రణబాలి : భార్య-భర్తలపై విమర్శలు
Netizens’ Suggestion for Vijay and Rashmika
అక్టోబర్ 16 న విడుదల కాబోతున్న రణబాలి చిత్ర ప్రమోషన్స్ లో హీరో విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక లు ఫుల్ స్వింగ్ లో అందులోను రణబాలి చిత్ర కేరెక్టర్స్ లుక్స్ లో చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రమోషన్స్ లో ఈ భార్యాభర్తలు హైలెట్ వాడుతున్నారు. పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మూవీ కావడంతో అందరిలో ఈ చిత్రం పై అంచనాలున్నాయి.
అయితే రణబాలి చిత్ర ప్రమోషన్స్ లో విజయ్-రష్మికలు ఎంతగా హైలెట్ అవుతున్నా, అభిమానులకు ఎంత ముచ్చటగా ఉన్నా వారిపై విమర్శలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. అంటే సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి చెప్పకుండా.. వారి ప్రేమ, పెళ్లి, వివాహ బంధం గురించి మాట్లాడుతున్నారు.
షూటింగ్ విషయాలు చెప్పకుండా డేటింగ్ విషయాలు చెప్పడం, భార్య-భర్తల ముచ్చట్లు విని విని బోర్ కొట్టిన ఆడియన్స్ రణబాలి కోసం పని చేసిన టెక్నీకల్ టీమ్ , అలాగే కష్టపడి తీసిన డైరెక్టర్ రాహుల్, ప్రొడ్యూసర్, షూటింగ్ గురించి చెప్పండి, మీ పెళ్లి ముచ్చట్లు, ప్రేమ ముచ్చట్లు మాకెందుకు అంటూ విజయ్ ని రశ్మికను విమర్శించడం మాత్రం సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.
















































