ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ: త్రివిక్రమ్
Mind-blowing update on NTR God of War
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భుజానికి తగిలిన గాయంతో రెస్ట్ తీసుకుంటున్నారు. అక్టోబర్ రెండో వారం లో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సెట్ లోకి ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఆయన ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఫాహద్ ఫాసిల్ నటించిన డోంట్ ట్రబుల్ ద రంబుల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఈలోపు దర్శకుడు త్రివిక్రమ్ వెంకీతో తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తో తాను తెరకెక్కించబోయే మూవీ గురించి పంచుకున్నారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే మూవీ స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ అని అంటూ AK 47 ప్రమోషన్స్ లో త్రివిక్రం ఎన్టీఆర్ మూవీపై హైప్ క్రియేట్ చేశారు.
అయితే గాడ్ ఆఫ్ వార్ అంటూ టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. టైటిల్ అది అని చెప్పలేను ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ రెడీ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ ఫినిష్ చెయ్యగానే త్రివిక్రమ్ మూవీ మీదకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంది.
















































