ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Karthi's Sardar 2 OTT release date locked

కార్తీ సర్దార్ 2 ఓటీటీ డేట్ లాక్డ్

Karthi's Sardar 2 OTT release date lockedKarthi's Sardar 2 OTT release date locked


కోలీవుడ్ హీరో కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటించిన సర్దార్ 2 చిత్రం సెప్టెంబర్ 10 న భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ విడుదలయ్యాక సర్దార్ 2 థియేటర్స్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

సెప్టెంబర్ 10 న థియేటర్స్ లో విడుదలైన సర్దార్ 2 ఇప్పుడు ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. అది కూడా మూడు వారాల లోపే థియేటర్స్ నుంచి ఈ చిత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. సర్దార్ 2 డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకుంది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. 

Sardar 2 OTT Release Date