ఫౌజీ షూటింగ్ అంత బ్యాలెన్స్ ఉందా?

Fauzi shooting updateFauzi shooting update


అసలు ఫౌజీ షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది, డిసెంబర్ 3 న విడుదల కావాల్సిన ఫౌజీ ని వాయిదా వేశారు. ప్రొడ్యూసర్ కాస్త వెనక్కివెళుతుంది అంటే.. అది ఎంత అనేది క్లారిటీ లేదు. ప్రభాస్ ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారా, ఫౌజీ షూటింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, అసలు ఫౌజీ రిలీజ్ డేట్ ఎపుడు అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నలిగిపోతున్నారు.

అయితే తాజాగా ఫౌజీ షూటింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే.. ఓ రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయట, ఫౌజీ కి సంబందించిన ఒక యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ లో నిమగ్నమై ఉందని, ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే సినిమాకే కీలకంగా నిలవనున్న క్లైమాక్స్ ఎపిసోడ్ ని మొదలుపెట్టనున్నారని సమాచారం.

ఈ క్లైమాక్స్ షూట్ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు.. అంటే నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా తెరకెక్కించనున్నారని సమాచారం. మరి డిసెంబర్ మిడిల్ కి షూటింగ్ అవుతుంటే.. ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ పూర్తయ్యి ఫౌజీ విడుదల కావాలంటే వచ్చే ఏడాది సమ్మర్ అవుతుందేమో అనే అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. 
 

Fauzi