నిర్మాత కోసం నిలబడే హీరో
Nani is one of the few actors in the movie industry who is producer-friendly
హీరో నాని సినిమాల్లో నటించడమే కాదు నిర్మాతల కోసం నిలబడే హీరో అని ఇప్పుడు చెప్పడం కాదు, ఎప్పుడూ చెప్పే మాటే. సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ లో నాని చాలా కష్టపడతాడు. వీలైనన్ని ప్రమోషన్స్ చేస్తాడు. ఇప్పుడు చూడండి ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందు సమయం సరిపోలేదు.
దానితో లిమిటేడ్ ప్రమోషన్స్ చేసినా సినిమాకి భారీ ఓపెనింగ్స్ తీసుకోవడంలో నాని ప్రమోషనల్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యింది. కాకపోతే సినిమా విడుదలయ్యాక సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటి ని మూటగట్టుకుంది. దానితో ప్యారడైజ్ పనైపోయింది అనుకున్నారు.
కానీ నాని పోస్ట్ ప్రమోషన్స్ అంటూ ఇంటర్వ్యూ లు ఇవ్వడమే కాదు, ఈరోజు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్ళాడు. కొంతమంది ప్యారడైజ్ చిత్రం పోయింది, అయినా నాని దాన్ని ప్రేక్షకుల మీద రుద్దుతున్నాడని మాట్లాడుతుంటే మరికొంతమంది సినిమా ప్లాప్ అని తెలియగానే హీరోలు సైలెంట్ గా ఆడియన్స్ కి మొహం చాటేస్తారు.
కానీ నాని అలా కాదు నిర్మాత కోసం నిలబడే హీరో, అందుకే నిర్మాతను సేవ్ చెయ్యడానికి నాని ది ప్యారడైజ్ ప్రమోషన్స్ అంటూ కష్టపడుతూ వీలైంతమంది ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకెళుతున్నాడు అంటూ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు.
















































