అల్లు అర్జున్-బోయపాటి ఇప్పట్లో ఛాన్సే లేదు
Allu Arjun and Boyapati Srinu reunion on the cards
అల్లు అర్జున్ ని మాస్ హీరోగా చూపించింది బోయపాటి శ్రీను. సరైనోడు తో అల్లు అర్జున్ మాసిజం అభిమానులకు బాగా ఎక్కేసింది. ఆతర్వాత మళ్లీ బోయపాటి తో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశం రాలేదు. తాజాగా బోయపాటి తో అల్లు సినిమా కాంబో సెట్ అవుతుంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అది కూడా లోకేష్ కనగరాజ్ మూవీ ని ఆపేసి, అలాగే మలయాళ డైరెక్టర్ కమ్ యాక్టర్ బేసిల్ జోసెఫ్ తో అల్లు అర్జున్ సినిమా ని పక్కనపెట్టి మరీ అనే వార్త వైరల్ అవుతున్నా అది మాత్రం నమ్మశక్యంగా లేదు. కారణం లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. వచ్చే ఏడాది మొదట్లో AA 23 మొదలు కాబోతుంది.
అట్లీ, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పూర్తి కాగానే బేసిల్ మూవీ చేస్తారు అల్లు అర్జున్ ఇప్పట్లో బోయపాటి తో సినిమా చేసే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ప్రస్తుతానికి బోయపాటి - బన్నీ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలే.
















































