స్పిరిట్ - ఫ్యాన్స్ కి అదే ఆశాకిరణం
Spirit Shooting Update
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే పాన్ ఇండియా చిత్రాలు ఎప్పుడు అనుకున్న తేదికి రావు. బాహుబలి తర్వాత నుంచి ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా అనుకున్న సమయానికి రాలేక పదే పదే వాయిదాలు వేసుకున్నవే, ఈ ఏడాది వచ్చిన రాజా సాబ్ అంతే. ఇక ఫౌజీ గురించి చెప్పక్కర్లేదు.
డిసెంబర్ ఆగష్టు, దసరా, డిసెంబర్ ఇలా తేదీలు మార్చుకుంటూ పోతుంది. దానితో స్పిరిట్ రిలీజ్ తేదీ కూడా డిస్టర్బ్ అవుతుంది అనుకున్నారు. కానీ స్పిరిట్ షూటింగ్ అనుకున్న షెడ్యూల్స్ అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయట, ప్రభాస్ డేట్స్ విషయంలో ఫౌజీ, స్పిరిట్, కల్కి2 మేకర్స్ పంచుకోవాల్సి వస్తున్నా స్పిరిట్ కి మాత్రం ప్రభాస్ డేట్స్ ఏవి వేస్ట్ కావడం లేదట.
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో టీమ్ క్రమశిక్షణ పాటిస్తోందని, అంతేకాకుండా కీలక సన్నివేశాల్లో ప్రభాస్ స్వయంగా పాల్గొంటున్నారని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రానికి సంబందించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం, టైమ్‌లైన్‌పై స్పష్టత వలన షూటింగ్ సజావుగా సాగుతుంది అని తెలుస్తుంది.
మరి ఫౌజీ పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ లు అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. కానీ స్పిరిట్ షూటింగ్ విషయాలు తెలిసి ఫ్యాన్స్ మాత్రం చాలా రిలాక్స్ అవుతున్నారు.
















































