ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sobhita Dhulipala supports Katrina Kaif

కత్రినా వివాదంపై శోభితా ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala supports Katrina KaifSobhita Dhulipala supports Katrina Kaif

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తల్లి అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న విమర్శలు, వ్యాఖ్యలపై నటి శోభితా ధూళిపాళ స్పందించారు. 2025 నవంబర్‌లో కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ దంపతులకు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. ప్రసవానంతరం కత్రినా శారీరక మార్పులు, బరువు పెరగడంపై నెటిజన్లు రకరకాలుగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గ్లామర్ రంగంలోని మహిళలపై ఉండే ఒత్తిళ్లు , శారీరక రూపురేఖలపై సమాజం ఉంచే అంచనాల గురించి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శోభితా ధూళిపాళ స్పందించారు.

మహిళలపై సమాజం అనేక రకాల అంచనాలను మోపుతుందని వ్యాఖ్యానించారు. `మహిళలు దృఢంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి... ఇలా వారి నుండి సమాజం చాలా విషయాలను ఆశిస్తుంది. బహిరంగ విమర్శలను ఎదుర్కోవడానికి అందరికీ ఒకే రకమైన సూత్రం ఉండదు. ఒక్కో మహిళ తమ వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఎదుర్కొంటారు. పబ్లిక్ విమర్శలు ఎదురైనప్పుడు బాధపడటం సహజమే, ఎందుకంటే మేమంతా మనుషులమే. కానీ మాకు ఏది సరైనది అనిపిస్తే ఆ రీతిలోనే దానిని అధిగమిస్తాం` అని శోభిత పేర్కొన్నారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొంటున్న కత్రినా కైఫ్‌కు బాలీవుడ్ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్ప‌టికే మద్దతుగా నిలిచారు. గర్భధారణ తర్వాత బరువు పెరగడం సహజమైన విషయమని కత్రినా  కుటుంబంతో ప్రశాంతంగా సమయం గడిపేందుకు అవకాశం ఇవ్వాలని స‌ల్మాన్ ఖాన్  సూచించారు. మ‌రో  నటి పరిణీతి చోప్రా కూడా ప్రసవానంతరం మహిళల శరీరాలపై చేసే విమర్శలను అజ్ఞానంతో కూడినవిగా అభివర్ణించారు. అలాగే హృతిక్ రోషన్ సైతం కత్రినాకు మద్దతు తెలిపే పోస్ట్‌ను లైక్ చేశారు.

Sobhita Addresses Online Scrutiny Surrounding Katrina Postpartum Journey