వాయిదా వేసి వర్క్ చేసుకుంటున్నారు
Aadarsha Kutumbam : The RR works are happening in full swing
రెండు రోజుల ముందు వరకు ఆదర్శ కుటుంబం అనుకున్న తేదీకే వస్తుంది అంటూ బల్లగుద్ది చెప్పిన మేకర్స్ చివరి నిమిషంలో సినిమాని పోస్ట్ పోన్ చేయడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆదర్శ కుటుంబం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోతే మేకర్స్ ఏ ధైర్యం తో రిలీజ్ డేట్ లాక్ చేసారు.
అక్టోబర్ 2 నుంచి వాయిదా అన్నపుడు తెలియదా, వర్క్ ఫినిష్ అవ్వలేదు అని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని నమ్ముకుంటే డేట్ ఇచ్చి ఫూల్స్ అవుతామని. ఒక్క వారం గ్యాప్ తో డేట్ లాక్ చేసి సినిమా విడుదల అన్నారు. కానీ ఇప్పుడు కూడా ఆ తేదికి రాలేకపోతున్నారు. ఇప్పుడు చూస్తే ఫుల్ స్వింగ్ లో RR వర్క్ అంటూ అప్ డేట్ ఇస్తున్నారు.
విడుదల వాయిదా వేసి వర్క్ చేసుకుంటున్నారు. ఆ కొత్త డేట్ ఇవ్వడానికి కూడా మేకర్స్ సాహసం చెయ్యలేదు అంటే థమన్ వర్క్ ఎప్పటికి ఫినిష్ చేస్తాడో ఐడియా లేదు. అయితే అసలు పనులు ఫినిష్ అవ్వలేదు, డేట్ పై నమ్మకం లేకుండా త్రివిక్రమ్ హీరో వెంకీ తో కలిసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రమోషన్స్ ఆపేసారు.
మరి ఆదర్శ కుటుంబం కొత్త డేట్ అక్టోబర్ 30 అంటున్నారు కానీ.. చూడాలి మేకర్స్ ఆ తేదీని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో అనేది.
















































