టార్గెట్ చేసారు.

నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు. కానీ నేను బాగా ఆడుతున్నాను, నా ఆటకు 10 అవుట్ ఆఫ్ 9, పనులకు 10 అవుట్ ఆఫ్ 7 అంటూ ఏదో చెప్పబోయాడు. దానికి నాగ్ నువ్వు ఆడితే గెలవాలి కదా అన్నారు. మేము ఏ గేమ్ లో ఫస్ట్ రాలేదు అన్నాడు రోహిత్, అదే కదా నువ్వు వేరే వాళ్లతో మిడ్ నైట్ వరకు ముచ్చట్లు పెడితే ఎలా గెలుస్తావ్, సుధీర్ అన్నట్టుగా మేలుకో రాజా మేలుకో అంటూ నాగార్జున రోహిత్ ని ఏసుకున్న ప్రోమో వైరల్ అవుతుంది. 

Nagarjuna Fires Back At Rohit At Bigg Boss 10 Telugu