అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మహా సంగ్రామం!

Godzilla Minas Zero vs RamayanaGodzilla Minas Zero vs Ramayana

భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ పౌరాణిక చిత్రం `రామాయణ` విడుదలకు అంతర్జాతీయ స్థాయిలో అనూహ్యమైన పోటీ ఎదురవుతోంది. ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న జపనీస్ చిత్రం `గాడ్జిల్లా మైనస్ వన్` కు సీక్వెల్‌గా `గాడ్జిల్లా మైనస్ జీరో` ‘రామాయణ’ ఒకే సమయంలో ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుద లయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవ‌లే జరిగిన సినిమాకాన్ లో వెల్లడించిన వివరాల ఈ రెండు సినిమాలు తమ దేశాల నుంచి ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్ కోసం చిత్రీకరించిన తొలి చిత్రాలుగా నిలిచాయి.

ఒకే సాంకేతికతతో, భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న రెండు చిత్రాలతో  అంతర్జాతీయ ప్రీమియం ఐమాక్స్ థియేటర్ల కోసం పోటీ నెలకొంది. `గాడ్జిల్లా మైనస్ జీరో` సినిమాను గాడ్జిల్లా డే సందర్భంగా నవంబర్ ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి జపనీస్ మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. న్యూయార్క్ సిటీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న  విజువల్ వండర్ నవంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లను ఆక్రమించే అవకాశం ఉంది.

సరిగ్గా అదే  సమయంలో రామాయణ పార్ట్ వ‌న్  సైతం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఐమాక్స్ స్క్రీన్లలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే గ్లోబల్ మార్కెట్‌లో ఆదరణ ఉన్న `గాడ్జిల్లా` ఫ్రాంచైజీ రేసులో ఉండటంతో `రామాయణ` చిత్రానికి తగినన్ని ఐమాక్స్ థియేటర్లు లభించడం సవాలుగా మారింది. 

`గాడ్జిల్లా` సినిమా కొన్ని వారాల పాటు ఐమాక్స్ థియేటర్లను హోల్డ్ చేసే అవకాశం ఉండటంతో `రామాయణ`ను అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయాలన్న నిర్మాత నమిత్ మల్హోత్రా ఆలోచనలకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. ఐమాక్స్ స్క్రీన్ల కొరత కారణంగా రామాయణ మేకర్స్  విడుదల తేదీని మారుస్తారా? లేక? థియేటర్ల కేటాయింపులో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
 

Ramayana vs Godzilla Minas Zero