బాలయ్య మళ్లీ ఫుల్ స్వింగులోకి!
Dada shooting updateనటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ.. ఆయన మళ్లీ పూర్తి జోష్‌తో సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. గత జూన్‌లో జరిగిన ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో చిన్న గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న బాలయ్య ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.
ఈ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను మైసూర్ వేదికగా సెప్టెంబర్ 29 నుండి ప్లాన్ చేశారు. అక్టోబర్‌లో బాలకృష్ణ స్వయంగా ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.
ఈ కొత్త షెడ్యూల్‌లో భాగంగా బాలయ్యపై కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు.. ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే ఎమోషనల్ అండ్ డ్రామా ఎపిసోడ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌కు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో పెండింగ్ పనులన్నింటిని వేగవంతం చేసి సినిమాను ది బెస్ట్ గా నిలపడానికి చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
















































