ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raashii Khanna shares pictures with Rajinikanth, Ram Pothineni

ధర్మన్ సెట్ లో రామ్ పోతినేని తో రజిని

Raashii Khanna shares pictures with Rajinikanth, Ram PothineniRaashii Khanna shares pictures with Rajinikanth, Ram Pothineni

 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 షూటింగ్ పూర్తి కావడంతో ఆయన ధర్మన్ షూటింగ్ కి వెళ్లిపోయారు. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయిన ధర్మన్ సెట్ లోకి టాలీవుడ్ యంగ్ హీరో ఎంటర్ అయ్యారు. ఆయనే రామ్ పోతినేని. రామ్ పోతినేని రజినీకాంత్ ధర్మన్ మూవీలో నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు రామ్ పోతినేని ధర్మన్ మూవీలో నటిస్తున్నారు అనేది కన్ ఫర్మ్ అయ్యింది. దానికి సంబందించిన ప్రూఫ్ అంటే హీరోయిన్ రాశి ఖన్నా సూపర్ స్టార్ అలాగే రామ్ పోతినేని తో కలిసి ఉన్న ఫొటో ని షేర్ చేసింది. రాశి ఖన్నా ధర్మన్ మూవీలో నటిస్తుంది. ధర్మన్ ఫస్ట్ షాట్ రజినీకాంత్ అలాగే రాశి ఖన్నాపై చిత్రీకరించినట్టుగా దర్శకుడు అశ్విన్ మరిముత్తు చెప్పారు.

ఇక ఇప్పుడు రామ్ పోతినేని కూడా రజిని ధర్మన్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా ఈ ఫోటో ని బట్టి అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రం 2027 పొంగల్ బరిలో దించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 
 

Raashi Khanna confirms Ram Pothineni's casting in Rajinikanth Dharman