చిరు-ఓదెల కాంబో అటకెక్కినట్లే
Chiru and Odela Film Shelved: Nani's Response
నాని తో ప్యారడైజ్ మూవీ షూటింగ్ సమయంలోనే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి తో మూవీ అనౌన్స్ చేసారు. దసరా, ప్యారడైజ్ చిత్రాలతో మాస్ డైరెక్టర్ గా ప్రొజెక్ట్ అయిన శ్రీకాంత్ ఓదెలా ప్యారడైజ్ చిత్రంతో డిజప్పాయింట్ చేసాడు. చిరు తో చేసే సినిమాని కూడా మాస్ గా రక్తపాతంతోనే చెయ్యాలనుకున్నాడు. ప్రీ లుక్ పోస్టర్ తో హింట్ కూడా ఇచ్చాడు.
అయితే తాజాగా చిరు తో శ్రీకాంత్ ఓదెల మూవీ ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అలాంటి సమయంలోనే ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న నాని ఇప్పట్లో చిరు-శ్రీకాంత్ ఓదెల మూవీ ఉండకపోవచ్చనే కామెంట్స్ చూసి హా ఇక ఈ కాంబో అటకెక్కినట్లే అంటూ మాట్లాడుకుంటున్నారు.
ప్యారడైజ్ రిజల్ట్ తో మెగాస్టార్ కూడా పునరాలోచనలో పడ్డారనే టాక్ నడిచింది. ప్యారడైజ్ రిజల్ట్ కన్నా ముందు ఆ చిత్రాన్ని అనుకున్న సమయానికి తీసుకురాకుండా లేట్ చెయ్యడంతో చిరు ప్రాజెక్ట్ ఈ ఏడాది మొదలు కావడం లేదు, కానీ తర్వాత ఖచ్చితంగా ఉటుంది అని నాని చెప్పినా చిరు-ఓదెల ప్రాజెక్ట్ మొదలయ్యేవరకు ఈ అనుమానాలు వదలవు.
















































