ఫ్రైడే బాక్సాఫీస్: వెరీ డిజప్పాయింటెడ్

Friday Box Office: Very DisappointedFriday Box Office: Very Disappointed


గత వారం విడుదలైన ది ప్యారడైజ్ చిత్రం ప్రేక్షకులను ఫుల్ గా సాటిస్ఫాయ్ చెయ్యలేకపోయింది. ఇక ఈ వారం లాంగ్ వీకెండ్ కి ఏకంగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీసు దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అందులో ఫహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, తెల్ల కాగితం, సిగ్మా, డొరొతి, తత్త్వం, అనకాపల్లి, ప్రేమనే ఒక ఊరిలో లాంటి చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

వీటన్నిటిలో ఫహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి ఫ్యామిలీ బ్యాక్ రౌండ్, స్టార్ హీరోస్ ఎన్టీఆర్, మహేష్ సపోర్ట్ అన్ని ఈ చిత్రం పై అంచనాలు పెంచగా ఆ చిత్రం ఆడియన్స్ పూర్తిగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.

ఇక సందీప్ కిషన్ హీరోగా - సీఎం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సిగ్మా చిత్రం కూడా తమిళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులను కూడా డిజప్పాయింట్ చేసింది. విడుదలకు ముందున్న అంచనాలను ఈ చిత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఇక తెల్ల కాగితం చిత్రానికి కూడా పూర్ రివ్యూస్, నిరాశాజనకమైన రేటింగ్స్ వచ్చాయి.

తమిళనాట ఆహా ఓహో అన్న దొరతి తెలుగు ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. మిగతా చిత్రాలు కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమవడంతో ఈ లాంగ్ వీకెండ్ బోరింగ్ వీకెండ్ గా తయారైంది. 

This Week Theatrical Releases