బిగ్ బాస్ 10: వెక్కి వెక్కి ఏడ్చిన షాలిని

Bigg Boss 10: Shalini is cryingBigg Boss 10: Shalini is crying

 

బిగ్ బాస్ సీజన్ 10 నాలుగో వారంలో కెప్టెన్సీ టాస్క్ రసాభాసగా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో త్రిగుణ్ ఇంకా అమన్ లు టాస్క్ ఆడిన తీరు చూసి బుల్లితెర ప్రేక్షకులే అవాక్కవుతున్నారు. అమన్ త్రిగుణ్ మెడ పట్టుకుంటే, త్రిగుణ్ అమన్ ను తొక్కి పట్టడం ఇవన్ని టాస్క్ లో గొడవకు దారి తీశాయి. వారి మద్యన యుద్దాన్ని సంచాలక్ వర్షిణి కూడా ఆపలేకపోయింది.

ఇక బ్లూ టీమ్ పదే పదే ఓడిపోవడంతో బిగ్ బాస్ బ్లూ టీమ్ నుంచి ఒకరిని తప్పించమంటే టీమ్ మొత్తం త్రిగుణ్ ని తప్పించారు. ఇక మరో లెవల్ లో అందరూ అమ్మాయిలే టాస్క్ ఆడాలంటే.. బ్లూ టీమ్ లో ఉన్న సృష్టి, దేబ్జానీ, షాలిని నడుమ వాగ్వాదం జరగగా.. దేబ్జానీ షాలిని ఆడలేదు అంది. దానికి షాలిని అలిగింది.

సరే నేను డ్రాప్ అవుతా నువ్వు ఆడు అంది శ్రీష్టి షాలిని తో. కానీ షాలిని నేను ఆడలేను అంట, మరో టాస్క్ లో ఆడి చూపిస్తా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే. రోహిత్ ఇంకా సృష్టి లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసిన ప్రోమో వదిలారు.

Bigg Boss Telugu 10: Today Promo Highlights