ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Varalaxmi Sarathkumar says she does not want children

పిల్లలు వద్దనుకుంటున్న హీరోయిన్

Varalaxmi Sarathkumar says she does not want childrenVaralaxmi Sarathkumar says she does not want children


హీరోయిన్స్ అనేమిటి సామాన్య మహిళలైనా మాతృత్వాన్ని ఆస్వాదించాలని, పిల్లలతో ఆడుకోవాలని కోరుకుంటారు. కెరీర్ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ కూడా పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ లో బిజీగా మారుతున్నారు. 40 ప్లస్ ఏజ్ లోను తల్లవడానికి వెనుకాడడం లేదు. కానీ ఇప్పడొక హీరోయిన్ తాను అసలు పిల్లలని కనకూడదు అనుకుంటుంది.

ఆమె కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. విశాల్ తో ప్రేమలో మునిగి తేలిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆతర్వాత విశాల్ తో బ్రేకప్ చేసుకుని కాస్త గ్యాప్ ఇచ్చి ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం నటిగా కొనసాగుతూనే భర్త తో హ్యాపీగా ఉంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ భవిష్యత్తులో తాను పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లుగా చెప్పి షాకిచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ పై వరలక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు పిల్లలు పుట్టరని కాదు.. పిల్లలు వద్దన్నది పూర్తిగా నా పర్సనల్. ఆ విషయంలో నాకు స్పష్టమై ఆలోచన ఉంది. అంతేకాదు దానికి నా భర్త పూర్తి సపోర్ట్ ఉంది, అసలు ఆయన ఆలోచన కూడా ఇదే.

పిల్లలను కనెయ్యడమే తల్లితండ్రుల బాధ్యత కాదు, ఒక ప్రాణాన్ని మనం ఈ ప్రపంచంలోకి తెస్తున్నాము అంటే మనం వారిని సరైన బాధ్యతతో పెంచగలమా లేదా అని గుర్తించడమే నిజమైన పేరెంటింగ్ అని వరలక్ష్మి పిల్లలపై తన ఒపీనియన్ చెప్పుకొచ్చింది. 
 

Varalaxmi Sarathkumar opens up about her decision not to have children