ప్రధాని 25 ఏళ్ల ప్రస్థానంపై స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్!
Shriya Saran says, Meri poori family Modiji ki bhakt haiప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ నటి శ్రియా శరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ `మా కుటుంబం మొత్తం మోదీజీకి గొప్ప అభిమానులం. ఆయన అంటే మాకు ఎంతో ప్రేమ` అని తెలిపారు. ప్రధానిగా దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి పట్ల తమ కుటుంబం ఎంతో గర్విస్తోందని పేర్కొన్నారు.
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ, ఆ తర్వాత 2014 నుండి భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిరంతరాయంగా 25 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రియా శరణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు `ఆయన మన దేశం కోసం చేసిన సేవలు ఎంతో గొప్పవి. రాబోయే రోజుల్లో కూడా దేశానికి ఇలాగే మరిన్ని సంవత్సరాల పాటు సేవలు అందించాలని కోరుకుంటున్నాను` అని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శ్రియా శరణ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ప్రధాని మోదీ సేవా ప్రస్థానాన్ని కొనియాడారు. సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా (శక్తిమాన్ ఫేమ్) ప్రధాని నాయకత్వ పటిమను ప్రశంసించగా, గేయ రచయిత మనోజ్ ముంతాషిర్ దేశంలో జరిగిన కీలక మార్పులను ప్రస్తావించారు.
















































