ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Comrade Kalyan gets solo release on October 9

కామ్రేడ్ కి భలే కలిసొచ్చింది

Comrade Kalyan gets solo release on October 9Comrade Kalyan gets solo release on October 9


అయ్యో ఆదర్శకుటుంబం మధ్యలో కామ్రేడ్ కళ్యాణ్ ఇరుక్కుపోతాడు, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ముందు కామెడీ కళ్యాణ్ బలైపోతాడు, శ్రీవిష్ణు అక్టోబర్ 9 న రిలీజ్ అని చెప్పి పెద్ద సాహసమే చేసాడు, వెంకీ కామెడీ టైమింగ్ తో పోలిస్తే శ్రీవిష్ణు కామెడీ కూడా తేలిపోతుంది అంటూ శ్రీవిష్ణు ని ఇంచుమించు చాలామందే భయపెట్టారు.

కానీ ఇప్పుడు ఆదర్శకుటుంబం పోస్ట్ పోన్ అంటూ నిర్మాతే సినిమా విడుదలకు మూడురోజుల ముందు ప్రకటించారు. ఆదర్శ కుటుంబం వాయిదా పడింది, దీనితో కామ్రేడ్ కళ్యాణ్ కు బాగా కలిసొచ్చింది. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా కామ్రేడ్ కళ్యాణ్ దిగేందుకు అన్ని శకునాలు అన్ని విధాలుగా కలిసొచ్చాయి.

ఇదే శుక్రవారం హనుమాన్ అన్స్ ఇంకా చిన్న సినిమాలు ఉన్నా అందరి కన్ను కామ్రేడ్ కళ్యాణ్ పైనే పడింది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ కి ఓ వర్గం ఆడియన్స్ ప్రత్యేక అభిమానులు. మరి ఈవారం ఇంట్రెస్టింగ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది కామ్రేడ్ కల్యాణే.

Comrade Kalyan Update