ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10 : Apoorva vs Housemates

బిగ్ బాస్ 10 : హౌస్ లో ఒంటరిగా అపూర్వ

Bigg Boss Telugu 10 : Apoorva vs HousematesBigg Boss Telugu 10 : Apoorva vs Housemates


బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్నిపరీక్ష 2 నుంచి వైల్డ్ కార్డు ద్వారా మూడో వారంలో హౌస్ లోకి ఎంటర్ అయిన అపూర్వ రావడం రావడమే గొడవతో దిగింది. ముఖేష్ తో కలిసి కెప్టెన్సీ టాస్క్ చివరి రౌండ్ ఆడి గెలిచిన అపూర్వకి ముఖేష్ కెప్టెన్సీ త్యాగం కలిసొచ్చి కెప్టెన్ అయ్యింది. ఆతర్వాత హౌస్ లో పవర్ చూపిస్తూ ముఖేష్ ఇంకా త్రిగున్ లను టార్గెట్ చేసింది.

ఆ వారాంతం హోస్ట్ నాగ్ తో డిజాస్టర్ కెప్టెన్ అనిపించుకుంది. ఇక ప్రతి ఒక్కరితో గొడవపడుతుంది. త్రిగున్ ఆమెను ఇరిటేట్ చేస్తూ ఏడిపించడం, రోహిత్ విషయంలో షాలిని తో గొడవపడుతుంది. ముఖేష్ తో, రామ్ ప్రసాద్ ఇలా ప్రతి ఒక్కరితో అపూర్వ హౌస్ లో గొడవపెడుతుంది. రోహిత్ కూడా అగ్నిపరీక్ష టీమ్ నుంచి వచ్చింది అని సపోర్ట్ చేస్తున్నా అంటాడు కానీ.. షాలిని వదిలి వెళ్ళడు.

చరణ్ తో కలిసి కనిపించినా హౌస్ లో మాత్రం అపూర్వ ఒంటరి అయ్యింది. ఎవరితో మట్లాడినా గొడవే, స్క్రీన్ స్పేస్ కోసం గొడవలు పడుతూ మిగతా వారితో దూరంగా ఉంటూ హౌస్ లో అపూర్వ ఏకాకిగా మారింది. హౌస్ మేట్స్ మొత్తం ఒకవైపు, అపూర్వ ఒకవైపు అనేలా గత రాత్రి ఎపిసోడ్ లో కనిపించింది. 

Bigg Boss Telugu 10