హార్ట్‌బ్రేక్, పెళ్లి, గోవా ప్రశాంతత.. మనసు విప్పిన న‌టి!

Elli Avrram dating historyElli Avrram dating history

బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్  జీవితంలో ఎదురైన  ప్రేమ వైఫల్యం నుంచి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కష్ట సమయం తనకు వ్యక్తిగత వికాసానికి ఎంతగానో తోడ్పడిందని  తెలిపారు. జీవితంలో ఎదురయ్యే బాధలు, విరిగిన క్షణాల నుంచే మనుషులు నేర్చుకుని ఎదుగుతారని  అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బాధితురాలిగా ఉండిపో కుండా ధైర్యంగా ముందుకు సాగుతూ విజయం సాధించే దిశగా అడుగులు వేయడమే ముఖ్యమని ఈ ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో అడుగుతో సాగుతుందని  స్పష్టం చేశారు.

వివాహ వ్యవస్థపై తనకున్న నమ్మకం ఇంకా చెక్కుచెదరలేదని ఎల్లీ తెలిపారు. భవిష్యత్తులో వివాహం చేసుకోవడం తన కిస్మత్లో ఉందో లేదో కాలమే నిర్ణయిస్తుందని.. కానీ ఇప్పటికీ తాను పెళ్లిని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. అయితే కేవలం ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి  భయంతో తొందరపడి ఎవరితోనైనా రాజీపడి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదన్నారు. ఒంటరితనం కారణంగా సరైన తోడు కాకుండా వేరొకరితో రాజీపడటం అంటే స్వయంగా జీవితాన్ని నాశనం చేసుకోవడమేనన్నారు.

ప్రస్తుత కష్టకాలంలో మనశ్శాంతి కోసం గోవా వెళ్లిన ఎల్లీ అక్కడ ప్రకృతి ఒడిలో లభించే ప్రశాంతత తన మానసిక వ్యవస్థను ప్రశాంతపరుస్తుందని వివరించారు. కెరీర్ విషయంలోనూ మానసిక స్థితికి సరిపోయే పాత్రలనే ఎంచుకుం టున్నట్లు చెప్పారు. `చుంబక్` చిత్రంలో అలిసియా పాత్ర తాను వ్యక్తిగతంగా కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిందని.. అది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి ఉన్నప్పుడు తెరపై తీవ్రమైన పాత్రలు పోషించడం ఎంతో అలసటను కలిగిస్తుందని, అందుకే ప్రతి నటుడు  శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని  హితవు పలికారు.

 

Elli AvrRam shares her journey of healing from heartbreak